Quit Smoking Guidelines : స్మోకింగ్ మానేయాలనుకుంటున్నారా? మీకోసమే WHO కొన్ని ఆఫర్లు ఇచ్చింది.. అవేంటంటే
Stop Smoking Treatment : ధూమాపానం మానేయనులనుకుంటున్నారా? అయితే మీకోసమే ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. అవేంటంటే..
WHO Guidelines for Quitting Tobacco : స్మోకింగ్ ఆరోగ్యాన్ని అన్ని రకాలుగా నాశనం చేస్తుంది. అయితే ఈ విషయమే తెలిసి తాగుతున్నామంటూ కొందరు ఫ్యాషన్‌గా చెప్తారు. కానీ దాని వల్ల కలిగే నష్టాలు అన్ని ఇన్ని కాదు. అది స్వతహాగా తెలిస్తేనే కానీ దానిని మానేందుకు ఆసక్తి చూపరు. కానీ అలవాటును కంట్రోల్ చేయాలంటే అందరికీ కష్టమేగా. ఈ విషయాన్నే దృష్టిలో పెట్టుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్మోకింగ్ మానేయడంలో సహాయపడే మార్గదర్శకాలను జారీ చేసింది.
ప్రపంచవ్యాప్తంగా సిగరెట్లు, వాటర్పైప్లు, పొగలేని పొగాకు, సిగార్లు, రోల్ యువర్ ఓన్ పొగాకును 750 మిలియన్ల మంది ఉపయోగిస్తున్నారు. ఈ పొగాకు వినియోగదారులను లక్ష్యంగా చేసి.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మార్గదర్శకాలు చేసింది. ఖర్చు లేకుండా.. అతి తక్కువ ఖర్చుతో.. ఈ సమస్యను తగ్గించుకునేవిధంగా చికిత్సలను అందించాలని WHO నిర్ణయం తీసుకుంది. డిజిటల్, కౌన్సిలింగ్ విధానాల్లో స్మోకింగ్ కంట్రోల్ చేసేలా మార్గదర్శకాలు ఇచ్చింది.
మానాలనుకుంటున్నారు కానీ..
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ప్రపంచంలోని 1.25 బిలియన్ల పొగాకు వినియోగదారులలో 60 శాతం కంటే ఎక్కువ మంది దానిని మానేయాలనుకుంటున్నారట. కానీ దానిని ఓవర్ కామ్ చేయలేకపోతున్నారు. 70 శాతం మందికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని గుర్తించారు. వారు ధూమాపానం మానేయడానికి చాలా కష్టపడుతున్నారు. ఈ వ్యసనాన్ని అధిగమించేందుకు కుటుంబ సభ్యులతో పాటు.. WHO కూడా ఇప్పుడు హెల్ప్ చేసేందుకు ముందుకు వచ్చింది.
WHO ఇచ్చిన మార్గదర్శకాలు ఏమిటంటే..
ధూమపానాన్ని సక్సెస్‌ఫుల్‌గా మానేసేలా WHO మార్గదర్శకాలు ఇచ్చింది. తక్కువ ఖర్చుతో, అసలు ఖర్చే లేకుండా అందించేలా దేశాలను ప్రోత్సాహిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ తరహా చికిత్సలపై అవగాహన కల్పించాలంటున్నారు. పొగాకు మానేయడానికి ప్రభావవంతమైన చికిత్సలుగా వారెనిక్లైన్, నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ, బుప్రోరియన్, సైటిసిన్ వంటి మందులను WHO సిఫార్సు చేస్తోంది. తాజాగా నికోటిన్ గమ్, ప్యాచ్‌లను WHO ఆమోందించింది.
కౌన్సిలింగ్ కూడా..
నిపుణుల నుంచి సంక్షిప్తమైన కౌన్సిలింగ్ తీసుకుంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. 30 సెకన్ల నుంచి 3 నిమిషాల వరకు ఉంటుంది. వ్యక్తిగత, గ్రూప్ కాలింగ్ ద్వారా కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ యాప్‌లు, ఇంటర్నెట్ ప్రోగ్రామ్‌లు వంటి డిజిటల్ సాధనాలు కూడా ధూమపానం మానేయడంలో పార్ట్ చేయాలంటున్నారు.
మరిన్ని జాగ్రత్తలు
స్మోకింగ్ మానేయాలనుకుంటే.. మీరు ఏరోజు నుంచి స్మోకింగ్ మానేస్తున్నారో దానిని క్యాలెండర్లో నోట్ చేసుకోవాలి. రోజులు పెరిగే కొద్ది.. అది మీకు బూస్టింగ్ ఇస్తుంది. మీ ఫ్రెండ్, ఫ్యామిలీతో స్మోకింగ్ మానేస్తున్నట్లు చెప్పండి. ఒకవేళ మీరు స్మోక్ చేయాలనుకున్నా.. వారు మిమ్మల్ని కంట్రోల్ చేస్తారు. లేదా వారు స్మోక్ చేస్తున్నప్పుడు మీకు దూరంగా ఉంటారు. మిమ్మల్ని స్మోకింగ్ చేసేలా ప్రేరేపించే పరిస్థితులకు దూరంగా ఉండేలా చూసుకోండి. స్మోకింగ్‌ను కంట్రోల్ చేసే అలవాట్లు చేసుకోండి. వ్యాయామం, యోగా, మెడిటేషన్ మీకు మంచి రిజల్ట్స్ ఇస్తాయి.
Also Read : ఉదయం లేచిన వెంటనే ఆ సమస్యలున్నాయా? అయితే మీకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశముంది జాగ్రత్త