అన్వేషించండి

Driving License And RC: డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్సీ కార్డులు మరింత ఆలస్యం - అదే కారణం

Microchip Shortage: దేశంలో మైక్రోచిప్‌ ల కొరత కారణంగా డ్రైవింగ్ లైసెన్స్ లు, ఆర్సీల జారీలో జాప్యం జరగనుంది.

Microchip Shortage: కరోనా తెచ్చిన వివిధ సమస్యల్లో మైక్రో చిప్ సమస్య కూడా ఒకటి. అప్పుడు మొదలైన మైక్రోచిప్ ల కొరత ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు మైక్రోచిప్ ల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఆటో మొబైల్స్, కంప్యూటర్స్, స్మార్ట్ ఫోన్లు, గ్రాఫిక్ కార్డ్స్, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీలపై దీని ప్రభావం ఎక్కువగా పడింది. భారత్ లోని ఆటో మొబైల్ కంపెనీలు కూడా మైక్రో చిప్ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం ఈ కొరత ప్రభుత్వ రంగ సంస్థలపైనా పడింది. మైక్రో చిప్ ల కొరత కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో స్మార్ట్ కార్డు ఆధారిత డ్రైవింగ్ లైసెన్స్ వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ల (ఆర్సీ కార్డులు) జారీ ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. కరోనా సమయంలో అన్ని రకాల పరిశ్రమలు మూత పడటంతో మైక్రో చిప్ లను ఉత్పత్తి చేసే కంపెనీలు వాటి తయారీని ఆపేశాయి. తర్వాత కరోనా లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ఒక్కసారిగా మైక్రో చిప్ లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో డిమాండ్ కు తగ్గ సప్లయ్ లేక వాటి ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో మైక్రో చిప్ లను దిగుమతి చేసే కంపెనీలు వెనకా ముందూ చూసుకుంటూ ఆచితూచి వ్యవహరించడం మొదలు పెట్టాయి. అలాగే రష్యా- ఉక్రెయిన్ యుద్ధం పరిస్థితిని మరింతగా దిగజార్చింది. ఈ నేపథ్యంలో మైక్రో చిప్ లు దొరక్క చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ పరిణామాలే తాజాగా దేశంలో డ్రైవింగ్ లైసెన్సు జారీ, ఆర్‌సీ కార్డుల జారీ ఆలస్యం అవుతోంది.

తెల్లబంగారంలా మారిన సిలికాన్

మైక్రోచిప్‌ల తయారీలో అత్యంత ముఖ్యమైన ముడి పదార్థం సిలికాన్. దీని వాడకం ప్రపంచవ్యాప్తంగా గణనీయంగా ఉంది. కానీ నాణ్యమైన సిలికాన్ మాత్రం కొన్ని ప్రాంతాల్లోనే దొరుకుతుంది. మెరుగైన ఎలక్ట్రానిక్ పరికరాలకు అత్యంత నాణ్యమైన ముడిపదార్థాలు అవసరం. స్ఫటిక శిలల్లో నాణ్యమైన సిలికాన్ దొరుకుతుంది. అంత నాణ్యమైన స్ఫిటిక రాళ్లు అమెరికాలోని నార్త్ కరోలినాలో ఉన్న స్ప్రూన్ పైన్ ప్రాంతంలో దొరుకుతాయి. ప్రపంచంలోని దాదాపు ప్రతి మొబైల్ ఫోన్, కంప్యూటర్ చిప్ లోనూ స్ప్రూన్ పైన్ గనుల్లో వెలికితీసిన సిలికాన్ ఉంటుంది. స్ప్రూన్ గనుల్లో చాలా ఏళ్ల క్రితం నుంచి తవ్వకాలు జరుపుతున్నాయి. 1980లలో సెమీకండక్టర్ పరిశ్రమ వృద్ధి చెందడంతో ఈ సిలికాన్ తెల్ల బంగారంలా మారిపోయింది.

పెద్ద పెద్ద రాళ్లను కంకరగా మారుస్తారు. అనంతరం వాటిని కంకర ఇసుకలా మార్చేస్తారు. తర్వాత వాటికి నీళ్లు రసాయనాలు కలుపుతారు. ఆ తర్వాత పౌడర్ లా తయారు చేసి మరో రిఫైనరీకి పంపుతారు. ఈ పౌడర్ ను కొలిమిలో కరిగించి స్తూపాకార కడ్డీలుగా మారుస్తారు. డిజైన్ ను బట్టి వెయ్యి నుంచి 2 వేల ప్రత్యేక దశలను దాటుకుని సిలికాన్ చిప్ తయారు చేస్తారు. స్ప్రూన్ పైన్ గనుల్లో ఏటా 30 వేల టన్నుల సిలికాన్ మాత్రమే తీస్తున్నారు. వాటితో ప్రతి సంవత్సరం వందల కోట్ల మైక్రోచిప్ లు తయారు చేస్తారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు 
ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు 
Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
Supreme Court Litigant Hurls Abuses Judges: సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
Karur Stampede Case Update: కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Ramayana Trailer : విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
HYDRAA Inaction On Owaisi Encroachments: ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
Telangana Political Mind Games: విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
Thamizh Murugan Vs God of War: ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
Embed widget