అన్వేషించండి

Obsessive Compulsive Disorder: OCD ఆత్మహత్యలను ప్రేరేపిస్తుందా? అది అంత ప్రమాదకరమైనదా?

మీరు ‘మహానుభావుడు’ మూవీ చూసే ఉంటారు. దాదాపు ఇదే కాన్సెప్ట్‌తో ‘మిస్ పర్‌ఫెక్ట్’ వెబ్ సీరిస్ కూడా వస్తోంది. ఇందులో కామన్ పాయింట్ OCD. అయితే దీన్ని మనం జోక్‌లా తీసుకోకూడదు. ఇది చాలా సీరియస్ సమస్య.

Obsessive Compulsive Disorder: అబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్ (OCD) అనేది ఒక వ్యక్తికి చేసిన పని పదే పదే చేయాలనే అనుభూతి కలిగిస్తుంది. ఇలాంటి ఆలోచనలు కలిగి ఉండటం వలన వ్యక్తులు తాము చేసే పనులను  పదే పదే చేస్తుంటారు. గదిని పలుమార్లు శుభ్రపరచడం, ఇంట్లో వస్తువులను పలుమార్లు తనిఖీ చేయడం లేదా చేతులు కడుక్కోవడం వంటి పనులను పునరావృతం చేస్తుంటారు. ఇది వారి రోజువారీ పనులకు ఆటంకం కలిగిస్తాయి. నిజానికి OCD అనేది చెడు అలవాటు కాదు. మురికి వస్తువులను తాకిన తర్వాత చేతులు ఒకసారి కడుక్కోండి మంచిదే. కానీ పదిసార్లు కడుక్కోవడం అనే విపరీతమైన ప్రవర్తనే OCD. ఈ పనులు చేయకపోతే వారిని వారు శక్తిహీనులుగా భావిస్తారు.

OCD ఆత్మహత్యను ప్రేరేపిస్తుందా?

OCD ఉన్న రోగుల మెదడులోని కొన్ని భాగాలలో బూడిదరంగు (గ్రే మేటర్) ఉన్న పదార్థం తక్కువగా ఉంటుంది. మెదడులోని గ్రే మేటర్ ఉన్న భాగాలు శరీరంలో ప్రేరణలను నియంత్రించడానికి, సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి ఉపయోగపడతాయి. అంటే మాట్లాడటం, రాయడం, ఆలోచన వంటి నైపుణ్యాలను నియంత్రించడానికి పనిచేస్తాయి. OCD రోగి మెదడులోని గ్రే మ్యాటర్ తగ్గడం వల్ల OCD ఉన్న వ్యక్తులు వారి ప్రేరణలను నియంత్రించుకోలేరు. ఇది తీవ్రమైన ఆందోళనకు దారితీయవచ్చు. ఇటీవల ఓ అధ్యయనం ప్రకారం ఓసిడి ఉన్న వ్యక్తుల్లో ఆక్సిడెంట్ ద్వారా చనిపోయే ప్రమాదం దాదాపు 92 శాతం ఉంటుందని తెలిసింది. అలాగే ఓసిడి ఉన్న వారిలో చనిపోవడానికి కారణం 82% వరకు ఎక్కువ అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఓసిడి ఉన్న వారిలో ఆత్మహత్యా సదృశ్యమైన ఆలోచనలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఓసిడి ద్వారా ఊపిరితిత్తుల వ్యాధి వచ్చేందుకు 73% రిస్కు ఉంటుందని, అలాగే మెంటల్ కండిషన్ డిజార్డర్ రిస్క్ 58% ఉంటుందని, నాడీ వ్యవస్థ మీద రిస్క ప్రభావం 23 శాతం వరకు ఉంటుందని చెబుతున్నారు. ఓసీడీ ద్వారా డిప్రెషన్, స్ట్రెస్ పెరగడం ద్వారా ఆత్మహత్య ఆలోచనలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.  

OCD కొన్ని లక్షణాలు ఇక్కడ ఉన్నాయి:

⦿ తలుపు మూసివేయడం, లైట్లు ఆఫ్ చేయడం, వస్తువులను లెక్కించడం వంటివి ఇందులో ఉంటాయి.
⦿ మురికిని చూడగానే భయం. 10 సార్లు చేతులు కడగడం. పదే పదే స్నానం చేయడం వంటివి ఇందులో ఉంటాయి. 
⦿ వస్తువులను తరచుగా శుభ్రపరచడం.
⦿ ఒక నిర్దిష్ట పద్ధతిలో ఏర్పాటు చేసిన వస్తువులను కదిలించినప్పుడు కలత చెందడం వంటివి ఇందులో కొన్ని లక్షణాలు.

OCD నయం అవుతుందా..?

అబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్ నయం అవదు. అయినప్పటికీ, చికిత్స లక్షణాలను నియంత్రించడంలో సహాయపడుతుంది, తద్వారా అవి రోజువారీ జీవితంలో ఆధిపత్యం చెలాయించవు. కొంతమంది రోగులకు OCD యొక్క తీవ్రతను బట్టి దీర్ఘకాలిక, కొనసాగుతున్న లేదా మరింత తీవ్రమైన చికిత్స అవసరం కావచ్చు. OCDతో బాధపడుతున్న వ్యక్తులు మానసిక వైద్యుడు లేదా మనస్తత్వవేత్త నుండి సమర్థవంతమైన మానసిక చికిత్సను పొందవచ్చు , వారు వారికి మార్గనిర్దేశం చేయవచ్చు, మద్దతు ఇవ్వగలరు.

