By: Saketh Reddy Eleti | Updated at : 01 Jun 2023 01:47 PM (IST)
స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్‌వర్స్ రివ్యూ ( Image Source : Sony Pictures )
స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్‌వర్స్
Animation, Action
దర్శకుడు: జోక్విమ్ డోస్ శాంటోస్, కెంప్ పవర్స్, జస్టిన్ కె.థాంప్సన్
Artist: షమీక్ మూర్, హెయిలీ స్టెయిన్‌ఫీల్డ్, బ్రియన్ టైరీ హెన్రీ తదితరులు (వాయిస్)
సినిమా రివ్యూ : స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్‌వర్స్ (ఇంగ్లిష్)
రేటింగ్ : 3/5
నటీనటులు : (అందరిదీ వాయిస్ ఓవర్ మాత్రమే) షమీక్ మూర్, హెయిలీ స్టెయిన్‌ఫీల్డ్, బ్రియన్ టైరీ హెన్రీ తదితరులు
సంగీతం : డేనియల్ పెంబెర్టన్
నిర్మాణ సంస్థలు : కొలంబియా పిక్చర్స్, సోనీ పిక్చర్స్ యానిమేషన్, మార్వెల్ ఎంటర్‌టైన్‌మెంట్
రచన : ఫిల్ లార్డ్, క్రిస్టోఫర్ మిల్లర్, డేవిడ్ కల్లహం
దర్శకత్వం : జోక్విమ్ డోస్ శాంటోస్, కెంప్ పవర్స్, జస్టిన్ కె.థాంప్సన్
విడుదల తేదీ: జూన్ 1, 2023
Spiderman Across The Spiderverse Movie Review: మనదేశంలో అత్యంత పాపులారిటీ ఉన్న సూపర్ హీరోల్లో స్పైడర్‌మ్యాన్ ముందంజలో ఉంటాడు. యానిమేటెడ్ సిరీస్ అయినా, లైవ్ యాక్షన్ సినిమాలు అయినా స్పైడర్ మ్యాన్ పాత్రకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. అలాంటి స్పైడర్ మ్యాన్ పాత్రతో 2018లో సోనీ కొత్త ప్రయోగం చేసింది. బ్లాక్ స్పైడర్ మ్యాన్ అయిన మైల్స్ మోరాలెస్ పాత్రతో పూర్తిస్థాయి థియేట్రికల్ యానిమేటెడ్ మూవీ అయిన ‘స్పైడర్‌మ్యాన్: ఇన్‌టూ ది స్పైడర్‌వర్స్’ సినిమాను రూపొందించింది. ఆ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో దానికి సీక్వెల్‌గా ‘స్పైడర్‌మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్‌వర్స్’ అనే సినిమాను కూడా తీసింది. ఆ సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా మొదటి భాగంలా ఉందా? దాన్ని మించేలా ఉందా?
కథ (Spiderman Across The Spiderverse Story): ‘స్పైడర్‌మ్యాన్: ఇన్‌టూ ది స్పైడర్‌వర్స్’ కథ ముగిసిన కొన్నాళ్ల తర్వాత దీని కథ ప్రారంభం అవుతుంది. వేరే విశ్వంలో ఉండే స్పైడర్ ఉమెన్/గ్వెన్ స్టేసీకి ఒక సమస్య రావడంతో తను స్పైడర్ సొసైటీలో చేరుతుంది. అన్ని విశ్వాల్లోని స్పైడర్ మ్యాన్/ఉమెన్‌లను ఒక చోట చేర్చి విశ్వాలను కాపాడటం ఈ స్పైడర్ సొసైటీ బాధ్యత. అనుకోకుండా తను మళ్లీ మైల్స్ మోరాలెస్/స్పైడర్ మ్యాన్ జీవితంలోకి వస్తుంది. మైల్స్ మోరాలెస్‌కి, ‘స్పాట్’ అనే సూపర్ విలన్‌కి ఉన్న సంబంధం ఏంటి? ఆ తర్వాత వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? ఇతర విశ్వాల్లోని లెక్క లేనంత మంది స్పైడర్ మ్యాన్‌లు ఎందుకు మైల్స్ వెంట పడ్డారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ (Spiderman Across The Spiderverse Review): ఈ సినిమా బడ్జెట్ 100 మిలియన్ డాలర్లు. అంటే మనదేశ కరెన్సీలో దాదాపు రూ.825 కోట్లు అన్నమాట. అంత ఖర్చు పెట్టి యానిమేషన్ సినిమా తీసేబదులు లైవ్ యాక్షన్ తీస్తే వచ్చే రీచ్ వేరే ఉంటుంది కదా అనే ఆలోచన రావచ్చు. కానీ ‘స్పైడర్‌మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్‌వర్స్’ కథ, కథాగమనం, పాత్రలు, సీన్లు ఆ బడ్జెట్‌కు యానిమేషన్‌లో మాత్రమే తీయదగ్గవిగా ఉంటాయి. దాదాపు ‘వైల్డ్ ఇమాజినేషన్’ అని చెప్పవచ్చు. స్పైడర్ మ్యాన్ అంటే కేవలం మనుషులు మాత్రమే కాదు. పంది, కారు, డైనోసార్లకు కూడా స్పైడర్ పవర్స్ వస్తే ఎలా ఉంటుందో ఇందులో చూడవచ్చు.
