The Raja Saab Collection : 'ది రాజా సాబ్' మూడు రోజుల కలెక్షన్స్ - డార్లింగ్ హారర్ ఫాంటసీ ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?
The Raja Saab Box Office Collection Day 3 : ప్రభాస్ 'ది రాజా సాబ్' మూడు రోజుల్లో మంచి కలెక్షన్స్ సాధించింది. అటు ఓవర్సీస్‌లోనూ కలెక్షన్స్ అదిరిపోయాయంటూ మూవీ టీం అనౌన్స్ చేసింది.

Prabhas's The Raja Saab Three days Box Office Collections : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ది రాజా సాబ్' మూవీ కలెక్షన్స్ కాస్త ఊపందుకున్నాయి. ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ సాధించగా... రెండో రోజు కాస్త తగ్గాయి. వరల్డ్ వైడ్‌గా 3 రోజుల్లో రూ.150 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లు నివేదికలు చెబుతున్నాయి.
3 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
ఈ మూవీకి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.161 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ప్రముఖ ట్రేడింగ్ వెబ్ సైట్ Sacnilk తెలిపింది. ఇండియావ్యాప్తంగా రూ.129.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.31.80 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక సంక్రాంతి నాటికి రూ.200 కోట్ల క్లబ్‌లో చేరుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అటు, ఓవర్సీస్‌లో మూవీ మంచి కలెక్షన్స్ రాబడుతోందని టీం ప్రకటించింది. నార్త్ అమెరికాలో ఇప్పటివరకూ $2.2M (రూ.19.38 కోట్లు) దాటినట్లు అనౌన్స్ చేసింది.
ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ.112 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు మూవీ టీం అధికారికంగా వెల్లడించింది. ఇక 2 రోజుల్లో ఇండియావ్యాప్తంగా రూ.81.58 కోట్ల నెట వసూళ్లు సాధించినట్లు సమాచారం. మూడో రోజు ఇండియాలో రూ.22.6 కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలిపింది.
View this post on Instagram
View this post on Instagram
Also Read : మెగా బ్లాక్ బస్టర్ 'మన శంకరవరప్రసాద్ గారు' - మెగాస్టార్ మరో ఘనత... ప్రీమియర్స్ కలెక్షన్స్ ఎంతంటే?
ఓల్డ్ లుక్... సూపర్ రెస్పాన్స్
ఈ మూవీలో రాజుగా ప్రభాస్ ఓల్డ్ లుక్ అదిరిపోయింది. ట్రైలర్స్, టీజర్లలో చూపించిన తర్వాత ఆ హైప్ పదింతలైంది. అయితే, సినిమాలో ఆ లుక్ మిస్ కావడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఫస్ట్ డే మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఈ క్రమంలో ప్రభాస్ ఓల్డ్ లుక్ సీన్స్ యాడ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. అసలు, ముందే ఈ సీన్స్ యాడ్ చేసుంటే చాలా ప్లస్ అయ్యుండేదంటూ డార్లింగ్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. కొందరు 'ఈ సీన్‌ను ఎలా కట్ చేయాలనిపించింది?' అంటూ డైరెక్టర్ మారుతిని ట్యాగ్ చేశారు. ప్రస్తుతం డార్లింగ్ కొత్త లుక్స్‌తో థియేటర్లలో ఎంజాయ్ చేస్తున్నారు.
ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. వీరితో పాటే బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్, జరీనా వహాబ్, వీటీవీ గణేష్, సప్తగిరి, ప్రభాస్ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ప్రభాస్ ఫస్ట్ టైం హారర్ ఫాంటసీ థ్రిల్లర్‌లో నటించారు.






