OCDకి సహాయపడే కొన్ని ఇతర చికిత్సలు:

మందులు: మెదడులో సెరోటోనిన్  స్థాయిలను పెంచడం ద్వారా  OCD లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది, వైద్యులు సెలెక్టివ్ SSRIలు (SSRIలు), ట్రైసైక్లిక్ యాంటిడిప్రెసెంట్స్ , సెరోటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్స్ (SRIలు) వంటి మందులను సూచించవచ్చు.

మానసిక చికిత్స: కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ వంటి చికిత్సలు రోగులు వారి అబ్సెసివ్ ఆలోచనలను గుర్తించి నియంత్రించడంలో సహాయపడతాయి.

డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ (DBS):

ఇది శస్త్రచికిత్స విధానం, దీనిలో మెదడులోని నిర్దిష్ట భాగాలలో ఎలక్ట్రోడ్‌లను అమరుస్తారు. వాటిని ఉత్తేజపరిచేందుకు స్వల్ప విద్యుత్ ప్రవాహాలను ఉపయోగిస్తారు. ఈ విద్యుత్ ప్రేరణలు దీర్ఘకాలిక OCD లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి.

Also Read : ఈ ఫుడ్స్ క్యాన్సర్​ను నివారించడంలో హెల్ప్ చేస్తాయట.. నిపుణుల సలహా ఇదే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

GHMC Delimitation: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు మార్గం సుగమం - అభ్యంతరాలపై అన్ని పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు మార్గం సుగమం - అభ్యంతరాలపై అన్ని పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
TTD adulterated ghee case: టీటీడీ కల్తీ నెయ్యి కేసులోనూ చెవిరెడ్డి - జైల్లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు
టీటీడీ కల్తీ నెయ్యి కేసులోనూ చెవిరెడ్డి - జైల్లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు
Hyderabad Crime: మేడ్చల్ లెక్చరర్ అశోక్‌ను చంపింది భార్యే - నమ్మకంగా విషం పెట్టేసింది !
మేడ్చల్ లెక్చరర్ అశోక్‌ను చంపింది భార్యే - నమ్మకంగా విషం పెట్టేసింది !
Doctors attack patient: ఆస్పత్రిలో రోగిపై వైద్యుడు దాడి - మాట మాట పెరిగినందుకే - షాకింగ్ వీడియో
ఆస్పత్రిలో రోగిపై వైద్యుడు దాడి - మాట మాట పెరిగినందుకే - షాకింగ్ వీడియో

వీడియోలు

India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Delimitation: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు మార్గం సుగమం - అభ్యంతరాలపై అన్ని పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు మార్గం సుగమం - అభ్యంతరాలపై అన్ని పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
TTD adulterated ghee case: టీటీడీ కల్తీ నెయ్యి కేసులోనూ చెవిరెడ్డి - జైల్లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు
టీటీడీ కల్తీ నెయ్యి కేసులోనూ చెవిరెడ్డి - జైల్లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు
Hyderabad Crime: మేడ్చల్ లెక్చరర్ అశోక్‌ను చంపింది భార్యే - నమ్మకంగా విషం పెట్టేసింది !
మేడ్చల్ లెక్చరర్ అశోక్‌ను చంపింది భార్యే - నమ్మకంగా విషం పెట్టేసింది !
Doctors attack patient: ఆస్పత్రిలో రోగిపై వైద్యుడు దాడి - మాట మాట పెరిగినందుకే - షాకింగ్ వీడియో
ఆస్పత్రిలో రోగిపై వైద్యుడు దాడి - మాట మాట పెరిగినందుకే - షాకింగ్ వీడియో
Gen Z vlogger Swathi Roja met Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను కలిసిన జెన్ Z వ్లాగర్ స్వాతి రోజా- శ్రీశైలంలో ఎదురైన అనుభవాలు తెలుసుకున్న డీసీఎం 
పవన్ కల్యాణ్‌ను కలిసిన జెన్ Z వ్లాగర్ స్వాతి రోజా- శ్రీశైలంలో ఎదురైన అనుభవాలు తెలుసుకున్న డీసీఎం 
Bondi Beach shooting: సాజిద్ అక్రమ్ డెడ్‌బాడీని కూడా తాకను - అంతిమ సంస్కారాలు చేసేందుకు భార్య నిరాకరణ
సాజిద్ అక్రమ్ డెడ్‌బాడీని కూడా తాకను - అంతిమ సంస్కారాలు చేసేందుకు భార్య నిరాకరణ
Hyderabad Crime News: బ్రేకప్ తట్టుకోలేక హైదరాబాద్‌లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
బ్రేకప్ తట్టుకోలేక హైదరాబాద్‌లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
Mahesh Babu : రాజమౌళి 'వారణాసి' కోసం మహేష్ డెడికేషన్ - పురాతన యుద్ధ విద్యలో ట్రైనింగ్
రాజమౌళి 'వారణాసి' కోసం మహేష్ డెడికేషన్ - పురాతన యుద్ధ విద్యలో ట్రైనింగ్
Embed widget