అన్వేషించండి

Donald Trump Social Post: నేను వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడ్ని.. సంచలనంగా మారిన డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారిక పోర్ట్రెయిట్ ట్రూత్ సోషల్ పోస్టులో తాను "వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడు, జనవరి 2026" అని పేర్కొన్నారు. దాంతో వెనిజులాపై ఆధిపత్యం చెలాయించే అవకాశముంది.

Acting President Of Venezuela | న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా సైట్ ట్రూత్ సోషల్ లో చేసిన పోస్ట్ కలకలం రేపుతోంది. అందులో తన హోదాను "వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడు"గా ట్రంప్ పేర్కొన్నారు. ఆదివారం నాడు ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేసిన ఈ పోస్ట్ లో ట్రంప్ అధికారిక ఫొటో ఉంది, ఆ తర్వాత వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడు, ఇన్కంబెంట్ జనవరి 2026 అని రాసి ఉంది. జనవరి 20న పదవిని చేపట్టిన అమెరికా 45వ, 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. 

ఈ నెల ప్రారంభంలో అమెరికా సైన్యం వెనిజులాపై పెద్ద ఎత్తున దాడి చేసి, రాజధాని కారకాస్ నగరంలోని నివాసంపై దాడి చేసి అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించింది. అతనితో పాటు అతని భార్య సిలియా ఫ్లోరెస్‌ను సైతం అమెరికా సైన్యం న్యూయార్క్‌కు తరలించింది. అక్కడ వారిపై నార్కో-టెర్రరిజం కుట్ర ఆరోపణలు మోపగా కోర్టులో విచారణకు హాజరుపరిచారు. 

వెనిజులాను పాలిస్తామన్న ట్రంప్..

 "సురక్షితమైన, సరైన పాలన వచ్చేంత వరకు" వెనిజులాను అమెరికా నడుపుతుందని అగ్రరాజ్యాధినేత ట్రంప్ చెప్పారు. వెనిజులా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోని మరెవరైనా వెనిజులాను స్వాధీనం చేసుకునే అవకాశం ఇవ్వలేమని వెనిజులా ఉపాధ్యక్షురాలు, తాత్కాలిక అధ్యక్షురాలు, చమురు శాఖల మంత్రి డెల్సీ రోడ్రిగ్జ్ అన్నారు. వెనిజులా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గత వారం దేశ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఆమె అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు.

తాత్కాలిక అధికారులు వెనిజులాలో 30 నుండి 50 మిలియన్ బ్యారెల్స్ "అధిక నాణ్యత గల, ఆంక్షలు విధించిన చమురు"ను అమెరికాకు అందజేయాలని ట్రంప్ అన్నారు.  ఈ చమురును మార్కెట్ ధరలో విక్రయించాలని అమెరికా భావిస్తోంది.

అమెరికాకు సైతం వెనిజులా ముడి చమురు నగదు

"ఆ డబ్బును నేను అమెరికా అధ్యక్షుడిగా వెనిజులాతో పాటు అమెరికా ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా చూస్తాను. ఈ పథకాన్ని వెంటనే అమలు చేయమని ఇంధన కార్యదర్శి క్రిస్ రైట్‌ను కోరాను. ఇది నిల్వ నౌకల ద్వారా తీసుకుంటాం. దాంతో నేరుగా యునైటెడ్ స్టేట్స్‌లోని అన్‌లోడింగ్ డాక్‌లకు తరలిస్తారని" డొనాల్డ్ ట్రంప్ అన్నారు. 

చైనా, రష్యా సహా పలు దేశాలు అమెరికా నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఐక్యరాజ్యసమితి సైతం అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇది పలు దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు ఇజ్రాయెల్, అమెరికా సైన్యం ఇరాన్ పై దాడులకు యత్నిస్తున్నాయి. మరోవైపు ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన, నిరసన ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. అక్కడ జరిగిన నిరసనలో పాల్గొన్న వారిలో 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వేల మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమ ప్రజలపై దాడులు చేస్తే కనుక తాము ఇజ్రాయెల్, అమెరికా సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని ఇరాన్ అధినేత హెచ్చరించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CPI leader Narayana: శ్రీవారికి భక్తుడిగా మారిన కమ్యూనిస్టు దిగ్గజం - బీజేపీ స్పందన ఇదే !
శ్రీవారికి భక్తుడిగా మారిన కమ్యూనిస్టు దిగ్గజం - బీజేపీ స్పందన ఇదే !
Ind vs Nam Match Highlights: T20 ప్రపంచ కప్‌లో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసిన టీమిండియా! నమీబియాపై ఘనవిజయం!  
T20 ప్రపంచ కప్‌లో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసిన టీమిండియా! నమీబియాపై ఘనవిజయం!  
YSRCP: మండలిలోనే పోరాటం - శాసనసభ బహిష్కరణ - వైసీపీఎల్పీ సమావేశంలో జగన్ నిర్ణయం
మండలిలోనే పోరాటం - శాసనసభ బహిష్కరణ - వైసీపీఎల్పీ సమావేశంలో జగన్ నిర్ణయం
Vishwak Sen: ఫ్లాపుల్లోనూ 'ఫంకీ'కి కెరీర్ బెస్ట్ బిజినెస్... విశ్వక్ సేన్‌ లాస్ట్ 5 ఫిలిమ్స్ కంపేరిజన్ చూస్తే?
ఫ్లాపుల్లోనూ 'ఫంకీ'కి కెరీర్ బెస్ట్ బిజినెస్... విశ్వక్ సేన్‌ లాస్ట్ 5 ఫిలిమ్స్ కంపేరిజన్ చూస్తే?
Advertisement

