Andhra Pradesh News: పోలీసుల బట్టలూడదీస్తావా? యూనిఫాం అరటితొక్క కాదు- మాజీ సీఎం జగన్‌కు రామగిరి ఎస్సై కౌంటర్
YS Jagan ఊడదీయడానికి నువ్వు ఇచ్చిన డ్రస్సు అనుకున్నావా.. అది పోలీసు యూనిఫాం అని, అరటి తొక్కకాదు అంటూ మాజీ సీఎం జగన్‌కు రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

రామగిరి: వైసీపీ అధికారంలోకి వచ్చాక పోలీసుల బట్టలు ఊడదీస్తానంటూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చంచలనంగా మారాయి. వైసీపీ అధినేత జగన్ శ్రీ సత్య సాయి జిల్లా రాప్తాడు పర్యటనలో చేసిన వ్యాఖ్యలకు రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పోలీసుల బట్టలు ఊడదీసి కొడతా అంటున్నావు జగన్. అవి ఏమైనా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకుంటున్నారా? మేం కష్టపడి చదివి సాధించుకున్న యూనిఫామ్ అది. ఎన్నో వేల మంది పోటీ పడితే పరీక్షల్లో నెగ్గి, పరుగు పందాలు ఈవెంట్లలో క్వాలిఫై అయ్యి యూనిఫామ్ సాగించుకున్నాం. మీరు వచ్చి ఊడదీస్తామంటే తీయడానికి ఇది అరటి తొక్క కాదు.
పోలీసులు ప్రభుత్వానికిగానీ, నాయకులకుగానీ తొత్తులు కాదు. మేం నిజాయితీగానే పని చేస్తాం, నిజాయితీగానే చస్తాం. కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అంటూ మాజీ సీఎం జగన్ కు రామగిరి ఎస్సై కౌంటర్ ఇచ్చారు. మార్చిలో రామగిరి ఎంపీపీ ఎలక్షన్స్ సందర్భంగా పోలీసులు చట్టబద్ధంగానే నడుచుకున్నారు. సత్యసాయి జిల్లా ఎస్పీ ఆదేశాలతో వందల మంది పోలీసులతో బందోబస్తు కల్పించాం. కానీ ఎంపీటీసీలను రామేశ్వరం తీసుకెళ్లి ఎలక్షన్ వాయిదా పడేలా చేశారని ఎస్ఐ సుధాకర్ యాదవ్ అన్నారు.
ఈ రోజు జగన్ విమర్శలు చేసిన రామగిరి ఎస్ఐ జి. సుధాకర్ యాదవ్, జగన్ కి మామూలు వార్నింగ్ ఇవ్వలేదు..
— Swathi Reddy (@Swathireddytdp) April 8, 2025
"జగన్.. నా బట్టలు ఊడదీస్తావా ? నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు కాదురా ఇవి.. కష్టపడి చదివి, పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫారం ఇది. ఎవడో వచ్చి ఊడదీయటానికి ఇది అరటి తొక్క కాదు.." pic.twitter.com/AnAppdFQEp
మరోవైపు వైసిపి నేత కారుమూరి నాగేశ్వరరావు ఏలూరులో జరిగిన పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి మన ప్రభుత్వమే వస్తుంది. అప్పుడు గుంటూరు అవతలి వారిని అడ్డంగా నరికేద్దాం. యువతల వారిని ఇళ్ల నుంచి లాక్కొచ్చి కొడతామన్నారు. వైయస్ జగన్ రాప్తాడు పర్యటన తర్వాత వైసీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని, ఉద్యోగులను భయపెట్టే చర్యలకు దిగారని రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు. పోలీసులతో పాటు ఇతర శాఖల ఉద్యోగులకు భరోసా కల్పించాలని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను ఆయన కోరారు. తాము కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్నామని, నిజాయితీగానే బతుకుతాము, నిజాయితీగానే చనిపోతామని మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది
చంద్రబాబుకు చెబుతున్నాం..
— YSR Congress Party (@YSRCParty) April 8, 2025
చంద్రబాబు మెప్పుకోసం వాచ్‌మెన్లుగా పనిచేస్తున్న పోలీసులకు చెబుతున్నా...
ఎల్లకాలం చంద్రబాబు పరిపాలన సాగదు..
మీ యూనిఫాం తీయించి..దోషులుగా మిమ్మల్ని నిలబెడతాం..
మీరు చేసిన ప్రతి పనినీ వడ్డీతో సహా లెక్కేసి మీతో కక్కిస్తాం.
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ… pic.twitter.com/r4nsS0VoXB
జగన్ ఏమన్నారంటే..
చంద్రబాబు పాలనలో దొంగ సాక్ష్యాలు క్రియేట్ చేస్తున్నారు. వాళ్లకు నచ్చని నాయకులను పద్ధతి ప్రకారం కేసుల్లో ఇరికించి, చంపిచేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారు. చంద్రబాబు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుని రాజకీయాలు చేయాలన్నారు. చంద్రబాబు మెప్పుకోసం వాచ్‌మెన్లుగా పనిచేస్తున్న పోలీసులకు చెబుతున్నా... ఎల్లకాలం చంద్రబాబు పరిపాలన సాగదు.. మేం అధికారంలోకి వస్తాం. మీ యూనిఫాం తీయించి.. దోషులుగా మిమ్మల్ని నిలబెడతాం. మీరు చేసిన ప్రతి పనినీ వడ్డీతో సహా లెక్కేసి మీతో కక్కిస్తాం అని జగన్ అన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

