2008 DSC Latest News: డీఎస్సీ-2008 అభ్యర్థులకు గుడ్ న్యూస్- రేపటి లోపు ప్రక్రియ పూర్తి
Telangana News: డీఎస్సీ-2008 బాధితులకు ఇన్నాళ్లకు ఊరట లభించే వార్తను ప్రభుత్వం చెప్పింది.శుక్రవారం లోపు ప్రక్రియ పూర్తికి అధికారులు సిద్ధమవుతున్నారు.
DSC 2008 News: డీఎస్సీ-2008లో పరీక్ష రాసి కామన్‌మెరిట్‌లో క్వాలిఫై అయి ఉద్యోగాలు రానివారి అభ్యర్థుల పోరాటం ఫలించింది. వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు ఉద్యోగాలు చేతికి అందే టైంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వేల మంది నష్టపోయారు. అయితే వారిలో కొందరు తర్వాత పరీక్షలు రాసి ఉద్యోగాలు సంపాదించారు. ఏపీలో కూడా ఇలాంటి బాధితులకు ప్రభుత్వం కాంట్రాక్ట్ పోస్టులు కట్టబెట్టింది. ఇప్పుడు తెలంగాణలో కూడా అలాంటి ప్రక్రియ చేపట్టింది ప్రభుత్వం.
డీఎస్సీ-2008లో అప్పట్లో బీఈడీ చేసిన వాళ్లు కూడా ఎస్జీటీ రాసుకునే వీలుండేది. అయితే నోటిఫికేషన్ పడిన తర్వాత పరీక్ష దగ్గర పడుతున్న వేళ బీఈడీ వాళ్లు సెకండరీ గ్రేడ్ టీచర్ల పోస్టులకు అర్హులుకారని ప్రకటించింది ప్రభత్వం. దీంతో అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో వారికి 30 శాతం కేటాయించారు. ఈ కారణంగా డీఈడీ చేసిన వాళ్లు కూడా నష్టపోయారు. వాళ్లంతా వేర్వేరుగా పోరాటాలు చేస్తూ వస్తున్నారు.
రెండేళ్ల క్రితమే ఉద్యోగాలు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
2008 నుంచి అటు కోర్టుల్లో పోరాడుతూనే ప్రభుత్వాలకు వినతి పత్రాలు ఇస్తూ వచ్చారు బాధితులు. అయినా న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయని రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చేందుకు ఏ ప్రభుత్వం మొగ్గు చూపలేదు. అయితే ఏపీ ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసి వారికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చేందుకు అంగీకరించింది. కనీస టైం స్కేల్ ఇస్తూ తాత్కాలిక ఉద్యోగాలు ఇచ్చింది. దీని కోసం ఓ కమిటీ వేసి మధ్యే మార్గంగా ఈ నిర్ణయం తీసుకుంది.
రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత అదే ఫార్ములా పాటిస్తోంది. డీఎస్సీ-2008లో నష్టపోయిన వారికి కాంట్రాక్ట్ టీచర్లుగా పోస్టింగ్‌లు ఇచ్చేందుకు ఓకే చెప్పింది. అక్టోబర్‌లోనే దరఖాస్తులు పరిశిలీంచాలని విద్యాశాఖాధికారులకు ఆదేశాలు వెళ్యాయి. అయితే జాబితా గందరగోళంగా ఉందన్న కారణంగా ప్రక్రియ వాయిదా పడింది.
ఇప్పుడు మరోసారి వారి సర్టిఫికేట్లు పరిశీలించి 2,367 మంది అభ్యర్థులకు పోస్టింగ్స్ ఇవ్వాలని నిర్ణయించారు. సెప్టెంబరు నెలాఖరులోపు పేర్లు నమోదు చేసుకున్న వారి సర్టిఫికేట్లు పరిశీలిస్తారు. సంగారెడ్డి, నల్గొండ, రంగారెడ్డి, హనుమకొండ, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో నష్టపోయిన అభ్యర్థులు ఉన్నట్టు తేల్చారు.
అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన, పోస్టింగ్స్ ఇచ్చే ప్రక్రియ సజావుగా సాగేందుకు ఒక్కో జిల్లాకు ఒక్కో స్పెషల్ ఆఫీసర్‌ను ప్రభుత్వం నియమించింది. ఎలాంటి ఆరోపణలు, ఇతర న్యాయపరమైన సమస్యలు రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 8 లోపు ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది.
కోర్టులు తీర్పు ఇచ్చినా తాత్సారం
బీఈడీ అభ్యర్థులకు అనుకూలంగా 2013 జులై 15న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా పలు కారణాలతో వీరికి ఉద్యోగాలివ్వలేదు. 2017, 2022లో తెలంగామ హైకోర్టు బీఈడీ అభ్యర్థులకు అనుకూలంగా తీర్పులు వచ్చాయి. పిటిషనర్లకు ఉద్యోగాలు ఇవ్వాలని స్పష్టం చేశాయి. ఒకే నోటిఫికేషన్‌లో బాధితులు ఒక రాష్ట్రంలో ఉద్యోగాల్లో ఉండటం, ఒక రాష్ట్రంలో న్యాయం కోసం ఎదురుచూడటం సరికాదని కోర్టులు వ్యాఖ్యానించాయి. కాంట్రాక్ట్ పద్ధతిలోనైనా ఉద్యోగాలు ఇవ్వాలని సూచించాయి.
Also Read: 75 ప్రశ్నలతో తెలంగాణలో ఇంటింట సమగ్ర సర్వే- సేకరించే వివరాలు ఇవే