అన్వేషించండి

Sunisith On Vishnu Manchu : నువ్వు మారవా విష్ణు? - మంచు బ్రదర్స్ గొడవలో శాక్రిఫైజింగ్ స్టార్ సెన్సేషనల్ కామెంట్స్

Vishnu Vs Manoj Issue : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు బ్రదర్స్ విష్ణు, మనోజ్ మధ్య గొడవ ఇప్పుడు హాట్ హిట్ టాపిక్. ఇప్పుడీ గొడవ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసిన సునిశిత్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. 

శాక్రిఫైజింగ్ స్టార్ సునిశిత్ (Sunisith) గుర్తు ఉన్నాడా? ఒక సమయంలో యూట్యూబ్ అంతా అతని వీడియో ఇంటర్వ్యూలే కనిపించేవి. లావణ్యా త్రిపాఠికి, తనకు పెళ్లి అయ్యిందని... శృతి హాసన్ తనతో కొన్నాళ్ళు డేటింగ్ చేసిందని... 'పుష్ప'లో హీరోగా సుకుమార్ ముందు తనను సెలెక్ట్ చేస్తే అల్లు అర్జున్ ఆ అవకాశాన్ని తనకు దక్కకుండా లాక్కున్నాడని... ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ తనను తొక్కేస్తున్నారని, చిరంజీవితో మందు కొడతానని... ఒక్కటి కాదు, నోటికి ఇష్టం వచ్చినది వచ్చినట్లు వాగడం సునిశిత్ స్టైల్.

సునిశిత్ మతిస్థిమితం సరిగా లేదని పరిశ్రమ ప్రముఖులతో పాటు ప్రేక్షకులు కూడా భావించారు. చాలా మంది స్టార్స్ అతడిని లైట్ తీసుకున్నారు. ఒకరు ఇద్దరు అయితే కేసులు పెట్టారనుకోండి. అది వేరే విషయం! ఇప్పుడు ఈ సునిశిత్ ప్రస్తావన ఎందుకు అంటే... మంచు బ్రదర్స్ మధ్య జరిగిన గొడవలో అతడు వేలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. 

విష్ణు... నువ్వు మారవా?
మంచు మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి డిలీట్ చేసిన వీడియోను సునిశిత్ తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేశాడు. ''ఏరా విష్ణు (Vishnu Manchu)గా... ఇంక నువ్వు మారవా?అరడజను మంది పిల్లలకు తండ్రివి రా నువ్వు! అప్పుడు నా సినిమాలు లాక్కున్నావ్. ఇప్పుడు మనోజ్ (Manchu Manoj) ని కొట్టడానికి వెళ్తున్నావు. నెక్స్ట్ మా ప్రెసిడెంట్ (Movie Artist Association President)గా నిన్ను కచ్చితంగా ఓడిస్తా'' అని సునిశిత్ పేర్కొన్నాడు. పబ్లిసిటీ కోసమే ఈ విధంగా అతడు కామెంట్ చేశాడని అనుకోవచ్చు. 

అది చిన్న గొడవే : విష్ణు మంచు
మంచు మనోజ్ పోస్ట్ చేసి, డిలీట్ చేసిన వీడియోపై విష్ణు మంచు స్పందించారు. అది చిన్న గొడవ అని, తమ మధ్య ఇలాంటి చిన్న చిన్న గొడవలు సర్వ సాధారణమే అని, సారథితో వాగ్వాదాన్ని ఆపకుండా దాన్ని మనోజ్ వీడియో తీశాడని ఆయన పేర్కొన్నారు. అయినా మనోజ్ చిన్న వాడని, ఇది స్పందించాల్సినంత పెద్ద విషయం కాదని చెప్పారు. ఏదో ఆవేశంలో మనోజ్ అది వీడియో తీసి పోస్ట్ చేశాడని, దీన్ని భూతద్దంలో చూడొద్దని కోరారు విష్ణు. మరి మంచు విష్ణు వివరణతో ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందా లేదా అనేది చూడాలి.

Also Read : మీనా రెండో పెళ్లి - వయసులో చిన్నోడు, విడాకులు తీసుకున్న హీరోతో?

సారథి ఎవరు?
విష్ణు, మనోజ్ మధ్య గొడవకు కారణమైన సారథి ఎవరు? అని ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది. తొలుత విష్ణు దగ్గర కొన్ని రోజులు పని చేసిన సారథి.. ఇప్పుడు మనోజ్ దగ్గర పని చేస్తున్నారని, ఆ విషయంలో అన్నదమ్ముల మధ్య చిన్నపాటి గొడవ జరిగిందని టాక్. సారథి ఇంటికి విష్ణు వెళ్లిన సమయంలో మనోజ్ వీడియో తీశారు. కుమారులు ఇద్దరితో మోహన్ బాబు మాట్లాడి గొడవ సద్దుమణిగేలా చేసినట్లు సమాచారం. ఈ గొడవకు ఇంకా ఫుల్ స్టాప్ పడలేదని మరో వాదన కూడా వినబడుతోంది. వీడియో డిలీట్ చేసిన తర్వాత తన స్పందన ఏంటనేది మనోజ్ ఇంకా తెలపలేదు. అన్నయ్య మీద ఆయన కోపంగా ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.

Also Read షూటింగ్ మొదలైన రోజే షాక్ - ఎన్టీఆర్ 30లో బ్లడ్ ట్యాంక్స్, ఫ్యాన్స్‌కి స్వీట్ వార్నింగ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

HYDRA: 'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Aus vs India First Test Day 1 Highlights | భారత పేసర్ల ధాటికి కుయ్యో మొర్రోమన్న కంగారూలు | ABP DesamAus vs Ind First Test First Innings | పెర్త్ లో పేకమేడను తలపించిన టీమిండియా | ABP Desamపేలిన ఎలక్ట్రిక్ స్కూటీ, టాప్ కంపెనీనే.. అయినా బ్లాస్ట్!ప్రసంగం మధ్యలోనే  ఏడ్చేసిన కాకినాడ కలెక్టర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HYDRA: 'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
AR Rahman Award: విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
Embed widget