(Source: ECI/ABP News/ABP Majha)
Tesla in India: భారత్‌లో ఫ్యాక్టరీ పెట్టేందుకు టెస్లా ఓకే, కానీ ఆ ఒక్క కండీషన్ వల్లే ఆలస్యం!
Tesla Factory in India: భారత్‌లో ఫ్యాక్టరీ తెరిచేందుకు టెస్లా ఓ కండీషన్ పెట్టింది.
Tesla Factory in India:
భారత్‌కి టెస్లా..?
భారత్‌లో ఫ్యాక్టరీ పెట్టేందుకు టెస్లా ఎప్పటి నుంచో కసరత్తు చేస్తోంది. ఆ మధ్య ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు టెస్లా అధినేత ఎలన్ మస్క్‌తో భేటీ అయ్యారు. టెస్లా అందుకు సిద్ధంగానే ఉన్నప్పటికీ ఓ విషయంలో మాత్రం వెనకడుగు వేస్తోంది. భారత్‌లో ఫ్యాక్టరీ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతూనే ఓ కండీషన్ పెట్టింది. ఫ్యాక్టరీ పెట్టిన రెండేళ్ల పాటు తమ వాహనాలపై దిగుమతి సుంకాన్ని 15%కి తగ్గించాలని అడుగుతోంది. ఇదే జరిగితే ఇండియాలో 2 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు రెడీగా ఉన్నామని స్పష్టం చేసింది. ఇప్పటికే ఇండియా ఈ ఆలోచనలో ఉంది. 40 వేల డాలర్ల కన్నా ఎక్కువ ఖరీదున్న కార్లపై 100% దిగుమతి పన్ను విధిస్తోంది. దీన్ని 15%కి తగ్గించాలని భావిస్తోంది. కొత్త EV Policyలో ఈ మార్పులు చేసేందుకు కసరత్తు చేస్తోంది. భారత్‌లోనే తయారు చేసిన కార్‌లకు ఈ పన్నుని తగ్గించాలనీ చూస్తోంది. ఒకవేళ 12వేల వెహికిల్స్‌కి Import Dutyని 15%కి తగ్గించేందుకు అంగీకరిస్తే 500 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రానుంది. ఒకవేళ 30 వేల వాహనాలకు ఈ రాయితీ ఇస్తే 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకైనా సిద్ధంగానే ఉంది టెస్లా. అయితే...ఈ ప్రపోజల్‌ని కేంద్రం పరిశీలిస్తోంది. టెస్లా అనుకున్నట్టుగా 2 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టేందుకు భారత్ సానుకూలంగానే ఉన్నప్పటికీ...దిగుమతి అయ్యే వాహనాల సంఖ్యలో మాత్రం కాస్త వెనకంజ వేస్తోంది. టెస్లా చెబుతున్నట్టుగా 30 వేల వాహనాలను దిగుమతి చేసే ప్రతిపాదనకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఈ సంఖ్య తగ్గించుకోవాలి చెబుతోంది. అయితే...ఇప్పటి వరకూ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు కేంద్రం. త్వరలోనే ఈ డీల్ కుదిరే అవకాశాలున్నాయి.
కొనసాగుతున్న సంప్రదింపులు..
ఇంతకుముందు టెస్లా పూర్తిగా అసెంబుల్డ్ ఎలక్ట్రిక్ కార్లపై 40 శాతం దిగుమతి సుంకాన్ని విధించాలని కోరింది. 40,000 డాలర్ల కంటే తక్కువ ధర ఉన్న వాహనాలకు ప్రస్తుతం 60 శాతం, అంతకంటే ఎక్కువ ధర ఉన్న వాహనాలకు 100 శాతం దిగుమతి సుంకం అందుబాటులో ఉంది. ఎలక్ట్రిక్ కార్లు, హైడ్రో కార్బన్ వాహనాలకు భారతదేశ కస్టమ్స్ డ్యూటీ ఒకేలా ఉంటుంది. భారత ప్రభుత్వం స్థానిక తయారీని ప్రోత్సహించడానికి అధిక సుంకాలను విధిస్తుంది. అయితే టెస్లా తన కార్లను లగ్జరీ కార్లకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలుగా వర్గీకరించాలని వాదిస్తోంది. క్లీన్ ఎనర్జీతో నడిచే వాహనాలకు తక్కువ పన్నులు ఉండేలా దిగుమతి విధానంలో కొత్త విభాగాన్ని ప్రవేశపెట్టవచ్చు. ఒక అధికారి తెలుపుతున్న దాని ప్రకారం ఈ ప్రోత్సాహకం టెస్లాకు మాత్రమే కాదు. అన్ని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడానికి కట్టుబడి ఉన్న ఏ కంపెనీకైనా ఇదే విధమైన ఏర్పాటు ఉంటుందని తెలుస్తోంది.
Also Read: China H9N2 outbreak: చైనాలో ఫ్లూ కేసులపై కేంద్రం కీలక ప్రకటన, భారత్‌కి ముప్పేమీ లేదని క్లారిటీ
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply