Garlic: వెల్లుల్లిలో ఎన్ని రంగులు ఉన్నాయో తెలుసా? వాటిలో ఆరోగ్యానికి ఏది మంచిది
వెల్లుల్లి కూరలకి రుచి ఇవ్వడమే కాదు ఔషధ గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.
వెల్లుల్లి.. అన్ని రకాల వంటకాల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు ఆడవాళ్ళు. ఘాటైన రుచి, వాసన కలిగి ఉండే వెల్లుల్లి వంటలకి ప్రత్యేకమైన రుచి కలిగిస్తుంది. సాధారణంగా వెల్లుల్లి అనగానే అందరూ తెల్లగానే ఉంటుందని అనుకుంటారు. మన దగ్గర కూడ ఇదే ఎక్కువగా అందుబాటులో ఉంటుంది. కానీ వెల్లుల్లిలో కూడా రంగులు ఉన్నాయి. అవి చాలా తక్కువగా కనిపిస్తాయి. వెల్లుల్లిలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. బరువు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. క్రమం తప్పకుండా వెల్లుల్లి నీళ్ళు లేదా సూప్ తాగడం వల్ల బరువు తగ్గేందుకు దోహదపడుతుంది.
తెల్ల వెల్లుల్లి
భారతీయ గృహిణులు ఎక్కువగా వినియోగించేది తెల్ల వెల్లుల్లి. ఎక్కువగా దుకాణాల్లోనూ ఇదే కనిపిస్తుంది. ఇవి సులభంగా పెరుగుతాయి. మసాలాలో వీటిని ఎక్కువగా వాడతారు. ఈ ఘాటైన వాసనకి దోమలు కూడా పారిపోతాయి. ఇవి సులభంగా పెరుగుతాయి.
పర్పుల్ వెల్లుల్లి
ఊదా రంగులో కనిపిస్తాయి ఇవి. పైన తొక్క మాత్రమే ఊదా రంగులో ఉంటుంది కానీ లోపల పాయ మాత్రం తెల్లగానే ఉంటుంది. తెల్ల వెల్లుల్లి కంటే పరిమాణంలో కొద్దిగా పెద్దగా ఉంటాయి. సాధారణంగా మనం వాడే వాటి కంటే ఎక్కువ ఋచీకర్మాగా ఉంటాయి. కొన్ని సూపర్ మార్కెట్లలో కూడా ఇవి కనిపిస్తాయి. హార్డ్ నెక్ గార్లిక్ వెరైటీ అని కూడా పిలుస్తారు.
నల్ల వెల్లుల్లి
చూడటానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తాయి. కానీ ఇవి ప్రత్యేకమైన పదార్థం ఏమి కాదు. రుచి, ఔషధ ప్రయోజనాల కోసం కొన్ని శతాబ్దాలుగా ఆసియా వంటకాల్లో దీన్ని విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇది ఏదైనా చీజ్ ప్లేట్, బ్రుషెట్టా, చికెన్ డిష్ లేదా పిజ్జా టాపర్ కి దీన్ని ఉపయోగిస్తారు. దీనితో చేసిన వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రక్తపోటు, రక్తంలో చక్కెర నియంత్రణలో ఉండటానికి ఉపయోగపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
పింక్ వెల్లుల్లి
పింక్ వెల్లుల్లిని గవితి లస్సాన్ అని కూడా పిలుస్తారు. ఒక్కో పాయలో 10 రెబ్బలు వరకు ఉంటాయి. పైకి గులాబీ రంగు కనిపించిన లోపల మాత్రం తెల్లగానే ఉంటాయి. ఇవి తీపి రుచి కలిగి ఉంటాయి. వీటి వాస కూడా చాలా ఘాటుగా ఉంటుంది. అందుకే దీన్ని వ్యసనపరుల వెల్లుల్లి అని కూడా పిలుస్తారు. ఇవి జ్యూసీ గా సాధారణ వెల్లుల్లి కంటే తక్కువ జిగటగా ఉంటాయి. ఇందులో విటమిన్లు ఏ, బి, సి, రాగి, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, ఐరన్, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. పింక్ వెల్లుల్లిని జాగ్రత్తగా భద్రపరిస్తే ఆరు నెలల నుంచి ఏడాది వరకి నిల్వ చేసుకోవచ్చు.
ఏవి ఆరోగ్యానికి మంచిది?
రంగుతో సంబంధం లేకుండా అన్ని రకాల వెల్లుల్లి మంచిదే. ఆరోగ్యానికి, వంటలకి చక్కని రుచి ఇస్తాయి. అయితే వీటిలో పర్పుల్ వెల్లుల్లి తేలికపాటి రుచి కలిగి ఉంటుంది. ఇవి వంటకి ప్రత్యేకమైన రుచిని ఇస్తాయి. అందుకే వేరే వాటితో పోల్చలేరు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే రోగనిరోధక శక్తి తగ్గినట్టే