Malavika Mohanan: లోకల్ ట్రైన్‌లో ముద్దు అడిగాడు - మాళవికా మోహనన్‌కు చేదు అనుభవం
Malavika Mohanan Bitter Experience: హీరోయిన్ మాళవికా మోహనన్ ముంబై లోకల్ ట్రైన్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తాజాగా వివరించారు. ఓ వ్యక్తి ఇబ్బందికరంగా బిహేవ్ చేసినట్లు చెప్పారు.

Malavika Mohanan Shares Bitter Experience: ముంబై లోకల్ ట్రైన్‌లో తనను ఓ వ్యక్తి ముద్దిస్తావా అంటూ సైగలు చేసినట్లు హీరోయిన్ మాళవికా మోహనన్ (Malavika Mohanan) అన్నారు. తనతో, తన స్నేహితులతో ఇబ్బందికరంగా ప్రవర్తించినట్లు తెలుపుతూ.. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తాజాగా వివరించారు.
'అతని ప్రవర్తనతో భయపడ్డా'
'ముంబయిలో ఓ రోజు రాత్రి నా స్నేహితులతో కలిసి లోకల్ ట్రైన్‌లో జర్నీ చేశాను. ఆ కంపార్ట్‌మెంట్‌లో మేం కాకుండా మరెవరూ లేరు. ఆ టైంలో ఓ వ్యక్తి అందులోకి వచ్చేందుకు యత్నించాడు. కంపార్ట్‌మెంట్ వద్ద ఉన్న గ్లాస్ డోర్ నుంచి తొంగిచూస్తూ ముద్దిస్తావా అంటూ సైగలు చేశాడు. అతని బిహేవియర్‌తో నేను, నా ఫ్రెండ్స్ భయపడ్డాం. మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. దాదాపు 10 నిమిషాల తర్వాత వేరే స్టేషన్ రాగానే కొంతమంది ప్రయాణికులు మా కంపార్ట్‌మెంట్‌లో ఎక్కారు. దీంతో మేం ఊపిరి పీల్చుకున్నాం.' అని మాళవిక తెలిపారు.
Also Read: ధనుష్, నాగార్జున 'కుబేర' ఫస్ట్ సాంగ్ వచ్చేసింది - 'పోయి రా మావా' చూసేద్దామా!
'అమ్మాయి మరీ సన్నగా ఉండకూడదు'
సౌత్‌లో హీరోయిన్‌గా కనిపించాలంటే అమ్మాయి మరీ సన్నగా ఉండకూడదని మాళవిక అన్నారు. హీరోయిన్స్ ఏ విధంగా ఉండాలనే విషయంలో ప్రతీ ఇండస్ట్రీకి కొన్ని ప్రమాణాలు ఉన్నాయని.. అన్ని చోట్లా ఒకేలా ఉండవని తెలిపారు. 'శరీరాకృతి విషయంలో నేను ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా. కొన్నిసార్లు విమర్శలు చాలా బాధించాయి. హీరోయిన్ లుక్స్ విషయంలోనూ ప్రతి చిత్ర పరిశ్రమకు కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. నేను కాస్త బరువు పెరిగి ముంబయిలో సినిమా చేయాలనుకుంటే తప్పే అవుతుంది. నా మేనేజరే బరువు తగ్గమని చెబుతాడు.
అయితే, కాస్త సన్నబడి చెన్నైలో వర్క్ కోసం వెళ్తే.. వాళ్లు ఏమాత్రం అంగీకరించరు. బొద్దుగా బాగుంటావు. కొంచెం బరువు పెరగమని సూచిస్తారు. మహిళల శరీరాకృతి పట్ల తరచూ ఎవరో ఒకరి నుంచి కామెంట్స్ ఎదురవుతూనే ఉంటాయి. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన టైంలో కొన్ని పరిస్థితుల తర్వాత నేను లావుగా ఉండాలా? సన్నబడాలా? అనే దానిపై కన్ఫ్యూజన్‌కు గురయ్యా. మెల్లగా పరిస్థితులను అర్థం చేసుకుని మూవ్ అయ్యాను. ఏది ఏమైనప్పటికీ ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలని నిర్ణయించుకున్నా.' అని మాళవిక అన్నారు.
నాపై ట్రోలింగ్ చేశారు
21 ఏళ్లకే హీరోయిన్‌గా కెరీర్ మొదలుపెట్టానని.. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో లుక్స్ పరంగా విమర్శలు ఎదుర్కొన్నట్లు మాళవిక తెలిపారు. నా ఫస్ట్ సినిమా రిలీజ్ అయ్యాక చాలా సన్నగా ఉన్నానని తనను ట్రోల్ చేసినట్లు చెప్పారు. 'ఫస్ట్ సినిమా తర్వాత నా శరీరాకృతి ఎంతో మారింది. కొంచెం బొద్దుగా మారిన తర్వాత కూడా విమర్శించారు. దక్షిణాది చిత్రాల్లో కనిపించాలంటే అమ్మాయి కాస్త బొద్దుగా ఉండాలి. అక్కడ హీరోయిన్స్ బొడ్డు మీదే ఎక్కువ ఫోకస్ పెడతారు. హీరోయిన్స్ కూడా తమ బొడ్డు కనిపించేలా దిగిన ఫోటోలనే ఎక్కువగా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.' అని అన్నారు. మాళవిక పలు తమిళం, మలయాళం సినిమాల్లో నటించారు. ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'ది రాజాసాబ్'తో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు.






















