AP Assembly Sessions: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, వైసీపీ సభ్యుల నిరసనల మధ్యే గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం
AP Assembly Budget Sessions | ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తుంటే వైసీపీ సభ్యుల నిరసనకు దిగారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని నినదించారు.

AP Assembly Sessions | అమరావతి: ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం ఏపీ సీఎం చంద్రబాబు, కూటమి పార్టీ సభ్యులు సభకు హాజరయ్యారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ సభ్యులు నేటి సమావేశానికి హాజరయ్యారు. ఉభయ సభలను ఉద్దేశించి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం మొదలుపెట్టారు. వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగులుతూ ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ గట్టిగా నినాదాలు చేశారు.
గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు తిరుగులేని మెజారిటీ ఇచ్చారు. గత ఐదేళ్లలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. ప్రజాభీష్టం మేరకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిందన్నారు. పోడియం వద్దకు వెళ్లి కాసేపు నిరసన తెలిపిన అనంతరం వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
గవర్నర్, సీఎంకు అసెంబ్లీ వద్ద స్వాగతం..
బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యేందుకు ఉదయం 9.45కు సీఎం చంద్రబాబు అసెంబ్లీకి వచ్చారు. అనంతరం 9.55 కి గవర్నర్ అబ్దుల్ నజీర్ కు గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరించారు. అనంతరం సీఎం చంద్రబాబు గవర్నర్ కు స్వాగతం పలకనున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ కు, సీఎం చంద్రబాబుకు అసెంబ్లీ వద్ద స్పీకర్, మండలి ఛైర్మన్, సీఎస్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ప్రారంభించగానే... ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినదించారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగులుతూ ప్రతిపక్ష హోదా ఇచ్చి తీరాల్సిందేనంటూ సభలో పట్టుపట్టారు. గవర్నర్ ప్రసంగం అనంతరం 11.15 కు శాసనసభ రేపటికి వాయిదా పడనుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

