
Sitara Ghattamaneni: సితార బర్త్‌డే - మహేష్, నమ్రత స్పెషల్ విషెస్, వీడియో వైరల్
Sitara Birthday: మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని బర్త్‌డే నేడు. ఈ సందర్భంగా కూతురికి మహేష్ బాబు, నమ్రతలు స్పెషల్ బర్త్‌డే విసెష్ తెలిపారు. ఈ సందర్భంగా నమ్రత స్పెషల్ వీడియో షేర్ చేశారు.

Mahesh Babu Special Birthday Wishes to Daughter Sitara: సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల తనయ సితార ఘట్టమనేని బర్త్‌డే నేడు. జూలై 20 సితార పుట్టినరోజు. ఇవాళ సితార 12వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తనకు సూపర్ స్టార్ ఫ్యాన్స్, ఫాలోవర్స్ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. కూతురు బర్త్‌డే సందర్భంగా మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ స్పెషల్ పోస్ట్స్ షేర్ చేశారు. ఈ మేరకు మహేష్ సితార క్యూట్ ఫోటో షేర్ చేశాడు. "హ్యాపీ 12 మై లిటిల్ వన్ సితార. ఈ స్పెషల్ డే నీకు ఎప్పటికే గుర్తుండిపోవాలి. నువ్వు కోరుకున్నది నీకు దక్కాలని ఆశిస్తున్నా. లవ్ యూ మోర్ అండ్ మోర్. హ్యాపీ బర్త్ డ్ మై సన్ షైన్" అని మహేష్ పోస్ట్ చేశాడు.
View this post on Instagram
ఇక నమ్రత సితార చిన్ననాటి ఫోటోలను ఒక వీడియోగా ఎడిట్ చేసింది. అది షేర్ చేస్తూ సితార గురించి డీప్ నోట్ పెట్టింది. "హ్యాపీ బర్త్‌డే మై లిటిల్ మై ఫేవరేట్ లిటిల్ ట్రవెల్ కంపెనీయన్. ఎన్నో దేశాలు, లెక్కలేనన్ని జ్ఞాపకాలు.. ఎప్పుడూ నువ్వు నాకు చిన్న గైడ్‌గా ఉంటావు. నీ కంపెనీ నా ప్రతి ప్రయాణాన్ని ప్రత్యేకంగా చేస్తుంది. చిన్నప్పటి నుంచి నువ్వు ఎదుగుదలను నేను చూస్తున్నాను. ఐ లవ్ యూ మై స్వీట్ హార్ట్. హ్యాపీ 12 మై లిటిల్ వన్" అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం మహేష్, నమ్రతల బర్త్‌డే పోస్ట్స్ నెట్టింట వైరల్‌గ మారుతున్నాయి. వీటికి సినీ సెలబ్రిటీలు, నెటిజన్లు స్పందిస్తూ సితారకు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు.
View this post on Instagram
కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురిగా సితారకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సోషల్ మీడియాలో ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ నెట్టింట ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. అతి చిన్న వయసులో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్‌గా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది. ఇక సితార గొప్ప మనసు గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన తల్లిదండ్రులతో కలిసి సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది. తన నటించిన జువెల్లరి యాడ్ తొలి రెమ్యునరేషన్‌ను సితార ట్రస్ట్‌కి విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు తన లాస్ట బర్త్‌డేకి పేద విద్యార్థినులకు సైకిల్ పంచింది. ఇలా చిన్న వయసులో సామాజిక సేవలు చేపడుతూ తండ్రిలాగే గొప్ప మనసు చాటుకుంటుంది.
Also Read: అల్లు-మెగా ఫ్యామిలీ మధ్య గొడవ - క్లారిటీ ఇచ్చిన బన్నీ వాసు, ఇవన్ని పాసింగ్ క్లౌడ్స్..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
