అన్వేషించండి

IND vs AUS Test Series: ఆస్ట్రేలియా గడ్డపై భారత్ టెస్ట్ సిరీస్ ఓటమిపై జోస్యం చెప్పిన రికీ పాంటింగ్

Border Gavaskar Series | భారత క్రికెట్ జట్టు బోర్డర్ గవాస్కర్ సిరీస్ ను ఓడిపోతుందని, ఆసీస్ గడ్డ మీద ఆట అంత తేలిక కాదని మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేర్కొన్నాడు. 3-1 తేడాతో భారత్ ఓడుతుందన్నాడు.

IND vs AUS Ricky Ponting Predicts India Losing Border Gavaskar Series | హైదరాబాద్: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు అంటేనే అగ్రెసివ్ నేచర్, నోటి దురుసు, ఏదైనా చేసి గెలవడం వారికి వెన్నతో పెట్టిన విద్య అని క్రికెట్ ప్రేమికులకు తెలుసు. త్వరలో భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ జరగనుంది. నవంబర్ 22న ప్రారంభం కానున్న ఈ కీలక సిరీస్ భారీ తేడాతో నెగ్గి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరాలని భారత్ భావిస్తోంది. అయితే ఈ టెస్ట్ సిరీస్ లో భారత్ ను ఆసీస్ జట్టు చిత్తు చేస్తుందని మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేర్కొన్నాడు. 

కివీస్ చేతిలో వైట్ వాష్ తో పెరిగిన కష్టాలు

ఇటీవల రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో 0-3తో వైట్ వాష్ చవిచూసింది. సొంతగడ్డపై కివీస్‌తో వరుసగా మూడు టెస్టుల్లో ఓడిపోవడం ఇదే తొలిసారి. ఈ భారీ పరాజయంతో టీమిండియా ప్రదర్శనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ పూర్తిగా వైఫల్యం చెందాక.. WTC ఫైనల్‌కు భారత్ అర్హత సాధించే అవకాశాల్ని మరింత కఠినం చేసుకుంది. అయితే ఆస్ట్రేలియాపై భారీ తేడాతో టెస్ట్ సిరీస్ నెగ్గితే రోహిత్ సేనకు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే ఛాన్స్ ఉంది. కానీ అసాధ్యమని క్రికెట్ మాజీలు చెబుతున్నారు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సైతం ఆసీస్ చేతిలో భారత్ 3-1తో టెస్ట్ సిరీస్ ఓడిపోతుందని జోస్యం చెప్పాడు. ఆసీస్ గడ్డపై గెలుపు అంత ఈజీ కాదు. తమ గడ్డమీద ఆడుతూ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారీ తేడాతో నెగ్గడం కాదు, సిరీస్ నెగ్గడమే అసలుసిసలైన సవాల్ అన్నాడు.

టీమిండియా అనుభవం, ఆసీస్ గడ్డపై కంగారు జట్టుకు ఉన్న బలం, ప్రయోజనాలను అంచనా వేసిన రికీ పాంటింగ్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని తమ జట్టు 3-1తో నెగ్గుతుందని దీమా వ్యక్తం చేశాడు. 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ లో భారత్ ఒక టెస్ట్ మ్యాచ్‌ గెలుస్తుందని పాంటింగ్ భావిస్తున్నాడు. ఆస్ట్రేలియా జట్టుకు స్వదేశంలో ఆడటం ఎప్పటికీ ప్లస్ పాయింట్. సిరీస్ అయితే భారత్ కచ్చితంగా ఓడిపోతుందని.. ఎంత తేడాతో ఆసీస్ నెగ్గుతుందో ఐసీసీ రివ్యూలో పాంటింగ్ చెప్పుకొచ్చాడు.

షమీ లేకపోవడం భారత్ కు మైనస్

2023 వన్డే ప్రపంచ కప్ తరువాత నుంచి సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ జట్టుతో లేకపోవడం వారి కష్టాలు పెంచుతుంది. త్వరలో ప్రారంభం కానున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం షమీ లాంటి అనుభవజ్ఞుడు జట్టుకు అవసరం. అయితే గాయాల నుంచి కోలుకుని పూర్తి ఫిట్ నెస్ సాధించే ఛాన్స్ లేదని షమీని తీసుకోవడం లేదు. ఆసీస్ లాంటి పిచ్ లపై అనుభవం ఉన్న షమీ లాంటి బౌలర్ లేకపోవడం భారత్ కు నిజంగానే పెద్ద దెబ్బ. 

 షమీ ఫిట్‌గా ఉంటాడా లేదా అనే దానిపై గత ఆగస్టులో సందేహం ఉండేది. టెస్టు మ్యాచ్ లో ప్రత్యర్థి 20 వికెట్లు ఆసీస్ గడ్డపై తీయడం భారత బౌలర్లకు సవాల్. అయితే బ్యాటర్లు మాత్రం కాస్త పోరాటం చేస్తారని భావిస్తున్నట్లు రికీ పాంటింగ్ తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నాడు. కానీ ఆసీస్ లో ఆడటం అంత తేలిక కాదని భారత బ్యాటర్లకు కూడా తెలుసు. ఈ టెస్ట్ సిరీస్ ను కచ్చితంగా ఆసీస్ జట్టు నెగ్గుతుందని రికీ పాంటింగ్ మరోసారి చెప్పుకొచ్చాడు.

Also Read: IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

IND VS SL Gill Historic Milestone: గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
IND VS SL Padikkal Hundred: పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
Jaiswal- Fernando Fight: ఒకే ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన‌ జైస్వాల్.. త‌ర్వాత జైస్వాల్ ను ఔట్ చేసిన‌ ఫెర్నాండో.. ఇద్ద‌రి మధ్య మాట‌ల యుద్ధం.. ఒక‌రినొక‌రు నెట్టుకున్న వైనం..
ఒకే ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన‌ జైస్వాల్.. త‌ర్వాత జైస్వాల్ ను ఔట్ చేసిన‌ ఫెర్నాండో.. ఇద్ద‌రి మధ్య మాట‌ల యుద్ధం.. ఒక‌రినొక‌రు నెట్టుకున్న వైనం..
AUS Thrashes BAN In 2nd Test: ఐదు సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్.. ఎవ‌రితో అంటే..?
5 సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Gill Historic Milestone: గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
IND VS SL Padikkal Hundred: పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
Embed widget