News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Manoj vs Vishnu : చావడానికి అయినా సిద్ధమే - విష్ణుతో గొడవపై ఓపెన్ అయిన మనోజ్ 

సారథి ఇంటికి విష్ణు మంచు వచ్చి గొడవ చేసిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి డిలీట్ చేసిన మంచు మనోజ్, తొలిసారి ఆ గొడవ మీద పరోక్షంగా స్పందించారు. 

FOLLOW US: 
Share:

మంచు బ్రదర్స్ విష్ణు, మనోజ్ మధ్య గొడవ జరిగింది. అందులో ఎవరికీ సందేహాలు లేవు. స్వయంగా మంచు మనోజ్ తమ మధ్య గొడవను బయట పెట్టారు. అన్నయ్యకు, ఆయనకు మధ్య ఏం జరిగింది? అసలు గొడవకు కారణం ఏమిటి? అనేది పక్కన పెడితే... ఇప్పుడు ఈ గొడవ కొత్త మలుపు తీసుకుంది. సోషల్ మీడియా సాక్షిగా గొడవపై మంచు మనోజ్ పరోక్షంగా స్పందించారు. 

సారథి ఇంటి దగ్గరకు విష్ణు వెళ్లడంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేసిన దృశ్యాలు మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి డిలీట్ చేశారు. 'రోడ్డున పడ్డ మంచు ఫ్యామిలీ', 'మంచు ఇంట్లో లొల్లి' పేరుతో న్యూస్ ఛానళ్లలో కథనాలు ప్రసారం అయ్యాయి. అయితే, తమ మధ్య జరిగినది చిన్న గొడవ అని విష్ణు చెప్పారు. కానీ, అసలు విషయం వేరుగా ఉన్నట్లు, గొడవ ఇంకా సెటిల్ అవ్వలేదని మనోజ్ పోస్ట్ చూస్తే అర్థం అవుతోంది.
 
చావనైనా చస్తాను కానీ...
''negativity is the enemy of creativity'' (నెగిటివిటీయే క్రిటివిటీకి శత్రువు) అని మంచు మనోజ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. దాని అర్థం ఏమిటి? తన అన్నయ్య విష్ణు మంచు నెగిటివిటీతో ఉన్నారని చెబుతున్నారా? అన్నయ్య కోపానికి కారణం నెగిటివిటీ అని స్పష్టం చేశారా?

మనోజ్ మరో కోట్ కూడా పోస్ట్ చేశారు. ''I would rather die fighting for what is right, than live passively amidst all that is wrong'' అని! అంటే...  ''ఏమీ జరగనట్టు (తప్పుల్ని) అలా చూస్తూ ఉండిపోవడం కన్నా... నిజం కోసం పోరాటం చేసి చావడానికైనా సిద్ధమే'' అని ఆ కోట్ సారాంశం. ''మీరు బతకండి. మమ్మల్ని బతకనివ్వండి. అందరికీ ప్రేమతో'' అని మంచు మనోజ్ పేర్కొన్నారు. 

Also Read నువ్వు మారవా విష్ణు? - మంచు బ్రదర్స్ గొడవలో శాక్రిఫైజింగ్ స్టార్ సెన్సేషనల్ కామెంట్స్

View this post on Instagram
 
A post shared by Manoj Manchu (@manojkmanchu)

ఇప్పుడు తెలుగు చిత్రసీమలో, ప్రజల్లో అన్నదమ్ముల మధ్య గొడవ గురించి వేడి వేడిగా చర్చలు జరుగుతున్నాయి. అసలు, గొడవకు కారణాలు ఏమిటి? అని చాలా మంది డిస్కషన్ చేస్తున్నారు. 

Also Read 'ఆర్ఆర్ఆర్'కు ఏడాది - సినిమాకు ఎన్ని అవార్డులు వచ్చాయో తెలుసా?

సారథితో వాగ్వాదాన్ని ఆపకుండా దాన్ని మనోజ్ వీడియో తీశాడని, అది చిన్న గొడవ అని, తమ మధ్య ఇలాంటి చిన్న చిన్న గొడవలు సర్వ సాధారణమే అని విష్ణు మంచు పేర్కొన్నారు. అయినా మనోజ్ చిన్న వాడని, ఇది స్పందించాల్సినంత పెద్ద విషయం కాదని చెప్పారు. ఏదో ఆవేశంలో మనోజ్ అది వీడియో తీసి పోస్ట్ చేశాడని, దీన్ని భూతద్దంలో చూడొద్దని కోరారు విష్ణు. ఇప్పుడు మనోజ్ పోస్ట్ మీద ఆయన ఏ విధాంగా స్పందిస్తారో చూడాలి. 

విష్ణు, మనోజ్ మధ్య గొడవకు కారణమైన సారథి ఎవరు? అని ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది. తొలుత విష్ణు దగ్గర కొన్ని రోజులు పని చేసిన సారథి.. ఇప్పుడు మనోజ్ దగ్గర పని చేస్తున్నారని, ఆ విషయంలో అన్నదమ్ముల మధ్య చిన్నపాటి గొడవ జరిగిందని టాక్. సారథి ఇంటికి విష్ణు వెళ్లిన సమయంలో మనోజ్ వీడియో తీశారు. 

Published at : 25 Mar 2023 01:13 PM (IST) Tags: Manchu Manoj Vishnu Manchu Manoj vs Vishnu Manoj Reacts On Vishnu Manchu Family Issues

ఇవి కూడా చూడండి

వరుణ్ తేజ్ మూవీకి భారీ డీల్ -  'ఆపరేషన్ వాలెంటైన్' నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా?

వరుణ్ తేజ్ మూవీకి భారీ డీల్ - 'ఆపరేషన్ వాలెంటైన్' నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా?

Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ

Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ

BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

BhagavanthKesari:  గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

Vijay Deverakonda - Rashmika: డార్లింగ్ అంటూ దేవరకొండ ట్వీట్ - నువ్వు ఎప్పటికీ బెస్ట్ అంటూ రష్మిక రిప్లై!

Vijay Deverakonda - Rashmika: డార్లింగ్ అంటూ దేవరకొండ ట్వీట్ - నువ్వు ఎప్పటికీ బెస్ట్ అంటూ రష్మిక రిప్లై!

Siddharth: కర్ణాటకలో హీరో సిద్ధార్థ్‌కు ఘోర అవమానం, తమిళోడివి అంటూ వేదికపై ఉండగానే..

Siddharth: కర్ణాటకలో హీరో సిద్ధార్థ్‌కు ఘోర అవమానం, తమిళోడివి అంటూ వేదికపై ఉండగానే..

టాప్ స్టోరీస్

Telangana BJP : సర్వశక్తులు కూడగట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నం - అగ్రనేతల పర్యటనలు మేలు చేస్తాయా ?

Telangana BJP :  సర్వశక్తులు కూడగట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నం - అగ్రనేతల పర్యటనలు మేలు చేస్తాయా ?

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Cyber Crime: గణేష్‌ ఉత్సవాల లక్కీ డ్రాలో ఐఫోన్‌ 15-నమ్మితే అకౌంట్‌ ఖాళీ అయినట్టే

Cyber Crime: గణేష్‌ ఉత్సవాల లక్కీ డ్రాలో ఐఫోన్‌ 15-నమ్మితే అకౌంట్‌ ఖాళీ అయినట్టే