Pushpa 2 Leaked: 'పుష్ప 2'కు పైరసీ రాయుళ్ల నుంచి షాక్... విడుదల రోజు ఉదయమే అన్‌లైన్‌లో HD ప్రింట్ లీక్
Pushpa 2 The Rule Movie Online Download: 'పుష్ప 2' మూవీ ఈ రోజే థియేటర్లలోకి వచ్చింది. సినిమాకు సంబంధించిన రివ్యూలు కూడా పూర్తిగా రాకముందే మూవీ ఆన్లైన్ లో లీక్ కావడం షాకింగ్ గా మారింది.
మోస్ట్ హైప్డ్ మూవీ 'పుష్ప 2'కు ఊహించని షాక్ తగిలింది. అల్లు అర్జున్ (Allu Arjun)తో పాటు 'పుష్ప 2' చిత్ర బృందం మూడు సంవత్సరాల కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేస్తున్నారు లీకు రాయుళ్ళు. సినిమా రిలీజ్ అయ్యి, మొదటి షో కూడా పూర్తి కాకముందే హెడ్‌డి ప్రింట్ ప్రస్తుతం పలు పైరసీ వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉండడం షాకింగ్ గా మారింది.
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా నిలిచిన మూవీ 'పుష్ప '. ఈ సినిమా గురువారం థియేటర్లలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే అలా థియేటర్లోకి వచ్చిందో లేదో, ఇలా పైరసీ సైట్లలో సినిమా లీక్ అయ్యింది. పైగా పెద్దగా క్లారిటీ లేని ప్రింట్ కాకుండా, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ సినిమా హెచ్డి ప్రింట్ అందుబాటులో ఉండడం గమనార్హం. ఒక్క వెబ్ సైట్ లో కాదు ఏకంగా పదుల సంఖ్యలో వెబ్ సైట్లలో ఈ సినిమా హెచ్డి ప్రింట్ అందుబాటులో ఉంది.
Also Read: పుష్ప 2 రివ్యూ: సుక్కు మార్క్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ మాస్ తాండవం... మరి సినిమా హిట్టా? ఫట్టా?
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప 2" రూల్ బాక్స్ ఆఫీసు దగ్గర నిన్నటి నుంచే మొదలైంది. అల్లు అర్జున్ మూడు సంవత్సరాల తర్వాత పుష్ప రాజ్ అవతార్లో తిరిగి రావడం ప్రేక్షకుల్లో మరింత జోష్ పెంచింది. ఈ సినిమాలో అల్లు అర్జున్, ఫహద్ ఫాజిల్, రష్మిక మందన ప్రధాన పాత్రలు పోషించగా... డిసెంబర్ 5న 'పుష్ప 2' థియేటర్లలోకి వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్లపై ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాను వీక్షించిన ప్రేక్షకులు సినిమా బ్లాక్ బస్టర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా మరోసారి ఈ సినిమాలో నటనకుగానూ అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు దక్కడం ఖాయం అంటున్నారు. మరోవైపు రివ్యూలు కూడా పాజిటివ్ గా ఉండడం విశేషం. కానీ తాజాగా ఈ సినిమా ఆన్లైన్ లో లీక్ అవ్వడం మాత్రం నిరాశ పరుస్తోంది. మరి లీక్ విషయంలో బృందం అలర్ట్ అవుతుందా? లీకు రాయుళ్లపై చర్యలు తీసుకుంటుందా ? అనేది చూడాలి.
Also Read: చైతూ తాళి కట్టిన శుభవేళ... మురిసిపోయిన శోభిత - పెళ్లి వీడియో వైరల్