Happy Holi 2024 : హోలీలో ప్రతి రంగుకి ఓ ప్రత్యేకత ఉంది.. ఆ రంగులైతే అస్సలు వాడొద్దు
Meanings of Holi Colors : రంగుల పండుగను చేసుకునేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు. కానీ మీకు తెలుసా? ప్రతి రంగుకి ఓ ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే ఈ సమయంలో వాడకూడని రంగులు కూడా ఉన్నాయి.
Holi Colors Significance : హోలీ సమయంలో రంగులు చల్లుకుంటూ.. ఆడుతూ పాడుతూ సమయాన్ని ఎంజాయ్ చేస్తారు. ఈ సమయంలో మనం ఉపయోగించే రంగులకు కొన్ని ప్రాముఖ్యతలు ఉన్నాయి. ఇప్పడంటే అన్ని రంగులు కలిపేసి.. ఇతరుల మీద చల్లేస్తూ.. ఎంజాయ్ చేస్తాము. కానీ ఇవి ప్రేమ, సంతోషం, ఇతర భావోద్వేగాలు, శుభాకాంక్షలు తెలియజేయడానికి వివిధ రంగులను ఉపయోగించేవారు. అయితే ఏ రంగుకు ఏ ప్రాముఖ్యత ఉందో.. అసలు ఏ రంగులను హోలీ సమయంలో ఉపయోగించకూడదో ఇప్పుడు తెలుసుకుంది.
సాధారణంగా హోలీ సమయంలో రెగ్యూలర్‌గా కొన్ని రంగులు వినియోగిస్తాము. ఎరుపు, గులాబీ, పసుపు, నీలం, ఆకుపచ్చ, నారింజ్, కుంకుమ, పర్పుల్ కలర్స్‌ను ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఈ రంగులకున్న ప్రత్యేకత, ప్రాముఖ్యతలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఎరుపు
ఎరుపు రంగు ప్రేమ, అభిరుచిని సూచిస్తుంది. హోలీ సమయంలో ఇది అత్యంత ప్రియమైన రంగుగా చెప్తారు. కృష్ణుడు, రాధ ప్రేమకు గుర్తుగా ఈ రంగును హోలీ సమయంలో వినియోగిస్తారు. హోలీ సమయంలో ప్రజల పట్ల తమ ప్రేమను వ్యక్తీకరించడానికి దీనిని ఉపయోగిస్తారు. తమ ప్రియమైన వారి ముఖాలపై ఎరుపు రంగు పూస్తారు. వివిహిత స్త్రీలు తమ వైవాహిక స్థితికి చిహ్నంగా వారి నుదిటిపై ఎరుపు రంగును ధరిస్తారు. అంతేకాకుండా భారతీయ సంస్కృతిలో ఎరుపును ధైర్యం, బలం అనే అర్థాన్ని ఇస్తుంది. ధార్మిక, ధైర్య, రక్షిత లక్షణాలు సూచిస్తుంది. దైవిక గుణాలు కూడా ఎరుపు రంగుకు ఉంటుంది.
పసుపు
ఆనందం, శాంతిని పసుపు రంగు సూచిస్తుంది. ఇది సూర్యరశ్మి, ఆనందమనే అర్థాలను ఇస్తుంది. చెడుపై విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు.. సంతోషానికి సూచనగా పసుపును జల్లుకుంటారు. పసుపునకు వైద్యలక్షణాలు ఉంటాయి. కాబట్టి దీనిని శక్తివంతమైన రంగుగా పరిగణిస్తారు. పైగా పసుపును పూజించే సంస్కృతి భారతీయులలో ఉంది. అంతేకాకుండా ఆరోగ్య ప్రయోజనాల కోసం ఆహారంలో కూడా దీనిని ఉపయోగిస్తారు.
నీలం
నీలం రంగును ప్రశాంతత, ధైర్యానికి గుర్తుగా చెప్తారు. ధైర్యం, ప్రేమ, ప్రశాంతతకు చిహ్నం. ఇది కృష్ణుడికి దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. ఎందుకంటే గోకుల నందుడు నీలి రంగులో ఉంటాడు. కృష్ణుడు ప్రేమ, జ్ఞానం, జయించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. అంతేకాకుండా విశాలమైన ఆకాశం, సముద్రం రంగును ఇది ప్రతిబింబిస్తుంది. కాబట్టి ఇది ప్రశాంతత భావాలతో ముడిపడి ఉంటుంది. దీనిని స్నేహితులు, కుటుంబ సభ్యులపై దీనిని చల్లవచ్చు.
ఆకుపచ్చ రంగు
ఆకుపచ్చని రంగు వసంత రాకను సూచిస్తుంది. తాజా ప్రారంభానికి గుర్తుగా దీనిని ఉపయోగిస్తారు. వేడుకలకు, వసంత ఋతువు రాకను చెప్తూ గ్రీన్ కలర్ ఉపయోగిస్తారు. ఇది ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి దీనిని సన్నిహితులకు రాసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా ఇది దైవికంగా కనిపిస్తుంది. పైగా ఇది అందరిలోనూ సంతోషాన్ని నింపుతుంది.
పింక్
ఉల్లాసభరితమైన రంగుగా గులాబీరంగును సూచిస్తారు. ఇది అమ్మాయిలు, మహిళలకు ఇష్టమైన రంగు. అత్యంత ఆకర్షణీయమైన, శక్తివంతమైన రంగుగా కనిపిస్తుంది. ఇది ఈవెంట్స్‌ను మరింత ఉల్లాసభరితంగా చేస్తుంది. యవ్వనం, ఆరోగ్యం, ఉల్లాసానికి ప్రతీకను గులాబీ రంగు ఇస్తుంది.
కుంకుమ రంగు
ముదురు కుంకుమపువ్వు రంగును పవిత్రమైన రంగుగా చెప్తారు. దీనినే నారింజ రంగు అని కూడా పిలుస్తారు. యోగులు, గురువులు, గౌరవనీయమైన వ్యక్తులు శక్తివంతమైన కుంకుమ రంగు తలపాగాలను జత చేసిన కాషాయ వస్త్రాలను ధరిస్తారు. హిందూమతంలో ఈ రంగు పవిత్ర చక్రాన్ని సూచిస్తుంది. స్వీయ అవగాహనకు కేంద్రంగా చెప్తారు. ఇది బలం, ధైర్యాన్ని సూచిస్తుంది.
పర్పుల్
ఈ రంగును ఎప్పుడూ రాయల్టీ, సంపద, అధికారంతో పోలుస్తారు. శాంతి, జ్ఞానాన్ని పర్పుల్ సూచిస్తుంది. అంతేకాకకుండా విశ్వానికి ప్రవేశ ద్వారంగా చెప్తారు.
హెలీ ఉపయోగించకూడని రంగులు ఇవే..
హోలీ సమయంలో తెలుపు, నలుపు రంగులను ఉపయోగించరు. నలుపును దుఖఃం, దురదృష్టంతో ముడిపడి ఉంటుంది. చెడు, ప్రతికూలత, చెడు కోరికలను ప్రతిబింబిస్తుంది. ఇది హోలీ సమయానికి తగినది కాదు. కుటుంబంలో మరణాన్ని సూచించే అంత్యక్రియలు, వేడుకలకు తెలుపును ప్రధానంగా ఉపయోగిస్తారు.
Also Read : ఆర్గానిక్ కలర్స్‌ను ఇలా ఎంచుకోండి.. హెల్తీ హోలీని చేసుకోండి