Chintu Cheetah: ఇండియాకు వస్తున్న ఆఫ్రికన్ చీతా, ప్రధాని మోదీ బర్త్‌డే స్పెషలా?
Chintu Cheetah: దాదాపు 5 దశాబ్దాల చర్చల తరవాత భారత్‌కు ఆఫ్రికా నుంచి చీతాలు వస్తున్నాయి.

Chintu Cheetah:
చింటూ చీతా వస్తోంది..
అంతరించిపోతున్న జంతువుల జాబితాలో చిరుతలు ముందు వరసలో ఉంటాయి. వీటి సంఖ్య పెంచేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తూనే ఉన్నా...ఆశించిన స్థాయిలో అయితే పెరగటం లేదు. కానీ..భారత్ మాత్రం తమ ప్రయత్నాల్ని ఆపటం లేదు. ఇందులో భాగంగానే...ఆఫ్రికా నుంచి చింటూ చీతాను (Chintu Cheetah)ను మధ్యప్రదేశ్‌కు (Madhya Pradesh)తీసుకురానున్నారు. కునో-పల్‌పూర్ (Kuno-Plpur) ఫారెస్ట్‌లో
ఈ చీతాను వదలనున్నారు. దాదాపు 5 దశాబ్దాలుగా ఈ చీతాను భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికి ఆ కల నెరవేరనుంది. సెప్టెంబర్ 17వ తేదీన అధికారికంగా ఈ చింటు చీతాలు మధ్యప్రదేశ్‌లోని ఫారెస్ట్‌లో అడుగు పెట్టనున్నాయి. ఇది జరగటానికి ముందు ఎన్నో సవాళ్లు దాటుకోవాల్సి వచ్చింది. అవేంటో చూద్దాం.
1. 1952లో భారత్‌లో తొలిసారి వైల్డ్‌లైఫ్ బోర్డ్ మీటింగ్ (Wildlife Board Meeting) జరిగింది. చిరుతల సంఖ్య దారుణంగా పడిపోయిందని గుర్తించింది అప్పుడే. వెంటనే భారత ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
2. 1972లో అప్పటి భారత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ..ఇరాన్ ప్రభుత్వంతో చర్చలు మొదలు పెట్టారు. ఆసియా చీతాలను భారత్‌కు రప్పించి అందుకు బదులుగా ఆసియా సింహాలను ఇచ్చేలా సంప్రదింపులు జరిగాయి. ఆ తరవాత కొన్ని రోజుల పాటు చర్చలు ఆగిపోయాయి.
3. 2009లో చర్చలు పున:ప్రారంభమయ్యాయి. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇందుకు చొరవ చూపించారు. కానీ...ఎందుకో ఆ ప్రయత్నం ఫలించలేదు.
4. ఇప్పుడు నరేంద్ర మోదీ హయాంలో మొత్తానికి ఈ ప్లాన్ సక్సెస్ అయింది. సెప్టెంబర్ 17వ తేదీన చీతా భారత్‌లోకి రానుంది.
ఇండియా సంరక్షించిన మరికొన్ని జీవజాతులు
1. పులులు (Panthera tigris)
2. ఆసియన్ ఏనుగు (Elephas maximus)
3. ఘరియల్ (Gavialis gangeticus)
4. ఒంటికొమ్ము ఖడ్గమృగాలు (Rhinoceros unicornis)
చీతాలను కాపాడుకునేందుకు భారత్ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఆఫ్రికాలో చీతాలు ఉన్నప్పటికీ...అక్కడ అవి మనుగడ సాగించేందుకు అనుకూలమైన వాతావరణం లేదు. భారత్‌లో మాత్రం ప్రత్యేక రిజర్వ్‌లు ఏర్పాటు చేయటం వల్ల వాటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతతి పెంచుకునేందుకు వీలుంటుంది. మిగతా దేశాలతో పోల్చుకుంటే..భారత్ ఈ విషయంలో ముందంజలో ఉంటోంది.
చీతాను ఎలా ట్రాన్స్‌పోర్టే చేస్తారు..?
1. నమీబియాలో చీతాను స్క్రీనింగ్ చేస్తారు.
2. ఈ స్క్రీనింగ్ కోసం మాలెక్యులార్ డయాగ్నస్టిక్స్ పద్ధతిని వినియోగిస్తారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం దీన్ని నిర్వహిస్తారు.
