అన్వేషించండి

Tesla in India: త్వరలోనే ఇండియాలో టెస్లా ఈవీ ఫ్యాక్టరీ! ఒక్కో కారు రూ.20 లక్షలు!

Tesla in India: త్వరలోనే టెస్లా ఇండియాలో పెద్ద ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది.

Tesla in India: 

ఏటా 5 లక్షల కార్‌ల తయారీ..! 
 
అన్నీ అనుకున్నట్టుగా జరిగితే...త్వరలోనే ఇండియన్స్ టెస్లా ఎలక్ట్రిక్ కార్లు (Tesla Electric Cars) కొనుగోలు చేసుకునే ఛాన్స్ వచ్చేస్తుంది. అది కూడా మన ఇండియాలోనే తయారవుతాయి. కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటికే టెస్లా చర్చలు జరుపుతోంది. త్వరలోనే ఇండియాలో టెస్లా ఫ్యాక్టరీ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే ఇండియాలో తయారయ్యే టెస్లా ఎలక్ట్రిక్ కార్‌ల ధర రూ.20 లక్షల వరకూ ఉంటుందని అంచనా. సంవత్సరానికి కనీసం 5 లక్షల కార్లు తయారు చేసేలా భారీ ప్లాన్‌తో రెడీ అవుతోంది టెస్లా కంపెనీ. మరో హైలైట్ ఏంటంటే..కేవలం ఇండియాలో విక్రయించేందుకే కాదు. మొత్తం ఇండో పసిఫిక్‌ రీజియన్‌కి ఇక్కడి నుంచి కార్‌లను సప్లై చేయాలని  చూస్తోంది టెస్లా. అంటే...ఈ మొత్తానికి ఇండియా హబ్‌గా ఉండనుంది. అయితే..దీనిపై ఇప్పటి వరకూ టెస్లా నుంచి కానీ కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. గతంలో కేంద్రం, టెస్లా మధ్య చిన్న విభేదాలు తలెత్తాయి. ఇండియాకు కార్‌లు ఇంపోర్ట్ చేయడం కష్టమవుతోందని టెస్లా అసహనం వ్యక్తం చేసింది. దీనిపై కేంద్రం కూడా గట్టిగానే స్పందించింది. దిగుమతి పన్ను తగ్గించాలని టెస్లా అడిగినా కేంద్రం అందుకు ఒప్పుకోలేదు. టెస్లా ఇండియాకు వచ్చి ఇక్కడే కార్‌లు తయారు చేస్తేనే డీల్‌కి ఒప్పుకుంటామని తేల్చి చెప్పింది భారత్. దీనిపై చాన్నాళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. 

మార్కెట్ పెంచుకోవడం కోసం..

ఇప్పటికే కొన్ని అమెరికన్ కంపెనీలు అమెరికా దాటి తమ వ్యాపారాన్ని విస్తృతం చేసుకోవాలని చూస్తున్నాయి. ఇక చైనా, యూఎస్ మధ్య ఉన్న విభేదాలతో మార్కెట్ కూడా దెబ్బ తింటోంది. అందుకే....కేవలం అమెరికాకే పరిమితం కాకుండా విదేశాల్లోనూ మార్కెట్‌ని ఎస్లాబ్లిష్ చేసుకోవాలని చూస్తోంది టెస్లా. ఇప్పటికే యాపిల్ (Apple)సహా ఆ కంపెనీ సప్లైయర్స్ ఇండియాలో యూనిట్స్ పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ ఏడాది టెస్లా, భారత్ మధ్య చర్చలు కాస్త పాజిటివ్‌గానే జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది మే నెలలో టెస్లా అధికారులు భారత ప్రభుత్వ అధికారులతో భేటీ అయ్యారు. సప్లై చైన్‌ ఎక్స్‌పాన్షన్‌పై ఆరా తీశారు. ఇటీవల ప్రధాని అమెరికా పర్యటనకు వెళ్లగా అక్కడ టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌తో  ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మోదీకి పెద్ద ఫ్యాన్‌ని అంటూ మస్క్ ట్వీట్ కూడా చేశారు. అప్పటి నుంచి టెస్లా ఇండియాకు వచ్చేస్తుందన్న ప్రచారం జోరందుకుంది. ఈ ప్రచారమే నిజమైతే త్వరలోనే ఇండియా రోడ్లపై టెస్లా ఎలక్ట్రిక్ కార్‌లు చక్కర్లు కొడతాయి. అయితే...ఇదంత సింపుల్‌గా జరుగుతుందా లేదా అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. మస్క్ మామ ఎప్పుడు మనసు మార్చుకుంటారో అర్థం కాదు. భారత్ పెట్టిన డిమాండ్‌ల విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గినా మళ్లీ కథంతా మొదటికే వస్తుంది. 

Also Read: చైనా లోన్‌ యాప్‌ వేధింపులకు మరొకరు బలి, తిరిగి చెల్లించలేక యువకుడి ఆత్మహత్య

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Ponguleti: 'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
Redmi A4 5G: రూ.9 వేలలోపే 5జీ ఫోన్! - రెడ్‌మీ ఏ4 5జీ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు వస్తుందంటే?
రూ.9 వేలలోపే 5జీ ఫోన్! - రెడ్‌మీ ఏ4 5జీ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు వస్తుందంటే?
KTR: 'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

PV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP DesamUSA White House Special Features | వైట్ హౌస్ గురించి ఈ సంగతులు మీకు తెలుసా..? | ABP DesamUS Election Results 5 Reasons for Kamala Harris Defeat

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ponguleti: 'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
Redmi A4 5G: రూ.9 వేలలోపే 5జీ ఫోన్! - రెడ్‌మీ ఏ4 5జీ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు వస్తుందంటే?
రూ.9 వేలలోపే 5జీ ఫోన్! - రెడ్‌మీ ఏ4 5జీ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు వస్తుందంటే?
KTR: 'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Bajaj Freedom 125: ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్ - సేల్స్‌లో దూసుకుపోతున్న బజాజ్ ఫ్రీడమ్ 125!
ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్ - సేల్స్‌లో దూసుకుపోతున్న బజాజ్ ఫ్రీడమ్ 125!
Vangalapudi Anitha: 'సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకుంటాం' - సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారికి హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్
'సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకుంటాం' - సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారికి హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్
Chandrababu: మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
Mancherial News: మద్యం తాగి వాహనం నడుపుతున్నారా? - ఇకపై ఆస్పత్రిలో శుభ్రత పనులు చేయాల్సిందే!, మంచిర్యాల కోర్టు వినూత్న తీర్పు
మద్యం తాగి వాహనం నడుపుతున్నారా? - ఇకపై ఆస్పత్రిలో శుభ్రత పనులు చేయాల్సిందే!, మంచిర్యాల కోర్టు వినూత్న తీర్పు
Embed widget