Meena Second Marriage : మీనా రెండో పెళ్లి - వయసులో చిన్నోడు, విడాకులు తీసుకున్న హీరోతో?
మీనా రెండో పెళ్లి చేసుకోబోతున్నారని కోలీవుడ్ కోడై కూస్తోంది. అటువంటిది ఏమీ లేదని ఆమె ప్రకటించారు. అయితే, పెళ్లి పుకార్లు ఆగలేదు. ఇప్పుడు మీనా రెండో పెళ్లి గురించి ఓ క్రేజీ రూమర్ చక్కర్లు కొడుతోంది.
సీనియర్ హీరోయిన్, నటి మీనా (Meena Sagar) మళ్ళీ పెళ్లి చేసుకోనున్నారా? గత ఏడాది భర్తను కోల్పోయిన ఆవిడ, తోడు కోరుకుంటున్నారా? అంటే... 'అవును' అని తమిళ చలన చిత్ర పరిశ్రమ వర్గాల నుంచి వినిపించే మాట. రెండో పెళ్లికి మీనా సాగర్ రెడీగా ఉన్నారని చెబుతోంది. కొన్ని రోజులుగా ఈ పెళ్లి పుకారు షికారు చేస్తోంది.
ఇటువంటివి ఆపేయండి! - మీనా
రెండో పెళ్లి గురించి మీడియాలో వస్తున్న వార్తలు మీనా దృష్టికి వెళ్లాయి. తన లైఫ్ గురించి, జీవితంలో జరగబోయే అంశాలు గురించి కథలు, కథనాలు ప్రసారం చేయడం ఆపేయమని ఆమె రిక్వెస్ట్ చేశారు. పెళ్లి పుకార్లు చూసి నవ్వేశారు. అటువంటిది ఏమీ లేదని స్పష్టం చేశారు. అయినా సరే మీనా సాగర్ రెండో పెళ్లి చేసుకుంటున్నారని తమిళ మీడియా చెబుతోంది. పెళ్లి కథనాలు ఇంకా ఆగలేదు.
వయసులో చిన్నోడితో...
విడాకులు తీసుకున్నోడితో!
తన కంటే వయసులో చిన్నోడితో, విడాకులు తీసుకున్న వ్యక్తితో మీనా రెండో పెళ్ళికి రెడీ అయ్యారని ఓ తమిళ యూట్యూబ్ మీడియా చెబుతోంది. ఆల్రెడీ నిశ్చితార్థం జరిగిందని కూడా అంటోంది. ఇటీవల తన భార్యకు విడాకులు ఇచ్చిన యువ తమిళ కథానాయకుడు, మీనా పెళ్లి చేసుకోనున్నారని ఆ కథనం సారాంశం. ప్రస్తుతం చెన్నై సినిమా సర్కిళ్లలో క్రేజీ రూమర్ ఇది. నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది కదూ! ఈ రూమర్ చూసి సినిమా జనాలు నవ్వుకుంటున్నారు. అదీ సంగతి!
సినిమాలపై దృష్టి పెట్టిన మీనా!
గత ఏడాది జూలై 28న మీనా భర్త సాగర్ మరణించారు. ఆయన మృతి తర్వాత కొన్నాళ్ళు ఆమె ఇంటికి పరిమితం అయ్యారు. ఇండస్ట్రీలో ఆమెకు సన్నిహితులైన రంభ, సంఘవి, సంగీత తదితరులను కలిశారు. నిదానంగా మీనా కోలుకున్నారు.
ఇప్పుడు సినిమాలపై మీనా దృష్టి పెట్టారు. ఆ మధ్య రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) తో కలిసి ఉన్న ఒక ఫోటోను ఆ మధ్య పోస్ట్ చేశారు. ''సుమారు 32 ఏళ్ళ తర్వాత నా మొదటి హీరోతో కలిసి నటిస్తున్నా'' అని ఆమె పేర్కొన్నారు. 'బిగ్ బాస్' ఫేమ్ సొహైల్ హీరోగా నటిస్తున్న 'ఆర్గానిక్ మామ - హైబ్రిడ్ అల్లుడు'లో రాజేంద్ర ప్రసాద్, మీనా జంటగా కనిపించారు. ఈ సినిమా కొన్ని రోజుల క్రితం విడుదల అయ్యింది. ఇప్పుడు మీనా చేతిలో కొన్ని సినిమాలు ఉన్నాయి. ఇంట్లో పెద్దలు మళ్ళీ పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నా సరే... సున్నితంగా వాళ్ళ ప్రతిపాదనను మీనా పక్కన పెడుతున్నారని సమాచారం.
Also Read : షూటింగ్ మొదలైన రోజే షాక్ - ఎన్టీఆర్ 30లో బ్లడ్ ట్యాంక్స్, ఫ్యాన్స్కి స్వీట్ వార్నింగ్
వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే (World Organ Donation Day) సందర్భంగా ఆర్గాన్స్ డొనేట్ చేస్తున్నట్లు ప్రకటించిన మీనా ''ప్రాణాలను కాపాడటం కంటే గొప్ప పని ఏదీ లేదు. ప్రాణాలు కాపాడటానికి అవయవ దానం మంచి మార్గం. దీర్ఘకాలిక అనారోగ్యాలతో పోరాటం చేస్తున్న అనేక మంది జీవితానికి రెండో అవకాశం ఇస్తుందీ అవయవ దానం. నా సాగర్ (మీనా భర్త విద్యాసాగర్) ఎక్కువ మంది డోనర్స్ ఉండుంటే నా జీవితం మరోలా ఉండేది'' అని పేర్కొన్నారు.
Also Read : 'జాన్ విక్ 4' రివ్యూ : కీనూ రీవ్స్ హాలీవుడ్ సినిమా ఎలా ఉందంటే?