యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు దశాబ్ద కాలంగా బల్లితెరపై స్టార్ యాంర్‌గా రాణిస్తుంది 27 ఏప్రిల్ 1988లో జన్మించిన రష్మి, రేపటితో 35 ఏళ్లు పూర్తి చేసుకోబోతుంది రష్మిది బ్రహ్మణ కుటుంబ నేపథ్యం తల్లి ఒరియా, తండ్రి ఉత్తరప్రదేశ్, కానీ విశాఖపట్నంలో స్థిరపడ్డారు బ్రహ్మణ కుటుంబంలో జన్మించిన రష్మి, విశాఖపట్నం ఢిల్లి పబ్లిక్ స్కూల్లో విద్యాభ్యాసం చేసింది డిగ్రి డిస్టెన్స్‌లో చేసిన రష్మి నటనపై ఆసక్తితో సినీరంగ ప్రవేశం చేసింది 2002లో ఉదయ్ కిరణ్ 'హోలీ' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది, ఇందులో సునీల్ గర్ల్‌ఫ్రెండ్‌గా అలరించింది. ఆ తర్వాత 'కరెంట్', 'ప్రస్థానం', 'బిందాస్', ఇటీవల '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' వంటి చిత్రాల్లో కీలక పాత్రలు చేసింది 'గుంటూరు టాకీస్'తో హీరోయిన్‌గా మారిన రష్మి, ఇందులో సిద్ధు జొన్నలగడ్డ సరసన హీరోయిన్‌గా నటించింది ప్రస్తుతం పాపులర్ కామెడీ షో జబర్దస్త్‌లో యాంకర్ చేస్తున్న ఆమె ఢీ షోలోనూ సుధీర్, ప్రదీప్‌లతో కలిసి యాంకర్‌గా సందడి చేసింది.