అన్వేషించండి

Naga Chaitanya - Sai Pallavi : చైతూతో మరోసారి - ఆ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్!

Sai Pallavi In Naga Chaitanya NC 23 Movie : నాగ చైతన్య కొత్త సినిమాలో కథానాయికను ఫైనలైజ్ చేశారు. ఆయనతో ఆల్రెడీ ఓ సినిమా చేసిన సాయి పల్లవి మరోసారి జోడీగా నటించనున్నారు.

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya), హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi)ది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. వీళ్ళిద్దరూ 'లవ్ స్టోరీ' సినిమాలో జంటగా నటించారు. మరోసారి వాళ్ళు జంటగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

గీతా ఆర్ట్స్ సంస్థలో చైతు, పల్లవి జోడీగా!
అక్కినేని నాగ చైతన్య కథానాయకుడిగా చందూ మొండేటి దర్శకత్వంలో జీఏ 2 పిక్చర్స్ సంస్థ ఓ సినిమా తెరకెక్కిస్తోంది. దీనిని చందూ మొండేటి దర్శకుడు. వాస్తవ ఘటనల ఆధారంగా మత్యకారుల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. 

హీరోగా నాగ చైతన్య 23వ చిత్రమిది. ఈ సినిమా రీసెర్చ్ కోసం శ్రీకాకుళంతో పాటు కొన్ని ప్రాంతాలకు దర్శకుడు చందూ మొండేటితో పాటు స్వయంగా ఆయన కొన్ని ప్రాంతాలకు వెళ్లారు. త్వరలో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఇందులో కథానాయికను ఫైనలైజ్ చేశారు. 

Naga Chaitanya 23 Movieలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి కథానాయికగా నటించనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇక్కడ గమనించదగ్గ అంశం ఏమిటంటే... చందూ మొండేటి దర్శకత్వంలో ఆమెకు తొలి చిత్రమిది. గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థలో కూడా! అయితే, మలయాళంలో ఆమె నటించిన 'ప్రేమమ్' తెలుగు రీమేక్ చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందింది. అందులో నాగ చైతన్య హీరో. ఈ రోజు హీరోయిన్ ఫేస్ రివీల్ చేయకుండా ఓ వీడియో విడుదల చేశారు. అందులో ఉన్నది సాయి పల్లవి. 

Also Read - 'అతిథి' రివ్యూ : హీరో వేణు తొట్టెంపూడి నటించిన హారర్ థ్రిల్లర్ సిరీస్

చైతూతో అందరిదీ హిట్ రికార్డ్!
అక్కినేని నాగ చైతన్య హీరోగా గీతా ఆర్ట్స్ సంస్థ '100 పర్సెంట్ లవ్' నిర్మించింది. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఇటు దర్శకుడు కూడా చైతూతో హిట్ సినిమా తీశారు. 'కార్తికేయ'తో దర్శకుడిగా పరిచయమైన చందూ మొండేటికి ఆ వెంటనే అక్కినేని హీరో నాగ చైతన్యతో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. మలయాళ క్లాసిక్ 'ప్రేమమ్'ను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నారు. 'కార్తికేయ 2' తర్వాత ఆయన చేస్తున్న సినిమా కావడంతో జాతీయ స్థాయిలో ఈ సినిమాపై చూపు పడింది. 

తెలుగు 'ప్రేమమ్' తర్వాత చందూ మొండేటి, 'లవ్ స్టోరీ' తర్వాత సాయి పల్లవి, '100 పర్సెంట్ లవ్' తర్వాత గీతా ఆర్ట్స్ సంస్థలో నాగ చైతన్య చేస్తున్న చిత్రమిది. 

Also Read : అక్కడ యోగిబాబు, ఇక్కడ సంపూర్ణేష్ బాబు - తెలుగులోకి తమిళ 'మండేలా'

గీతా ఆర్ట్స్ సంస్థలో చందూ మూడు సినిమాలు!
నాగ చైతన్య సినిమా మాత్రమే కాదు... ఆ తర్వాత గీతా ఆర్ట్స్ సంస్థలో చందూ మొండేటి రెండు సినిమాలు చేయనున్నారు. ఆయనతో మూడు సినిమాలు చేయడానికి అల్లు అరవింద్ రెడీ అవుతున్నారు. ఆ మధ్య ఆయన ఓ సినిమా వేడుకలో చందూతో వరుస సినిమాలు చేస్తున్నట్లు తెలిపారు. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
Pakistan: అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Embed widget