Bindu Madhavi: వేశ్య పాత్రలో హీరోయిన్ బింధు మాధవి - 'దండోరా' మూవీలో ఛాలెంజింగ్ రోల్
Dhandoraa Movie: పరువు హత్యలు, కుల వివక్ష వంటి అంశాలే ప్రధానాంశంగా తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ 'దండోరా'. ఈ మూవీలో ప్రముఖ నటి బిందు మాధవి కీలక పాత్రలో నటించనున్నారు.

Actress Bindu Madhavi Layered Character In Dhandoraa Movie: హీరోయిన్ బిందు మాధవి (Bindu Madhavi).. 'ఆవకాయ్ బిర్యానీ' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత పిల్ల జమిందార్, బంపరాఫర్ సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆ తర్వాత టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గినా తమిళంలో బిజీగా మారారు. టీవీ రియాలిటీ షో 'బిగ్ బాస్' టైటిల్ విన్ అయి తెలుగు ఆడియన్స్‌కు మళ్లీ దగ్గరయ్యారు. తాజాగా.. 'దండోరా' (Dhandoraa) సినిమాలో ఓ కీలక పాత్రలో నటించనున్నారు.
వేశ్య పాత్రలో..
తాజాగా.. ఈ మూవీ షూటింగ్ సెకండ్ షెడ్యూల్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే 'కోర్ట్' మూవీలో మంగపతిగా తన నటనతో మెప్పించిన నటుడు శివాజీ మూవీ షూటింగ్‌లో భాగమయ్యారు. లేటెస్ట్‌గా నటి బిందు మాధవి సైతం ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం మూవీ టీం తెలంగాణలోని మెదక్ జిల్లాలోని ధరిపల్లి గ్రామంలో షూటింగ్ జరుపుతోంది.
#BinduMadhavi being effortlessly gorgeous in a new rooted look.💫♥️ Straight from the sets of #Dhandoraa!🥁
— Loukya entertainments (@Loukyaoffl) April 14, 2025
Stay tuned for exciting updates@Afilmby_Murali @Benny_Muppaneni @itsmaniika @ActorSivaji @pnavdeep26 #Mounika @ActorNandu #RaviKrishna @Raadhya33 pic.twitter.com/hz3XQG28By
మూవీలో బిందు మాధవి వేశ్య పాత్రలో నటించనున్నారు. ఈ మేరకు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఓ చిన్నారికి తల్లిగా 'శ్రీలత' అనే వేశ్య పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు. ఆమె రోల్ ఎమోషనల్ టచ్‌తో ఆలోచింప చేసేలా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సందర్భంగా కింగ్ నాగార్జున పక్కన బిందు నిలబడి ఉన్న ఫోటోను పంచుకున్నారు. ఈ ఛాలెంజింగ్ రోల్‌తోనైనా బిందు కెరీర్ హిట్ ట్రాక్ అందుకుంటుందని అనుకుంటున్నారు. అంతకు ముందు 'సెగ' సినిమాలోనూ వేశ్య పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో నాని, నిత్యమీనన్ కీలక పాత్రలు పోషించారు.
Also Read: అంతర్జాతీయ భాషలో 'బాహుబలి: ది బిగినింగ్' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
తమిళం, తెలుగు భాషల్లో..
'ఆవకాయ్ బిర్యానీ' మూవీతో కెరీర్ మొదలుపెట్టిన బిందు టాలీవుడ్‌లో రామ రామ కృష్ణ కృష్ణ, పిల్ల జమిందార్, బంపరాఫర్ వంటి సినిమాల్లో నటించినా అంతగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీ వైపు వెళ్లారు. 'పొక్కిషం', 'కజుగు', 'కెడి బిల్లా కిల్లాడి రంగా' సినిమాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత టాలీవుడ్‌లో అంతగా కనిపించలేదు. 2022లో తెలుగు ఓటీటీలో ప్రసారమైన 'బిగ్ బాస్' రియాలిటీ షో ఫస్ట్ సీజన్‌లో పాల్గొని విజేతగా నిలిచారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ తెలుగు సినిమాలో నటిస్తున్నారు.
నేషనల్ అవార్డు మూవీ 'కలర్ ఫోటో', బ్లాక్ బస్టర్ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని 'దండోరా' మూవీని రూపొందిస్తున్నారు. మురళీకాంత్ దర్శకత్వం వహిస్తుండగా.. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మణిక, అనూష, రాధ్య తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఇటీవల విడుదలైన 'దండోరా' ఫస్ట్ బీట్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సమాజంలో కుల వివక్ష, అగ్రవర్ణాలకు చెందిన అమ్మాయిలని ప్రేమించి పెళ్లి చేసుకున్నా, వారికి ఎదురు తిరిగినా ఎలాంటి దౌర్జన్యకాండ జరుగుతున్నాయనేది ప్రధానాంశంగా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో మన పురాతన ఆచారాలు, సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూనే వ్యంగ్యం, కామెడీ, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల కలయికగా మూవీని ఆవిష్కరిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు మార్క్ కె.రాబిన్ మ్యూజిక్ అందిస్తున్నారు.





















