PBKS vs RCB: టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ, మొన్న ఓటమికి పంజాబ్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందా? కానీ వర్షం ముప్పు
PUNJAB KINGS vs Royal Challengers Bengaluru | మొహాలిలో ఏప్రిల్ 20న పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్‌లో వర్షం పడే అవకాశం ఉంది. టాస్ నెగ్గిన ఆర్సీబీ ఫీల్డింగ్ ఎంచుకుంది.

IPL 2025 PBKS vs RCB | ఐపీఎల్ 2025లో భాగంగా 37వ మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. మొహాలీలోని ముల్లాన్‌పూర్ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. రెండు జట్లు ఇటీవల బెంగళూరులో తలపడ్డాయి, ఆ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. చివరికి 14 ఓవర్లకు మ్యాచ్ కుదించగా ఆర్సీబీపై పంజాబ్ జట్టు విజయం సాధించింది. నేడు జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా ప్రభావితం కానుంది.
గత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఆథిత్య RCBని ఓడించింది. సీజన్లో 7 మ్యాచ్‌ల్లో పంజాబ్ కు అది 5వ విజయం. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలోని పంజాబ్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. రజత్ పాటిదార్ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 మ్యాచ్‌ల్లో 4 గెలిచి పాయింట్స్ టేబుల్‌లో ఐదవ స్థానంలో ఉంది.
PBKS vs RCB ముఖాముఖీ పోరు
పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఇప్పటివరకూ ఐపీఎల్ టైటిల్ గెలవని జట్లు అని తెలిసిందే. ఈ టోర్నమెంట్‌లో రెండు జట్లు మొత్తం 34 మ్యాచ్‌లలో తలపడగా, వాటిలో ఆర్సీబీ 16 మ్యాచ్‌ల్లో, పంజాబ్ 18 మ్యాచ్‌ల్లో నెగ్గాయి. పంజాబ్ పై ఆర్సీబీ అత్యధిక స్కోరు 241 పరుగులు చేయగా, ఆర్సీబీపై పంజాబ్ అత్యధిక స్కోరు 232 పరుగులు చేసింది.
🚨 Toss 🚨@RCBTweets won the toss and elected to bowl against @PunjabKingsIPL in Match 37.
— IndianPremierLeague (@IPL) April 20, 2025
Updates ▶️ https://t.co/6htVhCbltp#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/gg5M40bjrg
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ 11
1 ఫిల్ సాల్ట్, 2 విరాట్ కోహ్లి, 3 రజత్ పాటిదార్ (కెప్టెన్), 4 రొమారియో షెపర్డ్, 5 జితేష్ శర్మ (వికెట్ కీపర్), 6 టిమ్ డేవిడ్, 7 కృనాల్ పాండ్యా, 8 భువనేశ్వర్ కుమార్, 9 జోష్ హెజిల్‌వుడ్, 10 యశ్ దయాల్, 11 సుయాష్ శర్మ
RCB ఇంపాక్ట్ ప్లేయర్స్: దేవదత్ పడిక్కల్, రసిఖ్ దార్, జాకబ్ బెథెల్, స్వప్నిల్ సింగ్, మనోజ్ భాండాగే,
పంజాబ్ కింగ్స్ ప్లేయర్స్ ప్లేయింగ్ 11
1 ప్రభ్‌సిమ్రాన్ సింగ్, 2 ప్రియాంష్ ఆర్య, 3 శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), 4 జోష్ ఇంగ్లిస్, 5 నెహాల్ వధేరా, 6 శశాంక్ సింగ్, 7 స్టోయినిస్, 8 మార్కో జాన్సెన్, 9 జేవియర్ బార్ట్‌లెట్, 10 అర్ష్‌దీప్ సింగ్, 11 యుజ్వేంద్ర చాహల్
PBKS ఇంపాక్ట్ ప్లేయర్స్: హర్‌ప్రీత్ బ్రార్, గ్లెన్ మాక్స్‌వెల్, విజయ్‌కుమార్ వైషాక్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షెడ్జ్
ఈరోజు మొహాలిలో వెదర్ ఎలా ఉంటుంది?
ముల్లన్‌పూర్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ఈ డబుల్ హెడర్ మొదటి మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. టాస్ మధ్యాహ్నం 3 గంటలకు వేస్తారు. కానీ వాతావరణ నివేదిక ప్రకారం, మ్యాచ్ రోజు వర్షం పడే అవకాశం 35 శాతం ఉంది, గాలులు గంటకు 24 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. ఇటీవల జరిగిన మ్యాచ్ లో ఓటమికి ఆర్సీబీ ప్రతీకారం తీసుకునేందుకు తక్కువ సమయంలో ఛాన్స్ దొరికింది. మ్యాచ్‌కు ప్రతికూల వాతావరణం కారణంగా అంతరాయం తలెత్తే అవకాశం కనిపిస్తోంది.





