వీడియోలు

Mumbai Muscial Road | ముంబైలో ఏర్పాటు చేసిన ఈ రోడ్డు సంగీతం పాడుతుంది | ABP Desam
India va Namibia Match Preview | T20 World Cup 2026 లో మోత మొదలు పెడతారా.? | ABP Desam
Rohit Sharma on 2027 ODI World Cup | వన్డే వరల్డ్ కప్ భారత్ గెలుస్తుందని హిట్ మ్యాన్ ధీమా | ABP Desam
Saqlain Mushtaq on Ind vs Pak Match Pitch | మ్యాచ్ ఆడకముందే ఏడుపులు మొదలు | ABP Desam
Sanju Samson Playing Against Namibia | నమీబియాతో మ్యాచ్ లో బరిలోకి దిగనున్న సంజూ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CPI leader Narayana: శ్రీవారికి భక్తుడిగా మారిన కమ్యూనిస్టు దిగ్గజం - బీజేపీ స్పందన ఇదే !
శ్రీవారికి భక్తుడిగా మారిన కమ్యూనిస్టు దిగ్గజం - బీజేపీ స్పందన ఇదే !
Ind vs Nam Match Highlights: T20 ప్రపంచ కప్‌లో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసిన టీమిండియా! నమీబియాపై ఘనవిజయం!  
T20 ప్రపంచ కప్‌లో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసిన టీమిండియా! నమీబియాపై ఘనవిజయం!  
YSRCP: మండలిలోనే పోరాటం - శాసనసభ బహిష్కరణ - వైసీపీఎల్పీ సమావేశంలో జగన్ నిర్ణయం
మండలిలోనే పోరాటం - శాసనసభ బహిష్కరణ - వైసీపీఎల్పీ సమావేశంలో జగన్ నిర్ణయం
Vishwak Sen: ఫ్లాపుల్లోనూ 'ఫంకీ'కి కెరీర్ బెస్ట్ బిజినెస్... విశ్వక్ సేన్‌ లాస్ట్ 5 ఫిలిమ్స్ కంపేరిజన్ చూస్తే?
ఫ్లాపుల్లోనూ 'ఫంకీ'కి కెరీర్ బెస్ట్ బిజినెస్... విశ్వక్ సేన్‌ లాస్ట్ 5 ఫిలిమ్స్ కంపేరిజన్ చూస్తే?
Ambati Rambabu remanded: తగ్గేదే లే.. మళ్లీ రాజమండ్రి జైలుకు అంబటి రాంబాబు - లక్కీ డ్రా కేసులో 14 రోజుల రిమాండ్
తగ్గేదే లే.. మళ్లీ రాజమండ్రి జైలుకు అంబటి రాంబాబు - లక్కీ డ్రా కేసులో 14 రోజుల రిమాండ్
MS Dhoni:'ఎంఎస్ ధోని రూ. 10 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది', మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు!
'ఎంఎస్ ధోని రూ. 10 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది', మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు!
AP Liquor Scam: లిక్కర్ స్కామ్‌కు అసలు ఆర్కిటెక్ట్ రాజ్ కేసిరెడ్డే - బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
లిక్కర్ స్కామ్‌కు అసలు ఆర్కిటెక్ట్ రాజ్ కేసిరెడ్డే - బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
Cop elopes with history sheeter : ఖాకీ ప్రేమ.. ఖైదీతో పరార్- పెళ్లి పీటల మీద పోలీస్ వరుడికి షాకిచ్చిన మహిళా కానిస్టేబుల్!
ఖాకీ ప్రేమ.. ఖైదీతో పరార్- పెళ్లి పీటల మీద పోలీస్ వరుడికి షాకిచ్చిన మహిళా కానిస్టేబుల్!
Embed widget