VD 12 Poster : గూఢచారిగా విజయ్ దేవరకొండ - ఆ నిజం ఏమిటి? పోస్టర్ చూశారా?
విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా, అయన కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న సినిమా పోస్టర్ ఒకటి విడుదల చేశారు. ఈ సినిమాలో హీరో స్పై అని రివీల్ చేశారు.
![VD 12 Poster : గూఢచారిగా విజయ్ దేవరకొండ - ఆ నిజం ఏమిటి? పోస్టర్ చూశారా? Vijay Deverakonda's special poster from VD12 movie in Gowtam Tinnanuri unveiled on his birthday, wows fans and netizens VD 12 Poster : గూఢచారిగా విజయ్ దేవరకొండ - ఆ నిజం ఏమిటి? పోస్టర్ చూశారా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/09/d76e67033061074ed6d08ade168e61301683637608103313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఇందులో హీరోది గూఢచారి రోల్. ఈ రోజు విజయ్ దేవరకొండ పుట్టినరోజు (Vijay Devarakonda Birthday) సందర్భంగా చిత్ర బృందం ఓ స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది.
గూఢచారిగా విజయ్ దేవరకొండ!
సినిమా ప్రీ లుక్ / స్పెషల్ పోస్టర్ (VD 12 movie poster) చూస్తే... పియానో తరహాలో ఉన్న ఓ పోస్టర్, కాగితపు ముక్కలపై విజయ్ దేవరకొండ రూపం! సినిమాలో ఆయన గూఢచారిగా కనిపించనున్నారని చిత్ర బృందం మరోసారి పేర్కొంది.
''నేను ఎవరిని మోసం చేశానో చెప్పడానికి... నేను ఎవరికి చెందిన వాడినో తెలియదు - ఓ అజ్ఞాత గూఢచారి'' అని పోస్టర్ మీద రాసి ఉంది. సినిమా అనౌన్స్ చేసినప్పుడు కూడా ఆ కోట్ పేర్కొన్నారు. ఈ రోజు స్పెషల్ పోస్టర్ విడుదల చేసిన సందర్భంగా ''ప్రతి గూఢచారి కథ ముగియడం వెనుక ఓ గూడుపుఠాణి ఉంటుంది. అయితే, వారి వెనుక ఉన్న నిజం ఎప్పటికీ బయటకు రాదు'' అని చిత్ర బృందం పేర్కొంది. ఈ వ్యాఖ్యలు సినిమాపై ఆసక్తి కలిగించాయి.
View this post on Instagram
గూఢచారిగా విజయ్ దేవరకొండ కథ ఏమిటి? ఆయన వెనుక ఉన్న నిజం ఏమిటి? వంటి విషయాలు తెలియాలంటే... సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాలి. గౌతమ్ తిన్ననూరి, విజయ్ దేవరకొండ కలయికలో తొలి చిత్రమిది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సితార సంస్థలో గౌతమ్ తిన్ననూరి 'జెర్సీ' తీశారు. అది విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాదు... జాతీయ పురస్కారాలు కూడా తెచ్చి పెట్టింది. ఉత్తమ తెలుగు చిత్రంగా 'జెర్సీ' జాతీయ అవార్డు అందుకుంది. అలాగే, ఆ చిత్రానికి పని చేసిన నవీన్ నూలి ఉత్తమ ఎడిటర్ అవార్డు అందుకున్నారు.
Also Read : 'బాహుబలి' క్లైమాక్స్ గుర్తు చేసిన 'ఆదిపురుష్' ట్రైలర్ - ఆ ఒక్క డైలాగ్ లేకపోతే?
విజయ్ దేవరకొండ జోడీగా శ్రీలీల
ఈ సినిమా (VD 12 Movie)లో విజయ్ దేవరకొండ సరసన శ్రీలీల కథానాయికగా నటించనున్నారు. విజయ్ దేవరకొండ, శ్రీ లీల కలయికలో కూడా తొలి చిత్రమిది. 'జెర్సీ'కి సంగీతం అందించిన రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ మరోసారి గౌతమ్ తిన్ననూరి, సితార సంస్థతో కలిసి పని చేస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి కూర్పు : నవీన్ నూలి, ఛాయాగ్రహణం : గిరీష్ గంగాధరన్, కళా దర్శకత్వం : అవినాష్ కొల్లా.
Also Read : సోనీ చేతికి పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్' ఆడియో, గ్లింప్స్ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే?
ఈ సినిమా (VD 12 Movie) రెగ్యులర్ షూటింగ్ జూన్ నెలలో ప్రారంభం కానుందని సినిమా ప్రారంభోత్సవంలో నిర్మాతలు తెలిపారు. ''పీరియడ్ డ్రామాగా తెరకెక్కిస్తున్న సినిమా ఇది. దీనికి ఎంతో మంది ట్యాలెంటెడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు వర్క్ చేస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం'' అని నిర్మాతలు చెప్పారు. ఇప్పుడు ఈ సినిమా కాకుండా శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి' సినిమా చేస్తున్నారు విజయ్ దేవరకొండ. అందులో సమంత కథానాయిక. ఆ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)