Covid-19 Vaccine For Children: చిన్నారులకు కరోనా వ్యాక్సిన్.. ఎప్పుడంటే?
కరోనా సెకండ్ వేవ్ తగ్గిన తరువాత చిన్నారులకు ముప్పు పొంచి ఉంటుందని వదంతులు ప్రచారమయ్యాయి. ఈ క్రమంలో చిన్నారులకు వ్యాక్సిన్ తీసుకురావడంపై కేంద్ర ప్రభుత్వం కీలకమైన ప్రకటన చేసింది.
కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను దేశంలోని చిన్నారులకు త్వరలోనే అందుబాటులోకి తేనున్నారు. ఆగస్టు నెల నుంచి దేశంలోని చిన్నారులకు కోవిడ్-19 వ్యాక్సిన్‌ను అందించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆగస్టులో చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మంగళవారం నాడు (జులై 27న) జరిగిన ఓ సమావేశంలో కేంద్ర మంత్రి మాండవీయ చిన్నారులకు వ్యాక్సిన్ అందించే విషయాన్ని వెల్లడించారు. కరోనా థర్డ్ వేవ్ ముప్పు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా చిన్నారులకు వ్యాక్సినేషన్ ప్రారంభించడానికి చర్యలు చేపడుతోంది.
భారత్‌లో ఆగస్టు - సెప్టెంబర్ నెలలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని ఇటీవల ప్రచారం జరిగింది. ఈ క్రమంలో నిపుణులు సైతం థర్డ్ వేవ్ గురించి ప్రజలను హెచ్చరించారు. ఈ క్రమంలో ఆగస్టు నుంచి చిన్నారులకు కోవిడ్-19 వ్యాక్సిన్ అందించేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ ఊరట కలిగించే విషయాన్ని వెల్లడించారు. మరోవైపు గత ఏడాది నుంచి తక్కువ సంఖ్యలో నమోదవుతున్న రెస్పిరేటరీ వైరస్ పాజిటివ్ కేసులు చిన్నారులలో క్రమక్రమంగా పెరిగిపోతున్నాయని తాజా నివేదికలలో స్పష్టమైంది.
కరోనా వ్యాక్సిన్లు చిన్నారులపై సమర్థవంతంగా పనిచేస్తున్నాయని సమాచారం. సాధ్యమైనంత త్వరగా చిన్నారులు, టీనేజీ (13 నుంచి 18 ఏళ్లు) వారికి కరోనా టీకాలు ఇచ్చి మహమ్మారిపై పోరాటం ముమ్మరం చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దేశంలో చిన్నారులకు సెప్టెంబర్ నెల నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం అవుతుందని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా గత వారం ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఫైజర్, జైడస్ వ్యాక్సిన్లు త్వరలోనే చిన్నారులకు అందుబాటులోకి రానున్నాయని గులేరియా పేర్కొన్నారు.
కరోనా థర్డ్ వేవ్ ముప్పు త్వరలోనే పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రముఖ వైద్య నిపుణులు గత కొంతకాలం నుంచి హెచ్చరిస్తున్నారు. కోవిడ్-19 నిబంధనలు తప్పినిసరిగా పాటిస్తే కరోనా థర్డ్ వేవ్ రాకుండా మరికొంత కాలం నిలువరించవచ్చుని అప్పటివరకూ చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఇటీవల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. థర్డ్ వేవ్ ముప్పు నేపథ్యంలో భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను చిన్నారులపై విజయవంతంగా ప్రయోగించారు. గుజరాత్‌కు చెందిన జైడస్ కాడిల్లా కోవిడ్-19 వ్యాక్సిన్‌ను సైతం చిన్నారులపై పరీక్షిస్తున్నారు.
Also Read: Corona Vaccine Incentives: వ్యాక్సిన్ వేసుకో.. డైమండ్ వాచ్, అపార్ట్ మెంట్ తీసుకో!