అన్వేషించండి

Rishabh Pant: ఐపీఎల్​ చరిత్రలోనే రికార్డు ధర.. కానీ చెత్త ప్రదర్శన అంటూ రిషభ్ పంత్ ఆటపై ట్రోలింగ్

ఐపీఎల్​ చరిత్రలోనే రూ.27 కోట్లతో రికార్డు ధర పలికిన రిషభ్​ పంత్​ పేలవ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. రాజస్థాన్​తో జరిగిన మ్యాచ్​లోనూ కేవలం 3 రన్స్​ చేసి ఓ చెత్త షాట్​ ప్రయత్నించి ఔటయ్యాడు.

ఆవేశ్​ ఖాన్​ అద్భుత బౌలింగ్​తో రాజస్థాన్​ రాయల్స్​పై 2 పరుగుల తేడాతో గెలిచి లక్నో సూపర్​ జెయింట్స్​ ఊపిరిపీల్చుకుంది. కానీ ఆ జట్టును ఓ భయం వెంటాడుతూనే ఉంది. అదే కెప్టెన్​ రిషభ్​ పంత్​ పేలవ ఫామ్​. ఐపీఎల్​ చరిత్రలోనే రికార్డు ధర (రూ.27 కోట్లు) పలికిన పంత్ ప్రదర్శన దారుణంగా ఉంది. శనివారం రాజస్థాన్​తో జరిగిన పోరులోనూ ఘోరంగా  విఫలమయ్యాడు. ఓపెనర్లిద్దరూ స్వల్ప స్కోర్లకే ఔటైపోయి టీమ్​ కష్టాల్లో ఉన్నప్పుడు ఆచితూచి ఆడాల్సిన కెప్టెన్​ మరోసారి ఓ చెత్త షాట్​ ఆడి కీపర్​కు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు. 

జైపూర్​లోని సవాయ్​ మాన్ సింగ్​ స్టేడియంలో శనివారం రాజస్థాన్​ రాయల్స్​తో లక్నో సూపర్​ జెయింట్స్ తలపడింది. టాస్​ గెలిచిన లక్నో మొదట బ్యాటింగ్​ ఎంచుకోగా మార్​క్రమ్​తోపాటు ఓపెనర్​గా వచ్చిన మిచెల్​ మార్ష్​ కేవలం 4 రన్స్​ చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత వన్​డౌన్​లో వచ్చిన పూరన్​ సైతం ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. 11 పరుగులు చేసి సందీప్​ శర్మ బౌలింగ్​లో ఎల్బీగా ఔటయ్యాడు. 

వెనువెంటనే రెండు కీలక వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్న వేళ క్రీజులోకి వచ్చిన రిషభ్​ పంత్​.. ఆచిత​ కెప్టెన్​ ఇన్నింగ్స్​ ఆడాల్సింది పోయి తన పేలవ ఫామ్​ను కొనసాగించాడు. 9 బంతులు ఎదుర్కొని కేవలం 3 పరుగులే చేశాడు. హసరంగ బౌలింగ్​లో ఓ చెత్త షాట్​ ఆడి కీపర్​ ధ్రువ్​ జురెల్​ చేతికి చిక్కి పెవిలియన్​ చేరాడు.

ఈ ఐపీఎల్​ సీజన్​లో 8 మ్యాచ్​లు ఆడిన పంత్​.. 7 మ్యాచ్​ల్లో బ్యాటింగ్​ చేసి కేవలం 108 రన్స్​ మాత్రమే చేశాడు. ఆడిన మొత్తం మ్యాచ్​లలో కేవలం ఒకే ఒక్క దాంట్లో రాణించాడు. ఏప్రిల్​ 14న చెన్నై సూపర్​ కింగ్స్​పై 63 రన్స్​ చేశాడు. ఇక అన్ని మ్యాచ్​లలో దారుణంగా విఫలమయ్యాడు. లక్నో దిల్లీతో తలపడగా 6 బాల్స్​ ఆడి డకౌట్​ అవగా.. హైదరాబాద్​పై 15, పంజాబ్​పై 2, ముంబైపై 2, గుజరాత్​పై 21 చేశాడు. 98.14 స్ట్రైక్​రేట్​తో పంత్​ యావరేజ్​ స్కోరు 15 మాత్రమే.

పంత్​ రాణించాల్సిందే..
LSG తదుపరి మ్యాచ్ ఏప్రిల్ 22న వారి సొంత మైదానమైన ఎకానా స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 3 ఓటములతో ఉన్న లక్నో 10 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. టాప్​ ఆర్డర్​లో విచెల్​ మార్ష్​, మార్​క్రమ్​, నికొలస్​ పూరన్​ రాణిస్తుండడంతో ఆ జట్టు మిడిలార్డర్​పై పెద్దగా ప్రభావం పడడం లేదు. కానీ వారు విఫలమైతే మిడిలార్డర్ లో ఉన్న పంత్​​ రాణించాల్సి ఉంటుంది. ప్లేఆఫ్ రేసులో జట్టు కొనసాగాలంటే.. పంత్ తన ఫామ్‌ను పుంజుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సూపర్​ విజయం
రాజస్థాన్​తో జరిగిన ఉత్కంఠ పోరులో లక్నో​ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట లక్నో బ్యాటింగ్​ చేయగా.. మార్​క్రమ్​ (66), ఆయుశ్​ బదోని (50) రాణించారు. చివర్లో అబ్దుల్​ సమద్​ చెలరేగి 10 బంతుల్లో 30 రన్స్​ చేయడంతో ఆ జట్టు 180 లక్ష్యాన్ని రాజస్థాన్​ ముందుంచింది. ఆ తర్వాత బ్యాంటింగ్​కు దిగిన రాయల్స్​ ఓపెనర్లు యశస్వి జైస్వాల్​ (74), 14 ఏళ్ల కుర్రాడు వైభవ్​ సూర్వవంశీ (34) దంచికొట్టడంతో సునాయాసంగా గెలుస్తుందనుకున్న రాజస్థాన్​ ఆ తర్వాత క్రమంగా వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్​లో ఆ జట్టు విజయానికి 9 రన్స్​ అవసరముండగా ఆవేశ్​ ఖాన్​ అద్భుతంగా బౌలింగ్​ చేసి కేవలం 6 రన్స్​ మాత్రమే ఇచ్చాడు. దీంతో రాయల్స్​ జట్టు 2 రన్స్​ తేడాతో ఓడింది. 

టాప్ హెడ్ లైన్స్

Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
Embed widget