అన్వేషించండి

Entertainment Top Stories Today: ‘పుష్ప 2’ రిలీజ్ డేట్ ఛేంజ్, తెలుగు రాష్ట్రాల్లో ‘గేమ్ ఛేంజర్’ రికార్డు బిజినెస్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Entertainment News Today In Telugu: ‘పుష్ప 2’ రిలీజ్ డేట్ ఛేంజ్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘గేమ్ ఛేంజర్’ రికార్డు బిజినెస్ వరకు... ఇవాళ్టి టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్.

‘పుష్ప 2’ రిలీజ్ డేట్ ఒకరోజు ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ప్రత్యేక గీతంలో శ్రద్ధా కపూర్ దాదాపు ఓకే అయినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ‘గేమ్ ఛేంజర్’ రికార్డు బిజినెస్ చేస్తుంది. శివకార్తికేయన్ ‘అమరన్’ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. బిడ్డ కోసం రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే దంపతులు ప్రత్యేక కారును కొనుగోలు చేశారు.

ఒక్కరోజు ముందుకు వచ్చిన 'పుష్ప'రాజ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు తాజాగా గుడ్ న్యూస్ చెప్పారు 'పుష్ప' మేకర్స్. ఒకరోజు ముందుగానే 'పుష్ప 2' ప్రపంచవ్యాప్తంగా సందడి చేయబోతోంది. ఈ విషయాన్ని తాజాగా నిర్మాతలు ప్రెస్ మీట్ పెట్టి మరీ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

'పుష్ప 2'లో శ్రద్ధా స్పెషల్ సాంగ్...
ప్రస్తుతం ఇండియాలోనే మోస్ట్ అవైటింగ్ సినిమాల లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది 'పుష్ప 2'. ఈ మూవీ నుంచి ఇప్పటిదాకా కనీసం టీజర్, ట్రైలర్ లేదా పాటలు పెద్దగా రిలీజ్ కాకుండానే 'పుష్ప 2' మేనియా ఊపేస్తోంది. ఇక ప్రమోషన్స్ చేస్తే ఆ ఫీవర్ ఎలా ఉంటుందో చెప్పడం కష్టమే. ఈ నేపథ్యంలోనే సినిమా రిలీజ్ డేట్ దగ్గర నుంచి మొదలుకొని పలు రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో 'పుష్ప 2' సినిమాలో ఐటమ్ సాంగ్ గురించిన చర్చ కూడా ఉంది. ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ను అనుకుంటున్నారంటూ గత కొన్ని రోజులుగా రూమర్లు చక్కర్లు కొడుతుండగా... తాజాగా మరో కొత్త అప్డేట్ బయటకొచ్చింది. సదరు హీరోయిన్ ఆ పాట కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంది ? అనే వార్త వైరల్ అవుతుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

తెలుగు రాష్ట్రాల్లో ‘గేమ్ ఛేంజర్’ జోరు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను..  ప్రముఖ తెలుగు నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.  ‘RRR’ లాంటి సినిమా తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగినట్లుగానే ఇప్పటికే విడుదలైన ‘జరగండి జరగడిం..’, ‘రా మచ్చా..’ అనే పాటలు ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకున్నాయి. ఈ రెంటు పాటలు యూట్యూబ్ లో రికార్డు స్థాయి వ్యూస్ అందుకున్నాయి. ఈ సాంగ్స్ చూసిన తర్వాత సినిమాపై మరింత బజ్ క్రియేట్ అయ్యింది. అటు ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తున్నది. ఏపీ, తెలంగాణలో ఏకంగా రూ. 150 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆంధ్రా నుంచి రూ. 70 కోట్లు, సీడెడ్ నుంచి రూ.25 కోట్లు, నైజాం ఏరియా నుంచి రూ. 55 కోట్ల బిజినెస్ జరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

‘అమరన్’ ఓటీటీ రైట్స్ ఆ సంస్థకే
తమిళ యంగ్ హీరో శివ కార్తికేయన్ ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం ‘అమరన్’. యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీకి రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సాయి పల్లవి ఇంట్రో, టీజర్, ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. కార్తికేయన్ ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తుండగా, సాయి పల్లవి ఆయన సతీమణిగా నటిస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

