Gowri Kalyanam : ఆరుగురు సింగర్స్, ఒక్క పాట - గౌరీ కళ్యాణ వైభోగమే
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ సింగర్స్ ఆరుగురు కలిసి ఓ సాంగ్ పాడారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ సాంగ్ ఏంటి? ఆ కథ ఏంటి? ఓ లుక్ వేయండి.
సింగర్ సత్య యామిని (Satya Yamini)... 'బాహుబలి' సినిమాలో 'మమతల తల్లి... ఒడి బాహుబలి' పాట పాడారు. అదొక్కటే కాదు... ఇంకా చాలా హిట్ సాంగ్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. 'ఇస్మార్ట్ శంకర్'లో 'దిమాక్ ఖరాబ్...', 'అల వైకుంఠపురములో' సినిమాలో 'సిత్తరాల సిరపడు...' వంటి హిట్ సాంగ్స్ ఎన్నో పాడిన సాకేత్ (Saketh Komanduri) ఉన్నారు కదా! గీతా మాధురి (Geetha Madhuri) గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆవిడ ఖాతాలో కూడా ఎన్నో హిట్స్ ఉన్నాయి.
సత్య యామిని, సాకేత్ కోమండూరి గీతా మాధురితో పాటు ఫేమస్ సింగర్స్ మనీషా ఈరబత్తిని, సమీరా భరద్వాజ్, అనుదీప్... మొత్తం ఆరుగురు సింగర్స్ కలిసి ఒక పాట పాడారు. ఆ పాట పేరు 'గౌరీ కళ్యాణ వైభోగమే' (Gowri Kalyana Vaibhogame Song). ఇప్పుడు ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ టెక్స్ట్‌టైల్స్ కంపెనీ 'గౌరీ సిగ్నేచర్స్' కోసం ఈ పాటను రూపొందించారు.
ఆరుగురు గాయనీ గాయకులను ఒక వేదిక మీదకు తీసుకు రావడం ఈ పాట ప్రత్యేకత అయితే... 'గౌరీ కళ్యాణ వైభోగమే' అంటూ సాగే సాహిత్యం ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంది. పిక్చరజేషన్ కూడా కలర్‌ఫుల్‌గా ఉంది. పెళ్లి పాటలకు తెలుగునాట మంచి డిమాండ్ ఉంది. 'పెళ్లి పుస్తకం' సినిమాలో 'శ్రీరస్తు శుభమస్తు....' నుంచి 'మురారి' చిత్రంలో 'అలనాటి రామచంద్రుడు...' పాట వరకు, ఈ మధ్య కాలంలో వచ్చిన పెళ్లి పాటలు చాలా వివాహ మండపాల్లో వినిపిస్తూ ఉంటాయి. ఆ కోవలోకి ఈ పాట కూడా చేరుతుందని చెప్పవచ్చు.
'గౌరీ కళ్యాణ వైభోగమే' పాటలో 'శ్రీరస్తు పలికే వేద మంత్రాలు - శుభమస్తు పలికే పంచభూతాలు' వంటి పద ప్రయోగాలు బావున్నాయి. అందరికీ అర్థం అయ్యే విధంగా సాహిత్యం, సంగీతం అందించారు కేశవ కిరణ్. ఈ పాటకు విన్ను ముత్యాల దర్శకత్వం వహించారు. సాంగ్‌లో సింగర్స్ కాస్ట్యూమ్స్ కూడా బావున్నాయి. పాటను విడుదల చేయడమే కాదు... 'Gowri Kalyanam Singing Challenge Contest' పేరుతో కాంటెస్ట్ కూడా రన్ చేస్తున్నారు. పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు బహుమతులు అందిస్తున్నారు.
Also Read : మనల్ని కిందకు లాగడానికి ప్రయత్నించేవాళ్ళు ఉంటారు, నెగిటివిటీని పట్టించుకోను - కృతి శెట్టి ఇంటర్వ్యూ
మనీషా ఈరబత్తిని... గతంలో మాషప్ సాంగ్స్ (Mashup Songs) కొన్ని చేశారు. తెలుగులో హిట్ సాంగ్స్ పాడారు. ఆ మాషప్ సాంగ్స్‌కు ఈ 'గౌరీ కల్యాణ వైభోగమే' డిఫరెంట్ సాంగ్ అని చెప్పాలి. సమీరా భరద్వాజ్ విషయానికి వస్తే... 'సరైనోడు' సినిమాలో 'తెలుసా తెలుసా', విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి' సినిమాలో 'మధురం...', 'ద్వారకా' సినిమాలో 'ఎంత చిత్రం కదా', 'శతమానం భవతి' చిత్రంలో 'నాలో నేను' తదితర పాటలు ఆలపించారు.
Also Read : సమంతకు జోడీ - దుష్యంత మహారాజు - దేవ్ మోహన్ ఫస్ట్ లుక్