అన్వేషించండి

China H9N2 outbreak: చైనాలో ఫ్లూ కేసులపై కేంద్రం కీలక ప్రకటన, భారత్‌కి ముప్పేమీ లేదని క్లారిటీ

China H9N2 Outbreak: చైనాలో ఫ్లూ కేసులు పెరుగుతున్న క్రమంలో భారత్ కీలక ప్రకటన చేసింది.

H9N2 Outbreak in China:

చైనాలో ఫ్లూ కేసులు..

న్యుమోనియా దాడితో (China Pneumonia Cases) చైనా సతమతం అవుతోంది. అక్కడి చిన్నారులు ఊపిరి పీల్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రులన్నీ బాధితులతో నిండిపోతున్నాయి. చైనాలో ఉన్నట్టుండి ఈ  కేసులు పెరుగుతుండడం ప్రపంచదేశాలనూ భయపెడుతోంది. మళ్లీ కొవిడ్ తరహా మహమ్మారి దాడి చేస్తుందేమోనని వణికిపోతున్నాయి. ప్రస్తుతానికి చైనాలో వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్‌కి H9N2 గా పిలుస్తున్నారు. దీన్నే Avian influenza virusగా చెబుతున్నారు సైంటిస్ట్‌లు. ఈ క్రమంలోనే భారత్ కీలక ప్రకటన చేసింది. చైనాలో ఫ్లూ కేసులు పెరగడంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్టు వెల్లడించింది. ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులను పరిశీలిస్తున్నట్టు తెలిపింది. భారత్‌కి ఈ ముప్పు పెద్దగా ఏమీ ఉండదని తేల్చి చెప్పింది. ప్రస్తుతానికి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఒకవేళ ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. చైనాలో ఈ కేసులు పెరిగిన వెంటనే Directorate General of Health Services (DGHS) ప్రత్యేకంగా సమావేశమైంది. భారత్‌లో ఇదే ఫ్లూ వ్యాప్తి చెందితే ఎలా కట్టడి చేయాలో చర్చించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ ఫ్లూపై ఇప్పటికే కీలక వ్యాఖ్యలు చేసింది. మనిషి నుంచి మనిషికి సోకే అవకాశాలు తక్కువేనని, మరణాల రేటు కూడా తక్కువేనని వెల్లడించింది. 

"ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాలోని ఫ్లూ కేసులపై అసెస్‌మెంట్ చేసింది. మనిషి నుంచి మనిషికి సోకే అవకాశాలు చాలా తక్కువేనని తేల్చింది. మరణాల రేటు కూడా తక్కువే నమోదయ్యే అవకాశాలున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు H9N2 కేసులను పరిశీలిస్తోంది. ఇప్పటికైతే భారత్‌కి వచ్చిన ముప్పేమీ లేదు. ఒకవేళ అలాంటి పరిస్థితులే వస్తే ఎదుర్కొనేందుకు భారత్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది"

- కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ

మనుషుల నుంచి జంతువులకు ఈ వైరస్ సోకుతుందా లేదా అన్నదీ నిఘా పెట్టాలని కేంద్రం అధికారుల్ని అప్రమత్తం చేసింది. ఇక చైనా విషయానికొస్తే...కొవిడ్ తరవాత ఆ స్థాయిలో హెల్త్ ఎమర్జెన్సీని ఎదుర్కొంటోంది. అన్ని స్కూల్స్‌లోనూ ఈ కేసులు నమోదవుతున్నాయి. హాస్పిటల్స్ కెపాసిటీకి మించి బాధితులు చేరుతున్నారు. విద్యార్థులతో పాటు టీచర్‌లూ ఈ వైరస్ బారిన పడుతుండడం వల్ల పూర్తిగా స్కూల్స్ మూతబడుతున్నాయి. 

Also Read: Deepfake Crackdown: డీప్‌ఫేక్‌ కంటెంట్‌పై నిఘా పెట్టనున్న స్పెషల్ ఆఫీసర్, కేంద్రం కీలక నిర్ణయం

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tragedy Incident: ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
Sai Durgha Tej - Pawan Kalyan: జనసేనాని నుంచి మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు స్పెషల్ గిఫ్ట్ - దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?
జనసేనాని నుంచి మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు స్పెషల్ గిఫ్ట్ - దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?
Hydra Real Estate: చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
Embed widget