Liquor Shops Closed: మందుబాబులకు బిగ్ షాక్, తెలంగాణలో 3 రోజులు పాటు వైన్స్ షాపులు, బార్లు బంద్
Telangana Liquor Sales | తెలంగాణలో పలు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా మూడు రోజులపాటు మద్యం అమ్మకాలు బంద్ కానున్నాయి. వైన్స్ షాపులు, బార్లు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.

Telangana Liquor shops Closed | తెలంగాణలోని మందు బాబులకు షాకింగ్ న్యూస్. రేపట్నుంచీ మూడు రోజులు పాటు వైన్స్ షాపులు, బార్లు క్లోజ్ చేయనున్నారు. ఫిబ్రవరి 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27న సాయంత్రం 4 గంటల వరకు లిక్కర్ షాపులు మూసివేయనున్నారు. మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ లలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండగా.. నల్గొండ – ఖమ్మం – వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఫిబ్రవరి 27న జరగనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా పోలింగ్ జరిగే ఉమ్మడి ఏడు జిల్లాల పరిధిలో మద్యం దుకాణాలు బంద్ అవుతాయి. ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు పోలింగ్ జరగనుండగా, మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టనుంది ఈసీ.
హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో మినహా మిగిలిన చోట మద్యం షాపులు యథాతథంగా తెరుచుకుంటాయి. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కారణంగా కేవలం కొల్లూరు, ఆర్సీ పురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మూడు రోజులపాటు మద్యం దుకాణాలు క్లోజ్ కానున్నాయని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులలో పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా మద్యం విక్రయించినా, మద్యం సరఫరా చేసినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని మద్యం షాపుల నిర్వాహకులను పోలీసులు హెచ్చరించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధి లొని కొన్ని పోలీస్ స్టేషన్లు సైతం రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి వస్తాయని తెలిసిందే.
Also Read: CM Revanth Reddy: నేడు సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన, 3 జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం






















