By: ABP Desam | Updated at : 19 Oct 2022 09:10 PM (IST)
Edited By: Bhavani
Representational Image/Pexels
కొన్ని కలలు హాయిగా ఉంటాయి. కొన్ని కలలు రొమాంటిక్‌గా ఉంటాయి. కొన్ని కలలు పగలు కూడా వెంటాడేంత భయంకరంగా ఉంటాయి. కానీ, కొన్ని కలలు నిద్రలో సుదీర్ఘంగా సాగుతాయి. ఎన్నిసార్లు కళ్లు మూసుకున్నా సరే.. కళ్ల ముందే ఏదో కదలడుతున్నంత స్పష్టంగా నిద్రలేకుండా చేస్తాయి. కళ్లు మూసుకుంటారు. కానీ, కళ్ల ముందు ఏదో జరుగుతున్నట్లే అనిపిస్తుంది. దీన్నే మనం కలత నిద్ర అంటాం. ఈ రోజుల్లో దాదాపు చాలామందిని ఈ కలత నిద్ర వెంటాడుతోంది. ఎంతగా అంటే.. గూగుల్‌లో రికార్డు స్థాయిలో సెర్చ్ చేసేంత.
గత నెలలో Vivid Dreams పదంతో 240 శాతం గూగుల్ సెర్చ్‌లు పెరిగాయట. ఇది మాత్రమే కాదు, లోట్టే కంపెనీ నిర్వహించిన కొత్త పరిశోధనలో కలత నిద్రతో బాధపడుతున్న వారి సంఖ్య 91 శాతం పెరిగిందని అంటున్నారు. Intense dreams every night అని ప్రతి రోజు రాత్రి 150 శాతం మంది గూగుల్ సెర్చ్ చేస్తున్నారట. దీని వెనుక సైంటిఫిక్ కారణాలు ఉన్నాయని రాబోయే కాలంలో ఈ పరిస్థితి ఇంకా పెరగవచ్చని కూడా నిపుణులు అంటున్నారు.
ఉష్ణోగ్రత కూడా కారణమే: సాధారణంగా ఆలస్యంగా పడుకొని ఆలస్యంగా నిద్ర లేచే వారికి ఇలాంటి కలలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని డాక్టర్ టీమ్ బాండ్ అనే శాస్త్రవేత్త అంటున్నారు. ఈ స్థితికి ఉష్ణోగ్రత కూడా పెద్ద పాత్ర పోషిస్తుంది. మాములుగా 18.3 సెల్సియస్ ఉష్టోగ్రత్త వద్ద మంచి నిద్ర పడుతుంది. కొందరిలో ఇది కొద్దిగా అటుఇటుగా ఉండవచ్చు.
ఉష్ణోగ్రతల తేడాలు నిద్ర మీద ప్రభావం చూపుతాయని నిపుణులు అంటున్నారు. శీతాకాలపు చలిలో చాలా త్వరగా నిద్రలోకి జారుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎక్కువ కలలు కూడా రావచ్చు. ఎండ తీవ్రత తక్కువగా ఉండడం వల్ల విటమిన్ డి లోపం కూడా పెరగవచ్చు. అది కూడా నిద్ర, నిద్రలో వెంటాడే కలల మీద కూడా ఉంటుందని నిపుణులు అబిప్రాయపడుతున్నారు. శీతాకాలంలో చల్లని వాతావరణం, తక్కువగా ఉండే పగటి కాలం.. నిద్ర మీద చాలా ప్రభావం చూపుతుందట. సూర్య రశ్మి తీవ్రత తక్కువగా ఉండడం సర్కాడియన్ సైకిల్ లో మార్పు వస్తుంది. అందువల్ల స్లీప్ పాటర్న్ మారిపోతుంది.
విటమిన్-డి లోపం కూడా కారణమే: సూర్యకాంతి సరిగా తేకపోవడం వల్ల శరీరంలో విటమిన్ డి పడిపోతుంది. శరీరంలో సెరటోనిన్ ఉత్పత్తిలో విటమిన్ -డి ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందువల్ల నిద్ర పోవడం, మేల్కొనడం మెలటోనిస్ స్థాయి వంటి వాటిలో మార్పు వస్తుంది. అంతేకాదు, ఈ కాలంలో మానసికంగా కూడా స్ట్రెస్, డిప్రెషన్ వంటివి పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇది కూడా మరో కారణం. విటమిన్-డి లోపం దీర్ఘకాలం పాటు కొనసాగితే Seasonal Affective Disorder (SAD) అనే జబ్బుకు కారణం అవుతుంది. ఇది కూడా నిద్ర మీద కలల మీద ప్రభావం చూపుతుందట.
SADతో సమస్యలు ఎన్నో: వాతావరణ మార్పుల మానసిక స్థితి మీద కూడా ప్రభావం చూపుతాయి. చాలా మంది శీతాకాలంలో శక్తి కోల్పోయినట్టు ఉంటారు. అందుకు SAD ఒక కారణం కావచ్చు. అది కలలకు, కలత నిద్రకు కారణం కావచ్చు. రాత్రి నిద్ర సరిగా లేనందు వల్ల పగలు నిద్ర వస్తున్నట్టుగా డల్‌గా ఉంటారు. SAD వల్ల పీడ కలలు కూడా రావచ్చునని నిపుణులు అంటున్నారు.
మీరు తినే ఆహారం కూడా కారణం కావచ్చు: తీసుకునే ఆహారం ప్రభావం కూడా నిద్ర మీద, కలల మీద ఉంటుందట. పడుకునే ముందు తినడం వల్ల మెటబాలిజం యాక్టివ్ గా ఉండడం వల్ల నిద్రలో కూడా మెదడు చురుకుగా ఉండి పీడకలలకు దారి తియ్యవచ్చట. అందువల్ల రాత్రి భోజనం త్వరగా ముగించడం మంచిదని నిపుణుల సలహా. నిద్రపోవడానికి రెండు గంటల ముందే భోజనం ముగించడం మంచిదట.
కలలతో నిద్ర కలత చెందుతుంటే స్ట్రెస్ తగ్గించుకోవడానికి అవసరమైన టెక్నిక్స్ వాడుకోవడం మంచిది. ఆందోళన తగ్గితే నిద్ర పోవడానికి ఇబ్బంది ఉండదు. పడుకోవడానికి ముందు కాసేపు ధ్యానం చెయ్యడం వంటి పద్ధతులు పాటించవచ్చు. లావెండర్ వంటి అరోమా ఆయిల్స్ తో మసాజ్ వల్ల కూడా మంచి నిద్ర రావచ్చు అని నిపుణులు చెబుతున్నారు.
మూడేళ్లు దాటిన పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే ప్రమాదం - వెంటనే వైద్యుల్ని కలవండి
Cake Recipe: ఇడ్లీ పిండి మిగిలిపోయిందా? ఇలా టేస్టీ కేక్ తయారు చేసేయండి
Brain Tumor: మూత్రపరీక్షతో బ్రెయిన్ ట్యూమర్ ఉందో లేదో కనిపెట్టేసే కొత్త పరికరం - శాస్త్రవేత్తల సృష్టి
ప్రపంచంలోనే అత్యంత నిశ్శబ్ద గది - ఈ గదిలో మీ రక్త ప్రవాహపు శబ్దాన్ని కూడా వినవచ్చు
Red Wine: రెడ్ వైన్ తాగడం వల్ల ఈ ప్రయోజనాలు ఉన్నాయని సైన్స్ కూడా ఒప్పుకుంది
Vani Jayaram Death : వాణీ జయరామ్ తలపై గాయం నిజమే - మృతిపై ఇంకా వీడని మిస్టరీ
Prabhas Mahesh Akhil : 'పోకిరి', 'బాహుబలి' మేజిక్ రిపీట్ అవుతుందా? - ఇండస్ట్రీ హిట్ మీద కన్నేసిన అఖిల్
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ అభిమానులకు గుడ్ న్యూస్ - 'ఖుషి' ఖుషీగా...
Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!