అన్వేషించండి

Telangana Wineshops: తెలంగాణ‌లో నిలిచిపోయిన మ‌ద్యం స‌ర‌ఫ‌రా, అసలేం జరిగిందంటే!

Telangana Liquor Sales | తెలంగాణలో మద్యం సరఫరా నిలిచిపోవడంతో మందుబాబులు టెన్షన్ పడుతున్నారు. మద్యం షాపుల యజమానులు డిపోల నుంచి మద్యం తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

Telangana Liquor supply | హైదరాబాద్‌: తెలంగాణలో మందుబాబులకు ఇబ్బందులు తలెత్తాయి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మద్యం సరఫరా నిలిచిపోయింది. సాంకేతిక సమస్యల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మద్యం డెలివరీ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆన్ లైన్ ద్వారానే డిపోల నుంచి మద్యం దుకాణాలకు సరఫరా, బిల్లింగ్‌ ప్రక్రియ జరుగుతోంది. కానీ సర్వర్లు మొరాయిస్తుండటంతో మద్యం సరఫరాకు బుధవారం (నవంబర్ 6 తేదీ) నాడు బ్రేకులు పెడ్డాయి. టెక్నికల్ ప్రాబ్లం వల్ల అటు డీలర్లు డిపోల నుంచి మద్యం తెచ్చుకోలేకపోతున్నారు. ఇటు మందుబాబులకు కొన్ని ప్రాంతాల్లో తమకు కావలసిన బ్రాండ్లు దొరకడం లేదు. కొన్ని బ్రాండ్ల మద్యం ఇదివరకే అయిపోనట్లు సమాచారం. కనీసం రాత్రిలోపు అయినా సర్వర్ల సమస్య పరిష్కారం అయితే తెలంగాణలో మద్యం సరఫరా మళ్లీ మొదలవుతుందని అధికారులు చెబుతున్నారు. 

త్వరలో మందుబాబులకు షాక్ !

తెలంగాణలో మందు బాబులకు త్వరలోనే భారీ షాక్ తగలనుంది. ప్రభుత్వానికి అదనపు ఆదాయం కోసం ఎక్సైజ్ శాఖ త్వరలో మద్యం ధరలు పెంచడానికి ప్లాన్ సిద్ధం చేస్తోందని ప్రచారం కావడం తెలిసిందే. ఒక్కో బీరుపై దాదాపు రూ.20 వరకు ధర పెంచుతారని, అదే విధంగా లిక్కర్‌ బాటిల్స్ పై గరిష్టంగా 70 రూపాయల వరకు పెంచే అవకాశం కనిపిస్తోంది. కొత్తగా సవరించనున్న మద్యం ధరలతో తెలంగాణ ప్రభుత్వానికి అదనపు ఆదాయం నెలకు రూ.1000 కోట్ల వరకు సమకూరేలా ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకుంటుంది.

ఇటీవల మద్యం విక్రయాలతో తెలంగాణ దేశంలో అగ్ర స్థానంలో నిలవడం తెలిసిందే. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ వెల్లడించిన సర్వే ప్రకారం.. గత ఏడాది తెలంగాణలో సగటున ఒక వ్యక్తి మద్యం కోసం రూ.1,623 ఖర్చు చేశారు. ఏపీలో సగటున రూ.1,306, పంజాబ్ లో రూ.1,245, ఛత్తీస్ గఢ్ లో రూ.1,227 ఖర్చు చేసినట్లు వెల్లడించారు.

Also Read: KTR Formula Case: కేటీఆర్ చుట్టూ బిగుసుకుంటున్న ఫార్ములా ఈ రేసు స్కాం - నేడో రేపో నోటీసులు జారీచేయనున్న ఏసీబీ

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: చెవులు కుట్టించేందుకు వెళితే రెండేళ్ల పాప మృతి- జీడిమెట్లలో విషాదం
చెవులు కుట్టించేందుకు వెళితే రెండేళ్ల పాప మృతి- జీడిమెట్లలో విషాదం
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Telangana Rising Global Summit: 'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget