YSRCP attacks TDP: తెలుగుదేశం ఆఫీసులో వైసీపీ నేతలు వీరంగం, టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడి

YSRCP leaders attack on Tdp leaders at party office | అమరావతి : తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోకి వచ్చి టీడీపీ కార్యకర్తలపై దాడి చేశారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు తమపై దాడికి పాల్పడ్డారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కార్డులు పంచుతుంటే, వైసీపీ వాళ్ళు అడ్డగించారని తెలిపారు. పార్టీ ఆఫీస్ లో కూర్చొని ఉన్న టీడీపీ కార్యకర్తలను, ఆఫీస్ లోకి వచ్చి కొట్టడం కలకలం రేపుతోంది.
34 డివిజన్ కర్నూలు అర్బన్, పాణ్యం నియోజకవర్గంలో టీడీపీ నేతలు కార్యకర్తలపై దాడి ఘటన చోటు చేసుకుంది. స్థానిక కార్పొరేటర్ మనుషులు, ప్రభాకర నాయుడు, కాశీ, రహమతుల్లా అలియాస్ ఫులి, పఠాన్ దాడిలో పాల్గొన్నారనీ టీడీపీ కార్యకర్తలు తెలిపారు.
(ఇది బ్రేకింగ్ న్యూస్. ప్రస్తుతం దీనిని అప్‌డేట్ చేస్తున్నాం. లేటేస్ట్ అప్‌డేట్ కోసం రిఫ్రెష్ చేయండి)





















