Holi Colors : ఆర్గానిక్ కలర్స్‌ను ఇలా ఎంచుకోండి.. హెల్తీ హోలీని చేసుకోండి
Happy Holi 2024 : పిల్లలనుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా జరుపుకునే పండుగల్లో హోలీ ఒకటి. అయితే సంతోషంగా జరుపుకోవాల్సిన పండుగను.. కెమికల్స్ బ్రష్టు పట్టిస్తున్నాయి. దానిని ఎలా అరికట్టాలంటే..
Organic Colors for Holi : వసంత రాకను గుర్తు చేస్తూ.. చెడుపై మంచే గెలుస్తుందని నమ్ముతూ.. రాధ-కృష్ణుల ప్రేమకు చిహ్నాంగా హోలీని జరుపుకుంటారు. ఒకటా రెండా.. ఈ రంగుల పండుగను జరుపుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. పురాణాల నుంచి వస్తున్న ఈ పండుగను సెలబ్రేట్ చేసుకునే పద్ధతులేమి మారట్లేదు. అప్పుడు ఎలా చేసుకునేవారు.. ఇప్పుడు అలానే చేసుకుంటున్నారు. కానీ దీనిలో ఏదైనా మార్పు ఉందా అంటే.. అది కేవలం కెమికల్స్ మాత్రమే. గతంలో కెమికల్ ఫ్రీ, సహజమైన రంగులను హోలీ కోసం ఉపయోగిస్తే.. ప్రస్తుతం కెమికల్స్‌తో నిండి రంగులు వినియోగిస్తున్నారు.
సేంద్రియ పదార్థాలతో..
సంతోషంగా చేసుకోవాల్సిన పండుగను కెమికల్స్‌తో నింపి ఆరోగ్యం, పర్యావరణాన్ని పాడు చేసే స్థితికి చేరిపోయాము. అందుకే కెమికల్స్‌తో నిండిన రంగులకు దూరంగా ఉండాలి అంటున్నారు నిపుణులు. కలర్స్ లేకుండా హోలీ ఎలా ఆడాలి అనుకుంటున్నారా? అయితే మీరు పూలు, మూలికలు, ఇతర సేంద్రియ పదార్థాలతో హోలీ ఆడుకోవచ్చు. ఇవి చర్మానికి ఎలాంటి ఇబ్బంది కలిగించకపోవడమే కాకుండా.. వాటి వినియోగం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. లేదంటే కెమికల్స్ అలెర్జీని పెంచడం.. కళ్లల్లో పడితే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
సింథటిక్ కలర్స్‌కు ప్రత్యామ్నయాలు
సంతోషాన్నిచ్చే విషయం ఏమిటంటే.. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన పెరుగుతుంది. అయితే ఈ హోలీ సమయలో రంగుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సింథటిక్ కలర్స్‌కు ప్రత్యామ్నయాలు ఏమి ఉన్నాయి. సేఫ్‌గా హోలీని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? ఒకవేళ రంగులు వదలకపోతే వాటిని ఎలా వదిలించుకోవాలి అనే విషయాలు ఇప్పుడు చుద్దాం.
ఇంట్లోనే ఇలా కలర్స్ ప్రిపేర్ చేసుకోండి..
ఎరుపు రంగు కోసం మీరు బీట్ రూట్, దానిమ్మ, ఎర్రచందనం, ఎర్ర గులాబీలు, కుంకం ఉపయోగించవచ్చు. బీట్ రూట్ అంటే విసరాలని కాదు.. దాని జ్యూస్‌ను మీరు కలర్స్‌గా ఉపయోగించుకోవచ్చు. పసుపు, చామంతి పువ్వులు.. కుంకుమపువ్వు నీటిని పసుపు రంగుకు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. బచ్చలి ఆకులు, గోరింటాకు పొడి వంటివి గ్రీన్ కలర్స్‌గా ఉపయయోగించవచ్చు. నీలిమందు ఆకులు, కొన్ని రకాల పువ్వులు ఉపయోగించవచ్చు. క్యారెంట్ రసం, సిట్రస్ ఫ్రూట్ జ్యూస్‌లు ఆరెంజ్‌ను రిప్రజెంట్ చేస్తాయి.
