OnePlus 13: మోస్ట్ అవైటెడ్ వన్‌ప్లస్ 13 లాంచ్ - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయి?
OnePlus New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ తన కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను లాంచ్ చేశాడు. అదే వన్‌ప్లస్ 13. ఈ ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
OnePlus 13 Launched: వన్‌ప్లస్ 13 స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ ఇదే. కొత్త క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ రన్ కనాుంది. ఇందులో 24 జీబీ వరకు ర్యామ్, 1 టీబీ వరకు స్టోరేజ్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో 6.82 అంగుళాల అమోఎల్ఈడీ స్క్రీన్‌ను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై ఈ సినిమా రన్ కానుంది.
వన్‌ప్లస్ 13 ధర (OnePlus 13 Price)
ఇందులో నాలుగు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,499 యువాన్లుగా (మనదేశ కరెన్సీలో రూ.53,100) ఉంది. 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,899 యువాన్లుగానూ (మనదేశ కరెన్సీలో రూ.53,100), 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 5,299 యువాన్లుగానూ (మనదేశ కరెన్సీలో రూ.62,600) నిర్ణయించారు. ఇక టాప్ ఎండ్ వేరియంట్ అయిన 24 జీబీ ర్యామ్ + 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ కొనాలంటే 5,999 యువాన్లు (మనదేశ కరెన్సీలో రూ.70,900) పెట్టాల్సిందే. బ్లూ, ఆబ్సీడియన్, వైట్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. త్వరలో ఇది మనదేశంలో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
వన్‌ప్లస్ 13 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (OnePlus 13 Specifications)
ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.82 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ+ ఎల్టీపీవో అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 1 హెర్ట్జ్ నుంచి 120 హెర్ట్జ్ వరకు వేరియబుల్ కానుంది. డాల్బీ విజన్‌ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. అడ్రెనో 830 జీపీయూ కూడా అందించారు. 24 జీబీ వరకు ఎల్పీడీడీర్5ఎక్స్ ర్యామ్, 1 టీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్‌ను అందించారు. ఇందులో మైక్రో ఎస్‌డీ కార్డును పెట్టుకోవడానికి స్లాట్ లేదు.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాల సెటప్ ఉంది. ఇందులో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతో పాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫొటో కెమెరా కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరాను అందుబాటులో ఉంది.
డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, నాలుగు మైక్రోఫోన్లు ఉన్నాయి. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 7, బ్లూటూత్ వీ5.4, ఎన్ఎఫ్‌సీ, డ్యూయల్ బ్యాండ్ జీపీఎస్, యూఎస్‌బీ 3.2 జెన్ 1 పోర్టు కూడా అందించారు. ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, కలర్ టెంపరేచర్ సెన్సార్, ఈ-కంపాస్, యాక్సెలరోమీటర్, గైరోస్కోప్, హాల్ సెన్సార్, లేజర్ ఫోకస్ సెన్సార్, స్పెక్ట్రల్ సెన్సార్ ఉన్నాయి.
వన్‌ప్లస్ 13లో బయోమెట్రిక్ ఆథెంటికేష్ కోసం అల్ట్రా సోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందుబాటులో ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహచ్ కాగా, 100W ఫ్లాష్ ఛార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. వైర్డ్, 50W ఫ్లాష్ ఛార్జ్ వైర్‌లెస్ సపోర్ట్ కూడా ఉంది. రివర్స్ వైర్డ్, రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.85 సెంటీమీటర్లు కాగా, బరువు 213 గ్రాములుగా ఉంది.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే