Rashmi Gautam: యాంకర్ రష్మీకి సర్జరీ - బాగానే ఉన్నానంటూ పోస్ట్, అసలు ఏం జరిగిందంటే?
Rashmi Gautam Surgery: ప్రముఖ యాంకర్ రష్మీకి సర్జరీ జరిగింది. గత కొంతకాలంగా భుజం నొప్పితో బాధ పడుతున్న ఆమెకు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు.

Anchor Rashmi Gautam Shoulder Surgery Completed: ప్రముఖ యాంకర్, నటి రష్మీకి (Rashmi Gautam) సర్జరీ జరిగింది. చాలా కాలంగా భుజానికి సంబంధించిన సమస్యతో బాధ పడుతున్నారు. భుజం నొప్పితో పాటు బ్లడ్ బ్లీడింగ్ కావడంతో ఇబ్బందికి గురయ్యారు. దీంతో డాక్టర్ల సూచన మేరకు ఆస్పత్రిలో చేరగా సర్జరీ పూర్తి చేశారు.
హెల్ప్ చేసిన వారందరికీ థ్యాంక్స్
సర్జరీ విజయవంతంగా పూర్తైందని.. పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు రష్మి తన ఇన్ స్టా వేదికగా వెల్లడించారు. 'నా హిమోగ్లోబిన్ 5 రోజుల్లో 9కి పడిపోయినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. అలాంటి క్లిష్ట సమయంలో నాకు సపోర్ట్ చేసిన కుటుంబ సభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు. జనవరి నుంచి నాకు భుజం నొప్పితో బ్లడ్ బ్లీడింగ్ అవుతోంది. అప్పటి నుంచి ఇబ్బంది పడుతూనే ఉన్నా. డాక్టర్స్‌ను సంప్రదిస్తే ముందు దేనికి ట్రీట్మెంట్ తీసుకోవాలో కూడా తెలియలేదు. మార్చి 29 నాటికి పూర్తిగా నీరసించిపోయాను. వర్క్ పరమైన కమిట్మెంట్స్ అన్నీ పూర్తి చేసిన తర్వాత ఏప్రిల్ 18న నాకు ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు అంతా బాగానే ఉంది. మూడు వారాల విశ్రాంతి తర్వాత మళ్లీ నా వర్క్ ప్రారంభిస్తాను.' అని ఆమె పోస్ట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్.. త్వరగా రికవర్ కావాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
Also Read: ఎన్టీఆర్ నీల్ 'డ్రాగన్'పై బిగ్ అప్‌డేట్ - ఈ వారంలోనే షూటింగ్ సెట్‌లోకి ఎన్టీఆర్
రష్మీ గత కొంతకాలంగా భుజం నొప్పితో బాధ పడుతున్నారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తన భుజాన్ని సరి చేసుకోవాల్సిన సమయం వచ్చిందని.. దీని వల్ల తనకు ఇష్టమైన డ్యాన్స్ చేయలేకపోతున్నట్లు తెలిపారు. అందుకే సర్జరీకి రెడీ అయ్యానని.. అది పూర్తయ్యాక పూర్తిగా సెట్ అవుతుందని నమ్ముతున్నట్లు చెప్పారు. దీంతో ఆమెకు ఏం జరిగిందో అంటూ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు.
బుల్లితెరతో పాటు వెండితెరపైనా క్రేజ్
అటు బుల్లితెరతో పాటు ఇటు వెండితెరపైనా తన అందం, అభినయం, డ్యాన్స్, నటనతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు రష్మి గౌతమ్. ముఖ్యంగా 'ఎక్స్ ట్రా జబర్దస్త్' కార్యక్రమం ఆమె కెరీర్‌నే మలుపు తిప్పింది. దీంతో పాటే శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ డ్యాన్స్ షోలు సైతం నిర్వహిస్తున్నారు. సుడిగాలి సుధీర్ - రష్మీ జంటగా స్మాల్ స్క్రీన్‌పై కనిపిస్తే ఆ క్రేజే వేరు. ఫెస్టివల్స్, స్పెషల్ షోల సమయంలో టీవీల్లో వీరు చేసే సందడి అంతా ఇంతా కాదు.
'యువ' అనే టీవీ షో ద్వారా రష్మీ బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత లవ్, ఐడియా సూపర్ అనే షోలు కూడా చేశారు. కామెడీ షో 'జబర్దస్త్'కు అనసూయ గుడ్ బై చెప్పడంతో రష్మీకి ఛాన్స్ వచ్చింది. దీంతో ఫుల్ ఫేమ్ సంపాదించుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ వెండితెరపైనా మంచి గుర్తింపు సాధించుకున్నారు. కరెంట్, బిందాస్, ప్రస్థానం, అంతకుమించి, గుంటూర్ టాకీస్, హాస్టల్ బాయ్స్ వంటి సినిమాల్లో నటించి మెప్పించారు.





