పర్యావరణానికి కూడా ఇబ్బంది ఉండదు..
ఈ సహజమైన రంగులు కేవలం మీకు హోలీ పండుగను అందివ్వడమే కాకుండా.. మీ అందాన్ని మెరుగుపరుస్తాయి. వీటిలోని ఔషద గుణాలు మీ స్కిన్, హెయిర్‌కు మంచి ప్రయోజనాలు అందిస్తాయి. నేలపై పడినా పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది ఉండవు. అన్నింటికి మించి.. ఈ రంగులు సులువుగా వదిలించుకోవచ్చు. పిల్లలకు కూడా ఇవి చాలామంచివి. వారి చర్మానికి ఎలాంటి ఇబ్బందులు కలగవు. చికాకు, అలెర్జీ వంటి రియాక్షన్స్ ఉండవు. పైగా వాటి సహజమైన సువాసన మీకు స్ట్రెస్ రిలీఫ్‌గా ఉంటుంది. ఆర్గానిక్ కలర్స్ నుంచి ఎల్లప్పుడూ ఓ మంచి అరోమా వస్తుంది. అది మీకు విశ్రాంతిని ఇస్తుంది.
కలర్స్‌ను ఇలా వదిలించుకోవచ్చు..
కెమికల్స్ లేకుండా సహజంగా చేసే హోలీ రంగులు లేదా హెర్బల్ కలర్స్‌ను మీరు ఎంచుకోవచ్చు. పైగా ఇవి మీ జుట్టును, చర్మాన్ని ఏ మాత్రం ప్రభావితం చేయవు. ఒకవేళ పొరపాటున కెమికల్ కలర్స్ అంటుకుని వాటి మరకలు వదలకపోతే.. మీరు శనగపిండి లేదా బియ్యం పిండిని స్క్రబ్‌గా ఉపయోగించవచ్చు. అంతేకాకుండా హోలీ ఆడుకునే ముందు చర్మానికి ఆయిల్ అప్లై చేస్తే.. రంగులు త్వరగా వదిలిపోతాయి.
వాటితో ఆరోగ్య సమస్యలు
ఆర్గానిక్ కలర్స్ ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలామంది సింథటిక్ రంగులు కొనేస్తారు. ఇవి చీప్ దొరకడం పక్కన పెడితే.. వాటిని వినియోగించడం వల్ల ఆస్పత్రి ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే అలి చర్మంపై అలెర్జీలు క్రియేట్ చేయడం.. చికాకు, దద్దుర్లు కలిగిస్తాయి. కంటిలో చికాకు, ఎరుపు, తాత్కాలిక అంధత్వానికి దారితీస్తాయి. వాటిని పీల్చడం వల్ల శ్వాసకోశ సమస్యుల తలెత్తుతాయి. ఇవి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు.
ప్రజల్లో పెరుగుతున్న అవగాహన వల్ల చాలామంది వినియోగదారులు హెర్బల్ కలర్స్‌ను ఎంచుకుంటున్నారు. అయితే కొన్నిసార్లు వాటిలో కూడా కల్తీ జరుగుతుంది. అందుకే వాటిని కొనే ముందు వాసన చూడండి. వాటినుంచి సహజమైన అరోమా రాకుంటే వాటిని పక్కనపెట్టేయండి. చక్కగా ఇంట్లోనే కొన్ని కలర్స్ చేసుకుని హోలీ ఆడుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ప్రకృతి, మనం కూడా హ్యాపీగా ఉంటాము.
Also Read : స్ట్రోక్ రాకుండా హార్ట్‌ను రక్షించే హెల్తీ డ్రింక్స్ ఇవే.. ఇలా తయారు చేసుకోండి