Veera Chandrahasa: తెలుగులోకి 'వీర చంద్రహాస'... పాన్ ఇండియా హిట్స్‌కు మ్యూజిక్ చేసిన రవి బస్రూర్ డైరెక్ట్ చేస్తే?
Veera Chandrahasa Telugu Release: 'కేజీఎఫ్', 'సలార్'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్. ఆయన దర్శకుడిగా మారిన 'వీర చంద్రహాస' తెలుగు రైట్స్ ఎంవి రాధాకృష్ణ సొంతం చేసుకున్నారు.

రవి బస్రూర్ (Ravi Basrur)... తెలుగులోనూ ఈ పేరు పాపులర్. 'కేజీఎఫ్', 'సలార్' సినిమాలతో ఆయన సెన్సేషన్ క్రియేట్ చేశారు. పాన్ ఇండియా స్థాయిలో తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా పాపులర్ అయిన రవి బస్రూర్ దర్శకుడిగా మారిన సినిమా 'వీర చంద్రహాస' (Veera Chandrahasa Movie). ఈ మూవీ తెలుగు రైట్స్ ఎంవి రాధాకృష్ణ సొంతం చేసుకున్నారు.
కన్నడలో బ్లాక్ బస్టర్ టాక్...
హీరో శివన్న నటనకు ప్రశంసలు!
'వీర చంద్రహాస'లో కరుణాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్ (Shiva Rajkumar) కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాలో శిథిల్ శెట్టి, నాగశ్రీ జీఎస్, ప్రసన్న శెట్టిగార్ మందార్తి, ఉదయ్ కడబాల్, రవీంద్ర దేవాడిగ, నాగరాజ్ సర్వెగర్, గుణశ్రీ ఎం నాయక్, శ్రీధర్ కాసర్కోడు, శ్వేత అరెహోల్, ప్రజ్వల్ కిన్నాల్ ప్రధాన తారాగణం. కన్నడలో టాప్ ప్రొడక్షన్ హౌస్ హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో ఓంకార్ మూవీస్ పతాకం మీద ఎన్ఎస్ రాజ్ కుమార్ నిర్మించిన చిత్రమిది. ఏప్రిల్ 18న కన్నడలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. శివన్న నటనకు ప్రశంసలు లభించాయి. ఇప్పుడీ సినిమాను తెలుగులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
'వీర చంద్రహాస' తెలుగు డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఎంవి రాధాకృష్ణ సొంతం చేసుకున్నారు. కంచి కామాక్షి - కోల్‌కతా కాళీ క్రియేషన్స్ సంస్థపై తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శివ రాజ్ కుమార్ 'వేద', ప్రజ్వల్ దేవరాజ్ 'రాక్షస' చిత్రాలను తెలుగులో ఎంవి రాధాకృష్ణ విడుదల చేశారు. మంచి అభిరుచి ఉందని చాటుకున్నారు. త్వరలో 'వీర చంద్రహాస' తెలుగు విడుదల తేదీని అనౌన్స్ చేయనున్నట్లు చెప్పారు.
Also Read: రాశీ కాదు... హాటీ... రెడ్ స్విమ్‌సూట్‌లో సెక్సీగా బ్యూటిఫుల్ ఖన్నా, ఫోటోలు చూడండి
View this post on Instagram
నిర్మాత ఎంవి రాధాకృష్ణ మాట్లాడుతూ... ''కన్నడలో విడుదలైన 'వీర చంద్రహాస'కు హిట్ టాక్ ఒక్కటే కాదు... వసూళ్లు సైతం వస్తున్నాయి. ఈ సినిమా తెలుగు రైట్స్ నేను దక్కించుకోవడం సంతోషంగా ఉంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. ఈ చిత్రానికి కూడా బ్రహ్మారథం పడతారని ఆశిస్తున్నా. సినిమా విజయం సాధించడం గ్యారెంటీ. తన సంగీతంతో ప్రేక్షకుల్ని అలరించిన రవి బస్రూర్ ఇప్పుడు దర్శకుడిగానూ సత్తా చాటారు. 'వీర చంద్రహాస' కథను మహాభారతంలోని అశ్వమేధిక పర్వం నుంచి తీసుకున్నారు. సినిమా హిస్టరీలో తొలిసారి వెండితెరపై యక్షగానం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు గొప్ప ఎక్స్‌పీయెన్స్ ఇస్తుంది'' అని అన్నారు.
Also Read: పంది, బర్రెతో కంపేరిజన్... విడాకులు ఇవ్వలేదా? బాడీ షేమింగ్ చేసే ఫ్రెండ్స్ వద్దు... అలేఖ్య అక్క సుమ
'వీర చంద్రహాస' చిత్రానికి ఛాయాగ్రహణం: కిరణ్ కుమార్ ఆర్, నిర్మాతలు: ఎన్ఎస్ రాజ్ కుమార్ - ఎంవి రాధాకృష్ణ, కథ - కథనం - దర్శకత్వం - సంగీతం: రవి బస్రూర్.





















