By: Ram Manohar | Updated at : 28 Jul 2022 12:46 PM (IST)
లండన్‌లో స్థిరపడిన కేరళకు చెందిన ఓ వ్యక్తి ఫ్యామిలీ ట్రిప్ కోసం సొంతగా విమానం తయారు చేసుకున్నాడు (Image Credits:Facebook\ashok.thamarakshan)
Kerala Man Built Plane:
2 సీటర్ విమానం చాలటం లేదు..
కరోనా లాక్‌డౌన్‌లో మీరు ఏం చేశారు..? అది జరిగిపోయి ఏడాదవుతోంది. ఇప్పుడెందుకీ ప్రశ్న అనుకుంటున్నారా..? ఎందుకంటే ఈ లాక్‌డౌన్ సమయంలోనే అందరూ పర్సనల్ లైఫ్‌కి టైమ్ కేటాయించారు. తమలోని క్రియేటివిటీని బయటకు తీశారు. ఎంతో మంది ఉద్యోగాలు మానేసి మరీ తమకు ఇష్టమైన పనులు చేసుకుంటూ ఇప్పుడు లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇదంతా జరిగింది లాక్‌డౌన్ టైమ్‌లోనే. అయితే కేరళకు చెందిన ఓ వ్యక్తి కూడా లాక్‌డౌన్ సమయంలోనే తన క్రియేటివిటీకి పదును పెట్టాడు. చాలా రోజులు శ్రమించి ఏకంగా ఓ విమానమే తయారు చేసుకున్నాడు. తాను తయారు చేసుకున్న ఈ విమానంలో ఫ్యామిలీ ట్రిప్ కూడా వెళ్లాడు. యూరప్‌లో చక్కర్లు కొట్టాడు. కేరళకు చెందిన అశోక్ అలిసెరిల్ తమరక్షణ్..లండన్‌లో తన ఫ్యామిలీతో ఉంటున్నారు. అక్కడ లాక్‌డౌన్ విధించిన సమయంలో ఈ ఫోర్ సీటర్ విమానం తయారు చేశాడు. ఇందుకోసం దాదాపు 18 నెలల పాటు శ్రమించాడు. ఈ Sling TSI మోడల్ విమానానికి తన చిన్న కూతురు దియా పేరునే పెట్టుకున్నాడు. 2006లో లండన్‌లో మాస్టర్స్ చేసేందుకు వెళ్లాడు అశోక్. ప్రస్తుతం ఫోర్డ్ మోటర్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఎమ్మెల్యే ఏవీ తమరక్షణ్ కుమారుడైన అనిల్ 2018లోనే పైలట్ లైసెన్స్ పొందాడు. అప్పటి నుంచి 2 సీటర్ విమానాలను అద్దెకు తీసుకుని ట్రిప్‌లకు వెళ్తుండేవాడు. "మా కుటుంబంలో నలుగురు సభ్యులమున్నాం. 2 సీటర్ విమానం చాలటం లేదు. అందుకే 4 సీటర్ విమానం అవసరమైంది. కానీ అలాంటి విమానాలు దొరకటం చాలా అరుదు. దొరికినా అవెంతో పాతవై ఉంటాయి. అందుకే నేనే తయారు చేసుకున్నా" అని వివరిస్తున్న అశోక్.
One way to own a private jet is to make one. ! Ashok Aliseril Thamarakshan during lockdown has actually built this to fly across the world. #iamdivyareddy #lockdownlife pic.twitter.com/R6IEqA40pC
— Divya Reddy (@itsDivyaReddy) July 27, 2022
తయారీకి రూ.1.8 కోట్లు ఖర్చైంది..
4 సీటర్ ఎందుకు దొరకటం లేదని సుదీర్ఘంగా ఆలోచించిన అశోక్...దానిపై రీసెర్చ్ చేశాడు. ఇందుకోసం జొహెన్నస్‌బర్గ్‌లోని స్లింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ కంపెనీకి వెళ్లాడు. 2018లో Sling TSI మోడల్ విమానాన్ని లాంచ్ చేసింది ఈ సంస్థ. ఈ ఫ్యాక్టరీని సందర్శించిన తరవాత అశోక్...సొంతగా విమానం తయారు చేసుకునేందుకు అవసరమైన కిట్‌ను ఆర్డర్ చేశాడు. అప్పటి నుంచి ఈ విమానం తయారు చేసేందుకు శ్రమించాడు. దీని తయారీ ఖర్చు రూ.1.8 కోట్లు అని చెప్పాడు అశోక్ అలిసెరిల్.
Also Read: Optical Illusion: కింద ఇచ్చిన చిత్రం మీ రొమాంటిక్ రిలేషన్‌షిప్ గురించి చెప్పేస్తుంది, ట్రై చేయండి
Dogfishing : అమ్మాయిలతో డేటింగ్‌కు కుక్క పిల్ల రికమండేషన్
Kuppam Gold Mines : కుప్పంలో బంగారు గనులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్, రూ.450 కోట్లకు ఎన్ఎండీసీ టెండర్లు!
Karnataka Accident : కర్ణాటక బీదర్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి
Governor At Home : రాజ్ భవన్ ఎట్ హోమ్ కు సీఎం కేసీఆర్ గైర్హాజరు, ఆఖరి నిమిషంలో రద్దు
Breaking News Telugu Live Updates: కర్ణాటక బీదర్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి
Tummmala Nageswararao : హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల
Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ
Independence Day 2022: ఆట పెంచిన ప్రేమ - భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విదేశీ ఆటగాళ్లు!
CM Jagan : ఏపీకి పెట్టుబడుల వెల్లువ, అచ్యుతాపురం సెజ్ లో పరిశ్రమలకు సీఎం జగన్ శంకుస్థాపన