అన్వేషించండి

Samantha Vs Akkineni: సమంత వర్సెస్ అక్కినేని అఖిల్ - బాక్సాఫీస్ దగ్గర పోటీ తప్పదా?

ఆగస్టులో బాక్సాఫీస్ దగ్గర ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. అక్కినేని హీరో అఖిల్ సినిమా, సమంత సినిమా ఒకే రోజు విడుదల కానున్నాయి.

అక్కినేని హీరోతో సమంత పోటీనా? లేదంటే... అక్కినేని హీరో సినిమాతో పాటు తన సినిమాను విడుదల చేస్తుందా? 'యశోద' విడుదల తేదీతో ఒక్కసారిగా కొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఎందుకంటే... ఆ సినిమా విడుదల రోజున అక్కినేని అఖిల్ 'ఏజెంట్' కూడా విడుదల కానుంది.

'యశోద' ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడు? ఆగస్టు 12న! మంగళవారం విడుదల తేదీ ప్రకటించారు. విడుదలకు ఇంకా చాలా సమయం ఉంది. ఐదు నెలలు ఉంది కాబట్టి... అప్పటి పరిస్థితులను బట్టి విడుదల తేదీలు మారవచ్చు. అయితే... ఆల్రెడీ ఆగస్టు 12న తన సినిమాను విడుదల చేయనున్నట్టు అక్కినేని అఖిల్ ప్రకటించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న 'ఏజెంట్' సినిమాను ఆ రోజు విడుదల చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు.

'యశోద', 'ఏజెంట్'... ప్రస్తుతానికి రెండు సినిమాల విడుదల తేదీలు ఒక్కటే! కొంత మంది రెండు సమంత, అక్కినేని ఫ్యామిలీ హీరో మధ్య పోటీగా చూస్తుంటే... మరి కొంత మంది రెండు సినిమాలు ఒకే రోజు వస్తున్నాయని సానుకూల దృక్పథంతో చూస్తున్నారు. అక్కినేని నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఈ క్లాష్ రావడంతో ఈ ఊహాగానాలు వస్తున్నాయి. లేదంటే ఇంత చర్చ ఉండేది కాదేమో! 

నాగ చైతన్య 'శైలజా రెడ్డి అల్లుడు', సమంత 'యు టర్న్' ఒక రోజే విడుదల అయ్యాయి. 2018లో సెప్టెంబర్ 13న ఆ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అప్పుడు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. కానీ, ఇప్పుడు కాదు! సో... పోటీ అనే మాట వస్తోంది.  

Also Read: 'గని' కొడితే? మామూలుగా ఉండదు! యాక్షన్ సీక్వెన్సులు తక్కువేం లేవుగా!

ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే... సమంత 'యశోద' లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ థ్రిల్లర్. పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ చేస్తూ రిలీజ్ చేస్తున్న సినిమా. 'ఏజెంట్' సినిమాను కూడా పాన్ ఇండియా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Also Read: దివ్య భారతి మరణం, మ్యారేజ్ మిస్టరీయే! మూడేళ్ళలో 30 ఏళ్ళకు సరిపడా ఫేమ్!

 
 
 
 
 
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.
 
 
 
 
 
 
 
 
 
 
 

Η δημοσίευση κοινοποιήθηκε από το χρήστη Samantha (@samantharuthprabhuoffl)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Sandhya Theater Stampede: 'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
Embed widget