By: Sri Harsha | Updated at : 01 Mar 2023 07:34 PM (IST)
ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన చిన్నారుల వీడియో
- వైరల్ అవుతున్న కేరళ కలెక్టర్ మామ వీడియో
- కలెక్టర్ మామ ఎందుకు రాలేదని చిన్నారుల కోపం
- ఓ క్యూట్ వీడియోను కలెక్టర్ కే పంపించిన చిన్నారులు
- అలెప్పీ జిల్లాలో కలెక్టర్ మామగా మారిన కృష్ణతేజ
- కేరళ క్యాడర్ అధికారిగా పనిచేస్తున్న మైలవరపు కృష్ణతేజ
ఈ పిల్లలు చెబుతున్నది ఏంటంటే... అలెప్పీ జిల్లా కలెక్టర్ కృష్ణతేజను ఓ స్కూల్ యానివర్సికీ గెస్ట్ గా పిలిచారు. కలెక్టర్ గా ఆయనకుండే హడావిడిలో ఆ ప్రోగ్రామ్ కి వెళ్లటం కుదరలేదు. దీంతో కోపం వచ్చిన ఆ పిల్లలంతా కలెక్టర్ మామా మాకు కోపం వచ్చింది అంటూ ఓ క్యూట్ వీడియోను కలెక్టర్ కే పంపారు
ఇంతకీ కలెక్టర్ మీద ఆ పిల్లలకు ఇంత ఆప్యాయత ప్రేమ ఉండటానికి ఓ రీజన్ ఉంది. తెలుగు వ్యక్తి, కేరళ ఐఏఎస్ క్యాడర్ అధికారి అయిన కృష్ణ తేజ కు కేరళ వరదల సమయం నుంచి అలెప్పీతో చాలా అనుబంధం ఉంది. అప్పుడు ఆపరేషన్ కుట్టునాడు, ఐయామ్ ఫర్ అలెప్పీ ప్రోగ్రామ్ లను సబ్ కలెక్టర్ గా ఉండి నిర్వహించి వరద ప్రభావం నుంచి ప్రజలను కాపాడి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న కృష్ణ తేజ. ఆ తర్వాత మళ్లీ అలెప్పీ జిల్లాకు కలెక్టర్ గా వచ్చారు.
కొవిడ్ కల్లోలం తర్వాత చాలా మంది పిల్లలు చదువుకు దూరం కావాల్సిన పరిస్థితి. ఈ టైమ్ లో కలెక్టర్ గా కృష్ణ తేజ తీసుకున్న ఓ నిర్ణయం చాలా మందికి చదువును తిరిగి అందిస్తోంది. అలెప్పీ జిల్లాలో ఎక్కెడక్కడ చదువుకు దూరమైపోయిన పిల్లలున్నారో గుర్తించారు కృష్ణతేజ. చాలా మంది పిల్లలకు తల్లితండ్రుల్లో ఎవరో ఒకరు మరణించటం..ఆర్థికంగా చితికిపోవటం జరిగిందని గుర్తించారు. అలాంటి పిల్లలను లిస్ట్ అవుట్ చేసి.. స్పాన్సర్ల దృష్టికి ఈ పిల్లల పేర్లను తీసుకెళ్లారు. వారి ద్వారా జిల్లా వ్యాప్తంగా అనేక పాఠశాలల్లో ఆ చదువుకు దూరమైన పిల్లలు తిరిగి చదువుకునేలా వాళ్లకో దారి చూపించారు. ఇక అది మొదలు ఆ పిల్లలు కలెక్టర్ మామన్ అని మలయాళంలో సంబోధిస్తూ వాళ్లకు తోచిన విధంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు.
డ్రాయింగ్ వచ్చిన వాళ్లు కలెక్టర్ ఫోటోలు గీసి ఆయనకే బహుమతిగా అందిస్తున్నారు. కొంతమంది పర్సనల్ గా కృతజ్ఞతలు చెబుతున్నారు. దానికి తోడు పేదపిల్లల ఇళ్లలో పరిస్థితులను బాగు పరిచేలా చిల్ట్రన్ ఫర్ అలెప్పీ అని ఇటీవల ఇంకో ప్రోగ్రామ్ ను స్టార్ట్ చేశారు కలెక్టర్ కృష్ణతేజ. గొప్పింటి పిల్లలు..పేద పిల్లలకు సహాయం చేసేలా స్కూళ్లలో కమ్యూనిటీ డేలను నిర్వహిస్తున్నారు. వాలంటరీగా పిల్లలు తీసుకువచ్చి ఇస్తున్న వస్తువును పేద విద్యార్థుల కుటుంబాలకు అందిస్తూ వారి జీవనానికి దోహదపడుతున్నారు. సో ఇన్ని మంచి పనుల ఫలితమే ఆ పిల్లల చిరుకోపం అన్నమాట. మా స్కూల్ కి పిలిస్తే మా మామ రానంత బిజీ గా ఉన్నాడా అని ఆ చిన్నారుల ఈ క్యూట్ వీడియోను చేసి కలెక్టర్ కృష్ణతేజకు పంపించారన్నమాట.
5G మొదలైందో లేదో అప్పుడే 6G గురించి మాట్లాడుతున్నాం, భారత్ విశ్వాసానికి ఇది నిదర్శనం - ప్రధాని మోదీ
RRB Group D Result: రైల్వే 'గ్రూప్-డి' తుది ఫలితాలు విడుదల, ఉద్యోగాలకు ఎంతమంది ఎంపికయ్యారంటే?
Delhi Liquor Policy: సిసోడియా కస్టడీ మరోసారి పొడిగింపు,బెయిల్ పిటిషన్‌పై ఈడీ వివరణ కోరిన కోర్టు
Gautam Adani: కోటీశ్వరుల కష్టాలు! వారానికి రూ.3000 కోట్లు నష్టపోతున్న అంబానీ!
దయచేసి రిజైన్ చేయండి, లేదంటే మేమే బయటకు పంపాల్సి ఉంటుంది - జుకర్ బర్గ్ మెయిల్ వైరల్
Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే
IND Vs AUS 3rd ODI: మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా - సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఎంతంటే?
Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్
Cars Price Hike: ఏప్రిల్ 1 నుంచి మరింత పెరగనున్న కార్ల ధరలు - ఎందుకు? ఎంత?