3. ఏదైనా అనారోగ్యానికి గురైందా అని పరీక్షించేందుకు ముందస్తు జాగ్రత్తగా క్వారంటైన్‌లో ఉంచుతారు. ఒకవేళ దానికి ఏమైనా జబ్బు వస్తే.. భారత్‌కు తీసుకురాకుండా ఆపేస్తారు.
4. భారత్‌కు తీసుకొచ్చే ముందే అవసరమైన వ్యాక్సిన్‌లు ఇస్తారు. Veterinary Health Certificate కూడా ఇచ్చి పంపుతారు.
5. చీతాల వయసు, బరువు, ఎత్తు తదితర వివరాలు పక్కాగా నమోదు చేస్తారు.
ఇండియాకు వచ్చాక..
1. ఓ ఎన్‌క్లోజర్‌లో కొన్ని రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచుతారు. ఏదైనా జబ్బు చేసిందా అని పరీక్షిస్తారు. ప్రతి చీతాకు ఓ GPS, రేడియా కాలర్ అమర్చుతారు. అవి ఎలా ఉంటున్నాయి..? ఎలా ప్రవర్తిస్తున్నాయి అని తెలుసుకుంటారు.
2. ప్రతి చీతా ఫోటో ప్రొఫైల్స్‌ని భద్రంగా దాస్తారు. చీతా పిల్లలకూ 16-17నెలల వరకూ ఇలానే జీపీఎస్ అమర్చి వాటి బిహేయివర్‌ను పరీక్షిస్తారు.
ఎలా ఉంచుతారు..?
1. ఎలాంటి ముప్పు లేని ఎన్‌క్లోజర్స్‌లో మధ్యప్రదేశ్‌లోని కునో ఫారెస్ట్‌లో ఉంచుతారు. మగ, ఆడ చీతాలను వేరువేరు ఎన్‌క్లోజర్లలో పక్కపక్కనే ఉంచుతారు.
2. అక్కడి వాతావరణానికి అలవాటు పడేలా కొంత దూరం వరకూ అవి చూసి అర్థం చేసుకునేలా ప్రత్యేక చోటులో ఈ ఎన్‌క్లోజర్లు ఏర్పాటు చేస్తారు.
3. నీరు, నీడ సరైన విధంగా ఉండేలా చూసుకుంటారు. ఇక్కడి జంతువులను వేటాడి తినే స్వభావం అలవాటు చేసేందుకు ఎన్‌క్లోజర్‌లో వాటి మాంసం అందిస్తారు.
4. ఇదంతా పూర్తై...చీతాలు ఇక్కడి వాతావరణానికి అలవాటు పడటానికి కనీసం మూడు నెలల సమయం పడుతుంది.
కునో పల్‌పూర్ నేషనల్ పార్క్..
ఈ పార్క్‌లో చీతాలకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఇక్కడి సగటు ఉష్ణోగ్రతలు 42.3 డిగ్రీ సెల్సియస్. శీతాకాలంలో 6-7డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ప్రస్తుతానికి ఈ నేషనల్ పార్క్‌లో 21 చీతాలు మనుగడ సాగిస్తున్నాయి. కనీసం 36 చీతాలు ఇక్కడ ఉండేందుకు అన్ని వసతులూ ఏర్పాటు చేశారు. మొత్తం 748 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది ఈ నేషనల్ పార్క్. కొత్తగా వస్తున్న చీతాలను సంరక్షించేందుకు ప్రత్యేకంగా రెండు అదనపు పెట్రోలింగ్ వాహనాలను ఏర్పాటు చేయనున్నారు.
సక్సెస్ అయిందని ఎలా నిర్ధరిస్తారు..?
నేషనల్ పార్క్‌లోకి వదిలిన చీతాల్లో 50% మేర మనుగడ సాధించగలిగితే...అప్పుడు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయినట్టు లెక్క. పునరుత్పత్తి జరిగాక...వాటి పిల్లలు కనీసం ఏడాది పాటు ఆరోగ్యంగా మనుగడ సాగించగలిగినా విజయం సాధించినట్టే.
రచయిత: త్రితేశ్ నందన్, ఏబీపీ రీసెర్చ్ అండ్ ఎడిటోరియల్ డిపార్ట్‌మెంట్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

