By: ABP Desam | Updated at : 25 Mar 2023 03:58 PM (IST)
బోయపాటి శ్రీను, బాలకృష్ణ
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) ది సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్. బాలకృష్ణ హీరోగా బోయపాటి మూడు సినిమాలు చేశారు. 'సింహ', 'లెజెండ్', 'అఖండ'... ఆ మూడు సినిమాలు భారీ విజయాలు సాధించాయి. బాలయ్య, బోయ హ్యాట్రిక్ కొట్టారు.
ఇప్పుడు బాలకృష్ణ, బోయపాటి శ్రీను డబుల్ హ్యాట్రిక్ (Balakrishna Boyapati Double Hat Trick)కు రెడీ అవుతున్నారని సమాచారం. వీళ్ళిద్దరూ రాజకీయ నేపథ్యంలో ఓ సినిమా చేయనున్నారా? అదీ ఏపీ ఎన్నికలకు ముందు? అంటే... 'అవును' అని ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి వినబడుతోంది. ఆల్రెడీ కథ, స్క్రీన్ ప్లే లాక్ చేశారని... సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం కూడా ఖరారు చేశారని సమాచారం.
బాలకృష్ణ పుట్టినరోజు...
జూలై 10న ఓపెనింగ్!?
ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్నారు. అది సెట్స్ మీద ఉంది. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఆగస్టుకు ఆ సినిమా పనులు అన్నీ పూర్తి అవుతాయని సమాచారం. మరోవైపు రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను పాన్ ఇండియా సినిమా తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమా పనులు సైతం ఆగస్టుకు కంప్లీట్ అవుతాయట. అందుకని, ఆ రెండు సినిమాలు పూర్తి కావడానికి కొన్ని రోజుల ముందు సినిమా ఓపెనింగ్ చేయాలని బాలకృష్ణ భావించారట.
బాలకృష్ణ పుట్టినరోజు (Balakrishna Birthday) సందర్భంగా జూన్ 10న లాంఛనంగా పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించి, ఆగస్టు తర్వాత రెగ్యులర్ షూటింగుకు వెళతారట. షూట్ వీలైనంత త్వరగా పూర్తి చేసి 2024 మొదటి రెండు మూడు నెలల్లో సినిమాను విడుదల చేయాలనేది ప్లాన్. రాజకీయ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం.
Also Read : చావడానికి అయినా సిద్ధమే - విష్ణుతో గొడవపై ఓపెన్ అయిన మనోజ్
బాలకృష్ణ, బోయపాటి చేసిన సినిమాల్లో సినిమాల్లో పొలిటికల్ పంచ్ డైలాగులు సమాజంలో సమస్యలను సూటిగా ఎత్తి చూపాయి. ఇటీవల 'వీర సింహా రెడ్డి'లో కొన్ని డైలాగులు ఏపీలోని అధికార ప్రభుత్వంపై పంచ్ డైలాగ్స్ వేసినట్టు ఉన్నాయని మెజారిటీ జనాల్లో అభిప్రాయం వ్యక్తం అయ్యింది. ఇప్పుడు చేయబోయే సినిమా ఎలా ఉంటుందదో మరి? అదీ ఎన్నికలకు ముందు వచ్చే సినిమా కాబట్టి ప్రజలు ఆసక్తిగా గమనిస్తారు.
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో రూపొందనున్న తాజా సినిమాను 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంటా నిర్మించనున్నారు. బడ్జెట్ విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదని నిర్మాతలు డిసైడ్ అయ్యారట. 'సింహా'లో కావచ్చు, 'లెజెండ్'లో కావచ్చు, హిందూ ధర్మం యొక్క ప్రాముఖ్యాన్ని వివరిస్తూ వచ్చిన 'అఖండ'లో కావచ్చు... రాజకీయాల ప్రస్తావన ఉంది. అయితే, వాటిలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి. సెంటిమెంట్ ఉంది. కమర్షియల్ హంగులు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు చేయబోయే పొలిటికల్ డ్రామాలో కూడా కమర్షియల్ హంగులు ఉంటాయని, రాజకీయం ప్రధానాంశంగా ఉంటుందని టాక్. ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నేపథ్యంలో ఏదో ఒక పార్టీకి అనుకూలంగా మరికొన్ని సినిమాలు వచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేం.
Also Read : నువ్వు మారవా విష్ణు? - మంచు బ్రదర్స్ గొడవలో శాక్రిఫైజింగ్ స్టార్ సెన్సేషనల్ కామెంట్స్
Tom Holland on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!
Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్
శర్వానంద్ పెళ్లి, ప్రశాంత్ నీల్ బర్త్‌డే అప్‌డేట్స్, ఓజీ షూటింగ్ వివరాలు - నేటి సినీ విశేషాలివే!
Bhola Mania Song : వన్ అండ్ ఓన్లీ బిందాస్ భోళా, మెగాస్టార్ వస్తే స్విచ్ఛాన్ గోల - ఫస్ట్ సాంగ్ విన్నారా?
Agent Settlement - Surender Reddy : 'లైగర్' రూటులో 'ఏజెంట్' డిస్ట్రిబ్యూటర్ - సురేందర్ రెడ్డి దిమ్మ తిరిగే రిప్లై!
Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!
KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు
Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్
థాయ్‌ల్యాండ్‌లో భర్తతో ఎంజాయ్ చేస్తున్న అనసూయ - ఫిదా అవుతున్న ఫ్యాన్స్!