NTR 30 Shooting Pics Leaked : షూటింగ్ మొదలైన రోజే షాక్ - ఎన్టీఆర్ 30లో బ్లడ్ ట్యాంక్స్, ఫ్యాన్స్‌కి స్వీట్ వార్నింగ్
ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా షూటింగ్ మొదలైన రోజే షాక్ తగిలింది. లొకేషన్ పిక్స్ లీక్ అయ్యాయి. సోషల్ మీడియాలో వాటిని షేర్ చేస్తున్న ఫ్యాన్స్‌కి స్వీట్ వార్నింగ్ కూడా వచ్చేసింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) కొత్త సినిమాకు గురువారం పూజ చేశారు. ఆలస్యం చేయకుండా సెట్స్ మీదకు తీసుకు వెళ్ళారు. అవును... సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అవ్వడమే కాదు... లొకేషన్ పిక్స్ లీక్ కూడా అయ్యాయి. ప్రజెంట్ ఎన్టీఆర్ 30 సెట్స్ పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎన్టీఆర్ 30లో బ్లడ్ ట్యాంక్స్!
ఎన్టీఆర్ 30 ప్రారంభోత్సవంలో సినిమాలో తారక్ క్యారెక్టర్, స్టోరీ కాన్సెప్ట్ గురించి చిత్ర దర్శకుడు కొరటాల శివ వివరించారు. మృగాలను వేటాడే మగాడిగా ఎన్టీఆర్ రోల్ శక్తివంతంగా ఉంటుందని చెప్పారు. ''అనగనగా సముద్ర తీర ప్రాంతం! మనం మర్చిపోయిన భూభాగం! ఆ ప్రాంతంలో మనుషుల కంటే ఎక్కువ మృగాలు ఉంటాయి (మృగాలు లాంటి మనుషులు అన్నమాట). భయం అంటే ఏమిటో తెలియని మృగాలు అవి. దేవుడు అంటే భయం లేదు. చావు అన్నా భయం లేదు. కానీ, ఒక్కటి అంటే భయం. ఆ భయం (ఎన్టీఆర్ పాత్రను ఉద్దేశిస్తూ...) ఏమిటో మీకు తెలిసే ఉంటుంది. ఇదీ కథా నేపథ్యం'' అని కొరటాల క్లారిటీ ఇచ్చారు. అది ఎలా ఉంటుందో లీక్డ్ పిక్స్ చూస్తే క్లారిటీ వచ్చింది.
సాధారణంగా మీరు వాటర్ ట్యాంక్స్ లేదంటే మిల్క్ ట్యాంక్స్ చూసి ఉంటారు. కానీ, కొరటాల శివ బ్లడ్ ట్యాంక్స్ రెడీ చేయించారు. రక్తం రుచి మరిగిన మృగాల కోసం వాటిని తరలిస్తున్నారు ఏమో! మొదట ఆ పిక్స్ లీక్ అయినప్పుడు చాలా మంది ఫేక్ అనుకున్నారు. అయితే, ఆ ఫోటోలు డిలీట్ చేయమని లేదంటే అకౌంట్స్ రిపోర్ట్ కొడతామని చిత్ర బృందానికి చెందిన ఒకరు ట్వీట్ చేశారు. ఒక విధంగా అభిమానులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. దాంతో ఆ ఫోటోలు ఒరిజినల్ అని చాలా మందికి క్లారిటీ వచ్చింది. అదీ సంగతి!
Also Read : జూలై ఎండింగ్‌లో సినిమా రిలీజ్ - పవన్ కెరీర్‌లోనే ఇంత స్పీడ్ ఎప్పుడూ లేదేమో!
Dear Tarakians
— Suresh NTR 🇮🇳 (@SureshNajani999) March 24, 2023
Ee tweet ni retweet chesi nannu follow avvandi. 💯follow back chesta
1. Retweet🔁
2. Follow me
3. 💯Follow back💯@tarak9999 #JrNTR #ManOfMassesNTR #NTR30 #PromoteTarakians #NTR30StormBegins pic.twitter.com/npVg14lDeA
మృగాలు వంటి మనుషులను భయపెట్టే మగాడిగా, చాలా శక్తివంతంగా ఎన్టీఆర్ క్యారెక్టర్ ఉంటుందని పరోక్షంగా ఆయన చెప్పేశారు. ''భయం ఉండాలి, భయం అవసరం కూడా! భయపెట్టడానికి సినిమాలో ప్రధాన పాత్ర (హీరో) ఏ స్థాయికి వెళతాడనేది ఎమోషనల్ రైడ్. ఇది నా బెస్ట్ సినిమా అని ప్రామిస్ చేస్తున్నాను'' అని కొరటాల శివ వివరించారు.
నా సోదరుడితో రెండోసారి!
ఎన్టీఆర్ హీరోగా సినిమా చేయడం గురించి కొరటాల శివ మాట్లాడుతూ ''ఎన్టీఆర్ గారితో రెండోసారి సినిమా చేస్తున్నాను. 'జనతా గ్యారేజ్' తర్వాత ఆయన్ను డైరెక్ట్ చేస్తున్నాను. మళ్ళీ ఆయనతో పని చేయడం నిజంగా అదృష్టం. ఈ తరంలో అత్యుత్తమ నటులలో ఎన్టీఆర్ ఒకరు. నాకు సోదరుడితో సమానం'' అని వివరించారు. ఈ చిత్రానికి గొప్ప సాంకేతిక బృందం కుదిరిందని ఆయన పేర్కొన్నారు.
నేను తిరిగి వస్తున్నా...
థాంక్యూ తారక్ - అనిరుధ్
ఎన్టీఆర్ 30కి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. 'అజ్ఞాతవాసి', 'జెర్సీ', 'గ్యాంగ్ లీడర్' సినిమాల తర్వాత తెలుగులో ఆయన చేస్తున్న చిత్రమిది. సినిమా ప్రారంభోత్సవంలో అనిరుధ్ మాట్లాడుతూ ''ఏడాది క్రితం దర్శకుడు కొరటాల శివ గారిని కలిశా. ఎప్పుడు కలిసినా ఓ మంచి ఫీలింగ్ ఉంటుంది. ఆయన ఊహలో నేను ఓ భాగం కావడం సంతోషంగా ఉంది. ఆయన ఊహ భారీగా ఉంటుంది. ప్రాణం పోయగలనని అనుకుంటున్నా. లెజెండ్స్ తో కలిసి పని చేసే అవకాశం ఈ సినిమాతో లభించింది. మోషన్ పోస్టర్ సంగీతానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు సంగీతం అందించే ఛాన్స్ ఇచ్చిన శివ గారికి, తారక్ గారికి థాంక్స్... నేను తిరిగి వస్తున్నాను'' అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో రత్నవేలు, శ్రీకర్ ప్రసాద్ తదితరులు మాట్లాడారు.
Also Read : 'జాన్ విక్ 4' రివ్యూ : కీనూ రీవ్స్ హాలీవుడ్ సినిమా ఎలా ఉందంటే?