Ghani Action Sequences: 'గని' కొడితే? మామూలుగా ఉండదు! యాక్షన్ సీక్వెన్సులు తక్కువేం లేవుగా!
'గని' సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది. అయితే... ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సులు తక్కువేం లేవు. ఫైట్స్ కోరుకునే ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పక్కా!
బాక్సింగ్ నేపథ్యంలో 'గని' సినిమా తెరకెక్కింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ సినిమాలో బాక్సర్ రోల్ చేశారు. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ చూస్తే... ఫ్యామిలీ ఎమోషన్స్, మదర్ అండ్ ఫాదర్ సెంటిమెంట్ ఉన్నట్టు స్పష్టం అయ్యింది. సయీ మంజ్రేకర్‌తో లవ్ ట్రాక్ కూడా ఉంది. మరి, యాక్షన్ సంగతి ఏంటి? అంటే... ఫైట్స్ కోరుకునే ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పక్కా!
'గని'లో మొత్తం ఏడు యాక్షన్ సీక్వెన్సులు ఉన్నాయి. యాక్షన్ అంటే అంతా బాక్సింగ్ మాత్రమే ఉంటుందని అనుకోవద్దు. ఏడింటిలో బాక్సింగ్ సీక్వెన్సులు మూడు మాత్రమే. మిగతా నాలుగు కమర్షియల్ ఫైట్స్ అని సమాచారం. వరుణ్ తేజ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాగా 'గని' రూపొందింది. వరుణ్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ సినిమా కూడా ఇదే.
యాక్షన్ అండ్ ఎమోషన్స్‌కు 'గని'లో ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చారట. ఈ సినిమాకు 'యు/ఏ' సర్టిఫికెట్ లభించింది. ఇందులో తమన్నా స్పెషల్ సాంగ్ 'కొడితే' చేసిన సంగతి తెలిసిందే.
Also Read: 'యశోద' రిలీజ్ డేట్ ఫిక్స్ - పాన్ ఇండియా మార్కెట్ మీద కన్నేసిన సమంత
కిరణ్ కొర్రపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ... అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, అల్లు బాబీ కంపెనీ పతాకాలపై సిద్ధు ముద్ద, అల్లు బాబీ చిత్రాన్ని నిర్మించారు. తమన్ సంగీతం అందించారు. ఇందులో ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర తదితరులు నటించారు. ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Also Read: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలివే
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.