ఈ సినిమా చూసేముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే... ఇది పూర్తి కథ కాదు. బాహుబలి తరహాలో రెండు భాగాలుగా విభజించిన కథ. కథలోకి వెళ్లడానికి కూడా దర్శకులు కొంచెం సమయం తీసుకుంటారు. మొదటి 45 నిమిషాలు గ్వెన్ స్టేసీ, మైల్స్ మోరాలెస్‌ల వ్యక్తిగత జీవితాల చుట్టూనే కథ తిరుగుతున్నట్లు, కొంచెం స్లో అయినట్లు అనిపిస్తుంది. వీరితో పాటే పవర్ ఫుల్ విలన్ ‘స్పాట్’ను మొదటి నుంచి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తారు. నిజానికి ఈ సినిమా కూడా ‘స్పాట్’ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. అత్యంత బలహీనంగా ‘విలన్ ఆఫ్ ది వీక్’ అని మైల్స్ మోరాలెస్ ఎగతాళి చేసే స్పాట్, అన్ని విశ్వాలకు ప్రమాదకరంగా ఎలా మారాడో చూపించే విధానం ఆకట్టుకుంటుంది.
మొదటి స్పైడర్ మ్యాన్ (2002) హీరో టోబీ మాగ్వైర్, ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ (2012) హీరో ఆండ్రూ గార్‌ఫీల్డ్ ఫ్యాన్స్‌కు ఇందులో సర్‌ప్రైజ్‌లు కూడా ఉన్నాయి. ఇండియన్ ఆడియన్స్‌కు ఇందులో స్పెషల్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో జరిగే యాక్షన్ సీక్వెన్స్ కథను మలుపు తిప్పుతుంది. ‘పవిత్ర ప్రభాకర్’ అనే ప్రత్యేక భారతీయ స్పైడర్ మ్యాన్ రోల్‌ను కూడా క్రియేట్ చేశారు.
సినిమాలో చివరి గంట చాలా రేసీగా సాగుతుంది. ముఖ్యంగా స్పైడర్ సొసైటీలో మైల్స్ మోరాలెస్‌కు, మిగతా స్పైడర్ మ్యాన్లకు వచ్చే యాక్షన్ సీన్ సినిమాకే హైలెట్. అక్కడి నుంచి తర్వాతి భాగానికి బేస్‌ను చాలా బలంగా సెట్ చేశారు. ఆఖర్లో వచ్చే ట్విస్ట్ అయితే మైండ్ బ్లోయింగ్. తర్వాతి భాగం మీద ఆసక్తిని మరింత పెంచుతుంది. అయితే నెక్స్ట్ పార్ట్ కోసం సంవత్సరాలు, సంవత్సరాలు వెయిట్ చేయనక్కర్లేదు. 2024 మార్చి 29వ తేదీన మూడో భాగం ‘స్పైడర్‌మ్యాన్: బియాండ్ ది స్పైడర్‌వర్స్’ విడుదల కానుంది.
Also Read : 'మళ్ళీ పెళ్లి' రివ్యూ : నరేష్, పవిత్ర తప్పు చేశారా? లేదంటే రమ్యా రఘుపతిది తప్పా? ఏం చూపించారంటే?
విజువల్‌గా ‘స్పైడర్‌మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్‌వర్స్’ ఒక పెయింటింగ్ అని చెప్పవచ్చు. ప్రతి సీన్లోనూ కనీసం ఒక్క షాట్ అయినా అదరహో అనిపిస్తుంది. గ్వెన్ స్టేసీ, మైల్స్ మోరాలెస్‌లు కలుసుకునే సీన్లోనూ, స్పైడర్ సొసైట్ యాక్షన్ సీన్లోనూ విజువల్స్ టాప్ నాచ్. డేనియర్ పెంబెర్టన్ ఇచ్చిన సంగీతం కూడా ఆకట్టుకుంటుంది.
ఓవరాల్‌గా చెప్పాలంటే... మీరు సూపర్ హీరో సినిమాల ఫ్యాన్స్ అయితే ఈ సినిమా నచ్చుతుంది. ఇక స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ అయితే మాత్రం ‘స్పైడర్‌మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్‌వర్స్’ను కచ్చితంగా చూడాల్సిందే.
Also Read : 'మేమ్ ఫేమస్' రివ్యూ : 'మేజర్', 'రైటర్ పద్మభూషణ్' తర్వాత ఛాయ్ బిస్కెట్‌కు మరో హిట్టేనా?
Saptha Sagaralu Dhaati Review - 'సప్త సాగరాలు దాటి' సినిమా రివ్యూ : కన్నడ బ్లాక్ బస్టర్ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా?
Rudramkota Review - 'రుద్రంకోట' రివ్యూ : 'జానకి కలగనలేదు' సీరియల్ దర్శక, నిర్మాతలు తీసిన సినిమా
Athidhi Web Series Review - 'అతిథి' రివ్యూ : హీరో వేణు తొట్టెంపూడి నటించిన హారర్ థ్రిల్లర్ సిరీస్
Ramanna Youth Review - 'రామన్న యూత్' రివ్యూ : అభయ్ బేతిగంటి హీరోగా, దర్శకుడిగా పరిచయమైన సినిమా!
Mark Antony Review - 'మార్క్ ఆంటోనీ' రివ్యూ : టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో విశాల్ సినిమా - ఎలా ఉందంటే?
Chandrababu News: చంద్రబాబు పిటిషన్‌లపై విచారణ రేపటికి వాయిదా, సెలవులో ఏసీబీ కోర్టు జడ్జి
Telangana Cabinet: రెండు మూడు రోజుల్లో తెలంగాణ కేబినెట్ భేటీ, ప్రధాన అజెండాలు ఇవే!
Sreeleela Rashmika : మళ్ళీ విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా - ఆ సినిమా నుంచి శ్రీ లీల అవుట్?
Paritala Sunitha: మాజీ మంత్రి పరిటాల సునీత దీక్ష భగ్నం, ఆస్పత్రికి తరలింపు
/body>