అన్వేషించండి

Fact Check: బెంగళూరులో EVM బ్యాలెట్ బటన్ పని చేయలేదా? అసలు వాస్తవం ఇదే

Fact Check: బెంగళూరులో ఓ పోలింగ్‌బూత్‌లో ఈవీఎమ్‌ బ్యాలెట్ బటన్ పని చేయలేదంటూ వైరల్ అయిన ఆడియో క్లిప్‌లో నిజం లేదని ఈసీ స్పష్టం చేసింది.

Fact Check: వాట్సాప్‌లో ఓ ఆడియో క్లిప్ విపరీతంగా షేర్ అవుతోంది. రెండో విడత లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరులో ఓ పోలింగ్‌ బూత్‌లో ఈవీఎమ్‌ బ్యాలెట్ బటన్ పని చేయలేదన్నది ఆ ఆడియో సారాంశం. ఇది నిజమా కాదా అని వెరిఫై చేయకుండానే చాలా మంది వాట్సాప్‌లో అందరికీ ఫార్వర్డ్ చేసేస్తున్నారు. ఇది కాస్తా ఎన్నికల సంఘం దృష్టి వరకూ వెళ్లింది. వెంటనే అప్రమత్తమై ఫ్యాక్ట్‌చేయగా అదంతా అవాస్తవం అని తేలింది. బెంగళూరులోని శాంతినగర్‌లో బూత్‌ నంబర్ -17లో ఈవీఎమ్‌ బ్యాలెట్ బటన్ యాక్టివేట్ కాలేదంటూ జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు అధికారులు. 

క్లెయిమ్ (ప్రచారం): 

ఈ ఆడియో క్లిప్‌లో ఓ వ్యక్తి బెంగళూరులోని శాంతినగర్‌లో పోలింగ్ బూత్ నంబర్ 17లో EVM బ్యాలెట్ బట్ పని చేయాలని చెప్పాడు. అందులో ఇంకా ఏముందంటే..

"నేను ఓటర్ స్లిప్ ఇచ్చి ఓటు వేసేందుకు లోపలికి వెళ్లాను. ఈవీఎమ్‌పై బటన్ నొక్కాను. కానీ ఎలాంటి శబ్దమూ రాలేదు. అటు వీవీప్యాట్‌లోనూ నేను ఓటు వేసిన అభ్యర్థి ఫొటో కనిపించలేదు. ఓ 10-15 సెకన్ల తరవాత మరోసారి బటన్ నొక్కాను. అప్పుడు కూడా వీవీప్యాట్ మెషీన్‌లో ఎలాంటి సౌండ్ రాలేదు. నాకు చాలా కోపం వచ్చి అక్కడి సిబ్బందిని అడిగాను. సౌండ్ ఎందుకు రావడం లేదని నిలదీశాను. నేను మరీ అంత పిచ్చోడిగా కనిపిస్తున్నానా అని మండిపడ్డాను. కంట్రోల్ ప్యానెల్‌లో బటన్ నొక్కాల్సిన వ్యక్తి ఆ పని చేయలేదని అర్థమైంది. అందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే. మీరు ఓటు వేసే ముందు కంట్రోల్ ప్యానెల్‌లో బటన్ నొక్కారా లేదా అని సరి చూసుకోండి. అతను అక్కడ బటన్ నొక్కిన తరవాత EVMపై గ్రీన్‌ లైట్‌ ఆన్ అవుతుంది. ఆ తరవాత మనం బటన్ నొక్కితే ఓటు నమోదవుతుంది. మీరు ఓటు వేసే సమయంలో ఈవీఎమ్‌పై గ్రీన్ లైట్ లేకపోతే అక్కడి సిబ్బందిని నిలదీయండి"

నిజమేంటి..?

ఈ ఆడియో క్లిప్‌ నిజమా కాదా అని Newschecker టీమ్‌ ఫ్యాక్ట్‌చెక్ చేసింది. ఇప్పటికే ఎన్నికల సంఘం అలాటిదేదీ జరగలేదని తేల్చి చెప్పినట్టు ఫ్యాక్ట్‌చెక్‌లో వెల్లడైంది. బెంగళూరులో ఇలా జరిగిందంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదని స్పష్టం చేసింది. బెంగళూరు జిల్లా ఎన్నికల అధికారి కూడా ఇదే విషయం చెప్పారు. X వేదికగా పోస్ట్‌లు పెట్టారు. ఏప్రిల్ 26వ తేదీన దీనిపై క్లారిటీ ఇస్తూ Xలో ఈ పోస్ట్‌లు షేర్ చేశారు. మొత్తంగా చూస్తే బెంగళూరులో EVM బటన్ యాక్టివ్ కాలేదని జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం కాదని తేలింది. 
 
