Viral News: పాముతో ఆడుతున్న పిల్లాడు- రీల్స్ కోసం డేంజర్ ఫీట్‌లు
Viral News: పాముతో ఆడుకుంటున్న చిన్నారి వీడియో ఆన్‌లైన్‌ను షేక్ చేస్తోంది. నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలతో ఈ పనికిమాలిన పనులేంటని తిట్టిపోస్తున్నారు

Viral Video : సోఫాలో కూర్చొనే ఒక పిల్లవాడు ఓ పాముతో ఆడుకుంటున్న ఒక వీడియో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో పాముతో ఆడుకుంటున్న పిల్లాడి దృశ్యాలు చూసిన నెటిజన్లు షాక్ తిన్నారు. మరికొందరు డేంజర్ ఫీట్స్ కోసం పిల్లాడి భవిష్యత్‌ను ప్రమాదంలో పడేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లోని @vivek_choudhary_snake_saver అనే అకౌంట్ నుంచి ఇది పోస్టు అయింది. ఇందులో ఉన్న చిన్నపిల్లాడు పాము ఎంత ప్రమాదకారో తెలియకుండా దాంతో ఆడుకుంటున్నాడు. తోక పట్టిలాగుతున్నాడు. బొమ్మలా ఉన్న ఆ పాము అటూ ఇటూ కదులుతుంటే మరింత జోష్‌తో దాన్ని లాగుతున్నాడు.
పాము అక్కడి నుంచి తప్పించుకొని వెళ్లిపోయేందుకు యత్నిస్తోంది. ఎన్నిసార్లు జారి పోయి వెళ్లిపోదామని చూసినా దాన్ని మాత్రం ఆ పిల్లాడు విడిచిపెట్టలేదు. ప్రమాదం గురించి తెలియక పోవడంతో ప్రశాంతంగా పాముతో ఆటలాడుకున్నాడు.
View this post on Instagram
ఇలా ఆడుకున్న టైంలో పాము ఒకసారి బాలుడు పాము తల పట్టుకుంటుండగా నాలుక తీస్తుంది. దీన్ని గమనించిన బాలుడు ఒక్కసారి భయపడిపోయి పాములు పక్కకు వదిలేసి వెళ్లిపోయే ప్రయత్నం చేస్తాడు. మళ్లీ కాసేపటికే దాన్ని పట్టుకునే ప్రయత్నించే లోపు పాము అక్కడి నుంచి జారుకుంటుంది.
వీడియో ఇద్దరు వ్యక్తులు చిత్రీకరిస్తున్నట్టు అక్కడ పరిసరాలు చూస్తుంటే అర్థమవుతోంది. పాము రావడం బాలుడి చుట్టూ తిరగడం బాలుడు కూడా దానితో ఆడటం అన్నీ చిత్రీకరించారు. చివరకు ఆ పాము సోఫా నుంచి కిందికి దిగి వెళ్లిపోతున్న టైంలో ఎదురుగా ఉన్న వ్యక్తి వచ్చి పాములు పట్టుకునే ప్రయత్నం చేయడంలో వీడియోలో ఉంది.
కొంతమంది యూజర్లు ఆ చిన్నారి ధైర్యసాహసాలకు ఆశ్చర్యపోగా, మరికొందరు ఆ దృశ్యాలను షూట్ చేసిన వ్యక్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ చిన్నారిని ప్రమాదంలో పడేస్తున్నారని విమర్శించారు.
"పిల్లలను ప్రమాదంలో పడేంత తీవ్రస్థాయికి వెళ్లకండి. ఆ చిన్నారిని జాగ్రత్తగా చూసుకోండి, సోదరా. లైక్‌ల కోసం చేసే ఈ చర్యల వల్ల ఏదైనా ప్రమాదం జరగొచ్చు!" అని ఒక యూజర్ రాశారు. "నీకు పిచ్చి పట్టిందా? నువ్వు పిల్లవాడిని పాముతో ఆడుకునేలా ప్రోత్సహిస్తున్నావు !" అని మరొక యూజర్ ఆగ్రహంతో కామెంట్ చేశాడు.
"ఏమి చేస్తున్నాడో ఆ చిన్నారికి తెలియదు. పాము అతన్ని కరిచి ఉంటే, పరిణామాలు ప్రాణాంతకం అయ్యేవి" అని మరో వ్యక్తి మండిపడ్డాడు.
"ఇలాంటి డింజరస్ వీడియోలు చేయవద్దు. లైకులు, వ్యూస్ కోసం మీరు పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు" అని ఇంకో నెటిజన్ ఫైర్ అయ్యారు.
"వ్యూస్ కోసం పిల్లలను ప్రమాదంలో పడేసే పనులు చేయడం ఆపండి. ఏదైనా జరిగి ఉంటే దీని ముగింపు చాలా దారుణంగా ఉండేది" అని మరో వ్యక్తి రాశారు.
ఈ క్లిప్ 12 మిలియన్లకుపైగా వ్యూస్ సంపాదించింది.
ఈ అకౌంట్‌లో ఇలాంటి వీడియోలు చాలానే ఉన్నాయి. పాములను పట్టుకున్న పిల్లలు చాలా మంది కనిపిస్తున్నారు.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

