అన్వేషించండి

AP Social Media Arrests: ఏపీలో సోషల్ మీడియా అరెస్టులు - నాడు వైసీపీ చేసిందే నేడు టీడీపీ చేస్తోందా ?

Andhra Pradesh: ఏపీలో సోషల్ మీడియా పోస్టుల్లో రెచ్చిపోతున్న వైసీపీ కార్యకర్తలను వరుసగా అరెస్టులు చేస్తున్నారు. దీనిపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నాడు మీరు చేసిందేమిటని టీడీపీ ప్రశ్నిస్తోంది.

Andhra Politics: ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత నాలుగు నెలల పాటు ఎలాంటి కక్ష సాధింపు రాజకీయాలకు చోటు లభించలేదు. వారు చేసినట్లే మేము ఎందుకు చేయాలని టీడీపీ నేతలు అనుకున్నారు.కూటమి నేతలు కూడా అదే అనుకున్నారు. కానీ అది చేతకానితనంగా భావించారేమో కానీ సోషల్ మీడియాలో కూటమి నేతలు, వారి కుటుంబాల్లోని మహిళలపై అత్యంత దారుణంగా పోస్టులు పెట్టడం ప్రారంభమయింది. ప్రశ్నించడం అంటే ఇంట్లో ఆడవాళ్లను బూతులు తిట్టడమే అన్నట్లుగా మారిపోయింది. ఇది కూటమి నేతలకు ఎలాంటి అసహనానికి గురి చేసిందంటే..  హోంమంత్రిత్వ శాఖపై డిప్యూటీ సీఎం ఫైర్ అయ్యేంత. ఆయన అలా అనగానే ఇలా అరెస్టుల పర్వం ప్రారంభమయింది. 

మహిళలపై అనుచిత వ్యాఖ్యలు స్వేచ్చ కాదు !

సోషల్ మీడియాలో అభిప్రాయాలు పెడితే ఎవరూ ఏమీ అనరు.కానీ అభిప్రాయం పేరుతో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం, ప్రభుత్వ పెద్దల కుటుంబాలను లాగి తీవ్ర పదజాలంతో దూషించడం వంటివి చేస్తే మాత్రం ఎవరూ సహించే అవకాశం ఉండదు. ఇప్పటికి మూడు నాలుగు సార్లు పలువురికి నోటీసులు ఇచ్చిన పోలీసులు  వారి దాడి తగ్గకపోవడంతో అరెస్టులు ప్రారంభించారు. వీరిలో ఓ నిందితుడ్ని ఎంపీ అవినాష్ రెడ్డి చొరవతో వదిలేసినట్లుగా ఆరోపణలు రావడంతో ఏకంగా ఎస్పీని బదిలీ చేశారు. అంటే ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. భావప్రకటనా స్వేచ్చ అంటే.. బూతులు తిట్టడం కాదని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

'నీకు దమ్ముంటే అవి రాసుకో' - జగన్, అవినాష్ ప్రోటోకాల్ పాటించరా?, కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్

విస్తృతంగా ఫేక్ న్యూస్ 

ఏపీలో జరుగుతున్న ప్రతి అంశంపైనా విస్తృతంగా ఫేక్ న్యూస్ స్పెడ్ అవుతూ ఉంటుంది. విజయవాడ వరదలపై జరిగిన తప్పుడు ప్రచారంపై మంత్రులంతా కలిసి ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. అయినా ఆపకపోగా మీడియాలోనూ రావడంతో ఓ పత్రిక ఎడిటర్ పై కేసు పెట్టేశారు. అనేక మంది సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టారు. ఫేక్ పోస్టులపై అనేక సార్లు ఫ్యాక్ట్ చెక్ డిపార్టుమెంట్ హెచ్చరికలు జారీ చేసింది. ఉద్దేశపూర్వకంగా  తప్పుడు ప్రచారం చేస్తే కేసులు పెడతామని హెచ్చరించింది.  ఇప్పుడు అలాగే కేసులు పెడుతున్నారు. 

Also Read: Eluru Bike Recovery: స్కూటీని హత్తుకుని మహిళ కన్నీళ్లు - ఆ కష్టం వెనుక కథ ఏంటంటే?, వైరల్ వీడియో

వైసీపీ హయాంలో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అర్థరాత్రి తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేసి తీసుకుపోయేవారు. ఇలా మొత్తం మూడు వేల కేసులు నమోదు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు టీడీపీ కూడా అదే చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది.  అయితే తాము నాలుగు నెలల పాటు సంయమనం పాటించామని అదే అలుసుగా తీసుకున్నారని ఇక సహించేది లేదని అంటున్నారు. సోషల్ రాజకీయంలో అసలు బాధితులుగా కార్యకర్తలే మిగులుతున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Adani Deal Jagan:  అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
Deeksha Diwas Telangana: 15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP DesamKCR Send off Madireddy Srinivas | ఆత్మీయుడిని అమెరికాకు పంపించిన కేసీఆర్ | ABP Desamతిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adani Deal Jagan:  అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
Deeksha Diwas Telangana: 15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Maharashtra CM: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌- 50 ఏళ్లు దాటిన వారికి కేబినెట్‌లో నో ఛాన్స్!
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌- 50 ఏళ్లు దాటిన వారికి కేబినెట్‌లో నో ఛాన్స్!
Bigg Boss Telugu Season 8 : సంచాలక్‌లకు తడిసిపోయిందే.. అసలు ఆట ఆ ముగ్గురి మధ్యే
సంచాలక్‌లకు తడిసిపోయిందే.. అసలు ఆట ఆ ముగ్గురి మధ్యే
Embed widget