This story was originally published by newschecker.in, as part of the Shakti Collective. This story has been translated by ABPDesam staff. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, ప్రభాకర్ రావు పాస్ పోర్ట్ రద్దు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, ప్రభాకర్ రావు పాస్ పోర్ట్ రద్దు
CM Chandrababu: అమరావతిలో సీఎం చంద్రబాబు ఇంటికి శంకుస్థాపన, పాల్గొన్న కుటుంబసభ్యులు- నిర్మాణ బాధ్యతలు ఎవరికంటే
అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి శంకుస్థాపన, పాల్గొన్న కుటుంబసభ్యులు- నిర్మాణ బాధ్యతలు ఎవరికంటే
టీడీపీ, బీఆర్‌ఎస్‌కు మాత్రమే ఆ ఘనత ఉంది- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
టీడీపీ, బీఆర్‌ఎస్‌కు మాత్రమే ఆ ఘనత ఉంది- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
Karumuri controversial Comments: గుంటూరు ఇవతల వారిని ఇళ్లలోంచి లాగి కొడతాం -  అవతల వారిని అడ్డంగా నరుకుతాం - వైసీపీ నేత కారుమూరి హెచ్చరిక
గుంటూరు ఇవతల వారిని ఇళ్లలోంచి లాగి కొడతాం - అవతల వారిని అడ్డంగా నరుకుతాం - వైసీపీ నేత కారుమూరి హెచ్చరిక
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Virat Kohli Batting vs MI IPL 2025 | ఫుల్ అగ్రెసివ్ మోడ్ లో దుమ్మురేపిన కింగ్ కొహ్లీMI vs RCB Match Records IPL 2025 | పదేళ్ల తర్వాత ముంబై గడ్డపై ఆర్సీబీ ఘన విజయంTilak Varma Batting vs RCB IPL 2025 | తనను అవమానించిన హార్దిక్ తో కలిసే దడదడలాడించిన తిలక్Hardik Pandya vs Krunal Pandya MI vs RCB | IPL 2025 లో మంచి మజా ఇచ్చిన అన్నదమ్ముల సవాల్

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, ప్రభాకర్ రావు పాస్ పోర్ట్ రద్దు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, ప్రభాకర్ రావు పాస్ పోర్ట్ రద్దు
CM Chandrababu: అమరావతిలో సీఎం చంద్రబాబు ఇంటికి శంకుస్థాపన, పాల్గొన్న కుటుంబసభ్యులు- నిర్మాణ బాధ్యతలు ఎవరికంటే
అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి శంకుస్థాపన, పాల్గొన్న కుటుంబసభ్యులు- నిర్మాణ బాధ్యతలు ఎవరికంటే
టీడీపీ, బీఆర్‌ఎస్‌కు మాత్రమే ఆ ఘనత ఉంది- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
టీడీపీ, బీఆర్‌ఎస్‌కు మాత్రమే ఆ ఘనత ఉంది- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
Karumuri controversial Comments: గుంటూరు ఇవతల వారిని ఇళ్లలోంచి లాగి కొడతాం -  అవతల వారిని అడ్డంగా నరుకుతాం - వైసీపీ నేత కారుమూరి హెచ్చరిక
గుంటూరు ఇవతల వారిని ఇళ్లలోంచి లాగి కొడతాం - అవతల వారిని అడ్డంగా నరుకుతాం - వైసీపీ నేత కారుమూరి హెచ్చరిక
Andhra Pradesh News: పోలీసుల బట్టలూడదీస్తావా? యూనిఫాం అరటితొక్క కాదు- మాజీ సీఎం జగన్‌కు రామగిరి ఎస్సై కౌంటర్
పోలీసుల బట్టలూడదీస్తావా? యూనిఫాం అరటితొక్క కాదు- మాజీ సీఎం జగన్‌కు రామగిరి ఎస్సై కౌంటర్
Chiranjeevi: సింగపూర్ వెళ్లిన మెగా కపుల్... చిరు, సురేఖ దంపతులతో పాటు పవన్ ఫోటోలు
సింగపూర్ వెళ్లిన మెగా కపుల్... చిరు, సురేఖ దంపతులతో పాటు పవన్ ఫోటోలు
Waqf Amendment Act 2025:అమల్లోకి వచ్చిన వక్ఫ్ సవరణ చట్టం 2025 - నోటిఫికేష్ జారీ చేసిన కేంద్రం 
అమల్లోకి వచ్చిన వక్ఫ్ సవరణ చట్టం 2025 - నోటిఫికేష్ జారీ చేసిన కేంద్రం 
IPL 2025 PBKS VS CSK Result Update: పంజాబ్ అద్భుత విజయం.. సత్తా చాటిన ప్రియాంశ్, శశాంక్, స్లో బ్యాటింగ్ తో  చెన్నైకి నాలుగో ఓటమి
పంజాబ్ అద్భుత విజయం.. సత్తా చాటిన ప్రియాంశ్, శశాంక్, స్లో బ్యాటింగ్ తో చెన్నైకి నాలుగో ఓటమి
Embed widget