బిడ్డ కోసం లగ్జరీ కారు కొనుగోలు చేసిన దీపికా దంపతులు
బాలీవుడ్ స్టార్ యాక్టర్లు గా కొనసాగుతున్న రణవీర్ సింగ్, దీపికా దంపతులు రీసెంట్ గా తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. కొద్ది రోజుల క్రితమే దీపికా పండంటి పాపకు జన్మనిచ్చింది. రీసెంట్ గా దీపికా హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చింది. ఓవైపు పేరెంట్స్ గా మారినందుకు ఫుల్ హ్యాపీగా ఉన్న రణవీర్ దంపతులు తాజా లగ్జరీ కారును కొనుగోలు చేశారు. దీని కోసం భారీ మొత్తంలో ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ కొత్త కారులు తన సెంటిమెంట్ నెంబర్ ప్లేట్ తెచ్చుకునేందుకు సైతం భారీగా ఛార్జ్ చెల్లించారట. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Benefit Shows Cancelled In Telangana: ఫుష్ప 2 ఎఫెక్ట్‌- తెలంగాణలో బెనిఫిట్‌ షోలు రద్దు
ఫుష్ప 2 ఎఫెక్ట్‌- తెలంగాణలో బెనిఫిట్‌ షోలు రద్దు
YSRCP: కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
Hyderabad Diesel Vehicle Ban News:హైదరాబాద్‌లో డీజిల్‌ వాహనాలు బంద్‌- సంచలన నిర్ణయం తీసుకోబోతున్న ప్రభుత్వం - ఆటో డ్రైవర్లకు ప్రత్యేక పథకం
హైదరాబాద్‌లో డీజిల్‌ వాహనాలు బంద్‌- సంచలన నిర్ణయం తీసుకోబోతున్న ప్రభుత్వం - ఆటో డ్రైవర్లకు ప్రత్యేక పథకం 
Pushpa 1 Day Collection: కలెక్షన్ల జాతర... మొదటి రోజే 'ఆర్ఆర్ఆర్' రికార్డుల పాతర - ఇండియాలోనే బిగ్గెస్ట్ ఓపెనర్ 'పుష్ప 2', ఎన్ని కోట్లో తెలుసా?
కలెక్షన్ల జాతర... మొదటి రోజే 'ఆర్ఆర్ఆర్' రికార్డుల పాతర - ఇండియాలోనే బిగ్గెస్ట్ ఓపెనర్ 'పుష్ప 2', ఎన్ని కోట్లో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట, మహిళ మృతినాగచైతన్య శోభితా వెడ్డింగ్ వీడియో వైరల్బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అరెస్ట్ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Benefit Shows Cancelled In Telangana: ఫుష్ప 2 ఎఫెక్ట్‌- తెలంగాణలో బెనిఫిట్‌ షోలు రద్దు
ఫుష్ప 2 ఎఫెక్ట్‌- తెలంగాణలో బెనిఫిట్‌ షోలు రద్దు
YSRCP: కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
Hyderabad Diesel Vehicle Ban News:హైదరాబాద్‌లో డీజిల్‌ వాహనాలు బంద్‌- సంచలన నిర్ణయం తీసుకోబోతున్న ప్రభుత్వం - ఆటో డ్రైవర్లకు ప్రత్యేక పథకం
హైదరాబాద్‌లో డీజిల్‌ వాహనాలు బంద్‌- సంచలన నిర్ణయం తీసుకోబోతున్న ప్రభుత్వం - ఆటో డ్రైవర్లకు ప్రత్యేక పథకం 
Pushpa 1 Day Collection: కలెక్షన్ల జాతర... మొదటి రోజే 'ఆర్ఆర్ఆర్' రికార్డుల పాతర - ఇండియాలోనే బిగ్గెస్ట్ ఓపెనర్ 'పుష్ప 2', ఎన్ని కోట్లో తెలుసా?
కలెక్షన్ల జాతర... మొదటి రోజే 'ఆర్ఆర్ఆర్' రికార్డుల పాతర - ఇండియాలోనే బిగ్గెస్ట్ ఓపెనర్ 'పుష్ప 2', ఎన్ని కోట్లో తెలుసా?
Mokshagna Debut Movie: మోక్షజ్ఞ మొదటి సినిమా ఓపెనింగ్ ఎందుకు ఆగిందో చెప్పిన బాలకృష్ణ
మోక్షజ్ఞ మొదటి సినిమా ఓపెనింగ్ ఎందుకు ఆగిందో చెప్పిన బాలకృష్ణ
Kaushik Reddy Arrest: పోలీసులను దూషించిన కేసులో కౌశిక్‌కు బెయిల్- ట్యాంక్‌బండ్‌ ధర్నాకు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల ముందస్తు అరెస్టులు
పోలీసులను దూషించిన కేసులో కౌశిక్‌కు బెయిల్- ట్యాంక్‌బండ్‌ ధర్నాకు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల ముందస్తు అరెస్టులు
Blood Pressure by Age : వయసు ప్రకారం బీపీ ఎంత ఉండాలో తెలుసా? మగ, ఆడవారిలో ఉండే వ్యత్యాసం ఇదే
వయసు ప్రకారం బీపీ ఎంత ఉండాలో తెలుసా? మగ, ఆడవారిలో ఉండే వ్యత్యాసం ఇదే
Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Embed widget