అన్వేషించండి

Naga Chaitanya Sobhita Wedding: చైతూ తాళి కట్టిన శుభవేళ... మురిసిపోయిన శోభిత - పెళ్లి వీడియో వైరల్

Naga Chaitanya Sobhita Wedding First Video: డిసెంబర్ 4న నాగ చైతన్య - శోభిత పెళ్లి గ్రాండ్ గా జరిగింది. పెళ్లికి సంబంధించి బయటకు వచ్చిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

అక్కినేని నాగ చైతన్య - శోభిత ధూళిపాల బుధవారం రాత్రి వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో బుధవారం రాత్రి 8 గంటల 13 నిమిషాలకి నాగ చైతన్య - శోభిత ధూళిపాల మెడలో మూడు ముళ్ళు వేయగా, ఇద్దరూ కలిసి ఏడు అడుగులు నడిచారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఘనంగా జరిగిన ఈ జంట పెళ్లికి సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు హాజరై, ఆశీర్వదించారు. అయితే ఈ నూతన వధూవరుల పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో నూతన వధూవరులు నాగ చైతన్య - శోభిత ధూళిపాల ఇద్దరూ సంతోషంగా కనిపిస్తున్నారు. వీడియోలో కొత్త జంట చుట్టూ పలువురు సెలబ్రిటీలతో పాటు వారి కుటుంబ సభ్యులు ఉండగా, ఆనందోత్సాహాల మధ్య నాగచైతన్య - శోభితకు తాళి కట్టడం కనిపిస్తోంది. ఈ సందర్భంగా మరోవైపున ఉన్న అక్కినేని అఖిల్ విజిల్స్ వేస్తూ మరింత ఉత్సాహంగా కనబడుతున్నారు. ఇప్పటిదాకా కేవలం శోభిత ధూళిపాల - నాగచైతన్య పెళ్లికి సంబంధించిన ఫోటోలు మాత్రమే బయటకు వచ్చాయి. నాగార్జున తన కొడుకు, కోడలికి సంబంధించిన పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ... వైవాహిక బంధంలోకి అడుగు పెట్టిన నూతన వధూవరులు చై-శోభితకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు అభిమానుల నుంచి కొత్త జంటకు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. అయితే తాజాగా వీరి పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పెళ్లి వీడియో వైరల్ అవుతుంది.

Also Read: పుష్ప 2 రివ్యూ: సుక్కు మార్క్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ మాస్ తాండవం... మరి సినిమా హిట్టా? ఫట్టా?

 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Eshwar Harris (@eshwar_harris)

ఇదిలా ఉండగా నాగ చైతన్య - శోభిత పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, డైరెక్టర్ చందూ మొండేటి, అడవి శేష్, సుహాసిని, అల్లు అరవింద్ దంపతులు, కీరవాణి, చాముండేశ్వరి నాథ్, డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ, మాజీ ఎంపీ సుబ్బరామిరెడ్డి తదితరులు హాజరయ్యారు. బుధవారం అర్ధరాత్రి వరకు జరిగిన ఈ వివాహ వేడుకలో పాల్గొన్న సెలబ్రిటీలు నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక ఈ వివాహ వేడుకల్లో అక్కినేని, ధూళిపాళ్ల ఫ్యామిలీతో పాటు దగ్గుబాటి కుటుంబ సభ్యులు కూడా సందడి చేశారు. నాగ చైతన్య - శోభిత పెళ్లికి సంబంధించి ప్రత్యేకంగా అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వేయించిన సంగతి తెలిసిందే. దివంగత అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఎదుట ఏర్పాటు చేసిన ఈ సెట్ లోనే నాగ చైతన్య - శోభిత ఇద్దరూ మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టారు.

Also Read: శోభిత, నాగ చైతన్య పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నాగ్... 'మా జీవితాల్లోకి సంతోషాన్ని తెచ్చావంటూ' కోడలికి ఎమోషనల్ నోట్ రాసిన మామ

ఇదిలా ఉండగా... సమంతతో విడాకులు తీసుకున్న అనంతరం నాగ చైతన్య చాలా రోజులు సింగిల్ గానే ఉన్నారు. ఆ తర్వాత ఊహించని విధంగా ఒకరోజు లండన్ లో చైతు దిగిన ఫోటో, అందులో శోభిత కనిపించడంతో వీళ్ళ రిలేషన్ పై అనుమానాలు మొదలయ్యాయి. ఈ విషయంపై ఎన్నో రూమర్లు వచ్చినప్పటికీ ఇద్దరూ స్పందించలేదు. కానీ సడన్ గా ఆగస్టు 8న నాగ చైతన్య - శోభిత ధూళిపాల ఎంగేజ్మెంట్ చేసుకుని షాక్ ఇచ్చారు. కింగ్ నాగార్జున స్వయంగా చై- శోభితకు ఎంగేజ్మెంట్ జరిగింది అంటూ ఫోటోలను షేర్ చేశారు.  ఇక ఆ తర్వాత అక్టోబర్ 21న విశాఖలో పెళ్లి పనులు మొదలయ్యాయి. అక్టోబర్ 21న గోధుమ రాయి కట్టి పసుపు దంచుతూ ఆ ఫోటోలను షేర్ చేసింది శోభిత. నవంబర్ 29న కాబోయే వధూవరులు ఇద్దరికీ మంగళ స్నానాలు చేయించారు. అనంతరం పెళ్లికొడుకు,పెళ్ళికూతురును చేసి అచ్చ తెలుగు సంప్రదాయం ప్రకారం పెళ్లి పనులు చేస్తూ వచ్చారు. మొత్తానికి డిసెంబర్ 4న ఈ జంట పెళ్లి జరిగింది.

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget