News
News
X

Chiranjeevi Praja Rajyam : ప్రజారాజ్యం అప్పులు తీర్చేందుకు ఆస్తులు అమ్మిన చిరంజీవి

ప్రజారాజ్యం పార్టీ కోసం చేసిన అప్పులు తీర్చడం కోసం చిరంజీవి తన ఆస్తులు అమ్మారని నిర్మాత ఎన్వీ ప్రసాద్ తెలిపారు. అంతే కాదు... జనసేన పార్టీ ఆవిర్భావానికి కారణం ఏంటో కూడా చెప్పారు. 

FOLLOW US: 
Share:

'గాడ్ ఫాదర్' సక్సెస్ మీట్‌లో నిర్మాత ఎన్వీ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ప్రజా రాజ్యం' కోసం చిరంజీవి ఎన్ని కష్టాలు పడినది పేర్కొన్న ఆయన... ఆ పార్టీ నడపడం కోసం చేసిన అప్పులు తీర్చడం కోసం చెన్నైలో కృష్ణా గార్డెన్స్ అమ్మేశారని తెలిపారు. 'జనసేన' పుట్టుకకు కారణాలు చెప్పడంతో పాటు... ఇకనైనా చిరంజీవి కఠినంగా వ్యవహరించాలని సెలవిచ్చారు. 

'గాడ్ ఫాదర్' సక్సెస్ మీట్ (Godfather Success Meet) రాజకీయ వర్గాల్లో సెగలు రేపింది. సక్సెస్ మీట్ స్టేజి మీద ఇటీవల చిరంజీవిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహా రావు (Garikapati Narasimha Rao) పై దర్శకుడు కె.ఎస్. రవీంద్ర (బాబీ), సినిమాటోగ్రాఫర్ చోటా కె. నాయుడు, గేయ రచయిత అనంత శ్రీరామ్ వంటివారు విమర్శలు గుప్పించారు. అదంతా ఒక ఎత్తు అయితే... నిర్మాత ఎన్వీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు మరో ఎత్తు. 

చిరంజీవికి అత్యంత సన్నిహితులుగా ఎన్వీ ప్రసాద్‌కు పేరు ఉంది. ఇండస్ట్రీలో ఆయన్ను మెగా మనిషిగా చూసే వారు ఎక్కువ. 'గాడ్ ఫాదర్' సక్సెస్ మీట్‌లో ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. చిరంజీవి ప్రజారాజ్యాన్ని నిర్వహించటానికి ఎంత కష్టపడ్డారో వివరించే ప్రయత్నం చేశారు ఎన్వీ ప్రసాద్. ప్రజారాజ్యం తరపున చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేసినప్పుడు ఆ ఎలక్షన్ బాధ్యతలు చూసిన వ్యక్తిగా అప్పటి పార్టీ అంతర్గత విషయాలను బయట పెట్టారు

ప్రజారాజ్యం పార్టీ కోసం చేసిన అప్పులు తీర్చడానికి...
కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యాన్ని చిరంజీవి విలీనం చేసినప్పుడు చాలా అప్పులు మిగిలాయని అయితే వాటిని తీర్చటానికి చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్స్ పక్కన ఉన్న కృష్ణా గార్డెన్స్ (Krishna Gardens Chennai)ను చిరంజీవి అమ్మారని సంచలన విషయాలు బయట పెట్టారు ఎన్వీ ప్రసాద్. ఆ అప్పులన్నీ తీర్చిన తర్వాతే తిరిగి సినిమాల్లోకి వెళ్లారని ఎన్వీ ప్రసాద్ స్పష్టం చేశారు. అయినా చిరంజీవిని టార్గెట్ చేస్తూ అప్పులు మిగిల్చి వెళ్లిపోయారని ప్రచారం చేశారని ఆయన మండిపడ్డారు. తనపైన ఎన్ని విమర్శలు వచ్చినా పెద్ద మనసు చేసుకుని చిరంజీవి మౌనంగా ఉండటం అవతలి వ్యక్తులు చెలరేగిపోవటానికి ఓ కారణం అని ఆయన వివరించారు.

జనసేన పార్టీ ఆవిర్భావం వెనుక అసలు సంగతి అదే!
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కోసం చేసిన అప్పులు తీర్చడం, ఆస్తులు అమ్మడం వంటి విషయాలతో ఎన్వీ ప్రసాద్ ఆగలేదు. చిరంజీవి పెద్దరికం ప్రదర్శిస్తూ విమర్శలను సహిస్తున్నా... ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం ఆ రకం కాదన్నారు. అన్నయ్యను మాట్లాడిన వాళ్లకు బుద్ధి చెప్పాలనే జనసేన పార్టీని స్థాపించినట్లు చెప్పారు. అన్నయ్య చిరంజీవి ఆశయాలను నెరవేర్చటంతో పాటు పొలిటికల్ గా చిరంజీవిని ఇబ్బంది పెట్టిన వాళ్ల పని పట్టడం జనసేన లక్ష్యమని వ్యాఖ్యానించారు. ప్రజారాజ్యం ఆగ్రహం, ఆవేదన నుంచి పుట్టిన పార్టీగా జనసేనను ఎన్వీ ప్రసాద్ అభివర్ణించారు.

Also Read : Chiranjeevi Emotional Speech At Godfather Success Meet : 'మెగా' ఆవేదన - చిరంజీవి పనైపోయిందని ప్రచారం చేసింది ఎవరు?

అభిమానులకు సందేశమా?
చిరంజీవి సన్నిహితుడు ఎన్వీ ప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హీట్ ను పెంచుతున్నాయి. మొన్నటికి మొన్న జనసేన కు తన మద్దతు భవిష్యత్తులో ఉండొచ్చని చిరంజీవి చెప్పటం, పవన్ కల్యాణ్ ను లాంటి నాయకుడు ప్రజలకు కావాలని అనటం..ఇప్పుడు చిరంజీవి ముందే ఎన్వీ ప్రసాద్ జనసేన పుట్టడానికి కారణాలు అంటూ చెప్పిన వ్యాఖ్యలు ఇవన్నీ కలగలిసి ఏపీ రాజకీయాల్లో అన్నదమ్ములు కలిసి క్రియాశీలక పాత్ర పోషించనున్నారనే సందేశాన్ని అభిమానుల్లోకి తీసుకెళ్తున్నాయనే టాక్ నడుస్తోంది. లేదంటే అసందర్భంగా 'గాడ్ ఫాదర్' సక్సెస్ మీట్ లో ప్రజారాజ్యం గురించి, జనసేన పార్టీ గురించి చిరంజీవి ముందే ఓ ప్రొడ్యూసర్ ఎందుకిలా మాట్లాడతారని అంతా చర్చించుకుంటున్నారు.

Also Read : Chiranjeevi Vs Garikapati : 'గాడ్ ఫాదర్' సక్సెస్ మీట్‌లోనూ గరికపాటి గొడవ - మెగా ఫ్యాన్స్ ఫైర్

Published at : 09 Oct 2022 02:52 PM (IST) Tags: NV Prasad Chiranjeevi NV Prasad Comments On Praja Rajyam Chiranjeevi Praja Rajyam Party Praja Rajyam Party Debts Chiranjeevi Shocking Revelation

సంబంధిత కథనాలు

Shaakuntalam Movie : సమంత సినిమాకు ఎందుకిలా? శాకుంతల, దుష్యంతుల ప్రేమకథకు మోక్షం ఎప్పుడు?

Shaakuntalam Movie : సమంత సినిమాకు ఎందుకిలా? శాకుంతల, దుష్యంతుల ప్రేమకథకు మోక్షం ఎప్పుడు?

The Power: అమ్మాయిల ఒంటి నుంచి నిజంగా కరెంటు పుడితే - ‘ది పవర్’ టీజర్ మైండ్ బ్లోయింగ్!

The Power: అమ్మాయిల ఒంటి నుంచి నిజంగా కరెంటు పుడితే - ‘ది పవర్’ టీజర్ మైండ్ బ్లోయింగ్!

PSPK In Unstoppable : ఒక్క రోజు ముందుకు పవర్ ఫైనల్ - రేపు రాత్రి నుంచి ఆహాలో బాలకృష్ణ, పవన్ సందడి

PSPK In Unstoppable : ఒక్క రోజు ముందుకు పవర్ ఫైనల్ - రేపు రాత్రి నుంచి ఆహాలో బాలకృష్ణ, పవన్ సందడి

Sasivadane Title Song : హరీష్ శంకర్ విడుదల చేసిన 'శశివదనే' పాట - కోమలితో రక్షిత్ ప్రేమంట!  

Sasivadane Title Song : హరీష్ శంకర్ విడుదల చేసిన 'శశివదనే' పాట - కోమలితో రక్షిత్ ప్రేమంట!  

HBD Brahmanandam: నవ్వుతూ, నవ్విస్తూ వుండాలి - బ్రహ్మానందానికి చిరంజీవి బర్త్‌డే సర్‌ప్రైజ్, ఇంటికెళ్లి మరి విసెష్!

HBD Brahmanandam: నవ్వుతూ, నవ్విస్తూ వుండాలి - బ్రహ్మానందానికి చిరంజీవి బర్త్‌డే సర్‌ప్రైజ్, ఇంటికెళ్లి మరి విసెష్!

టాప్ స్టోరీస్

AP Capital Vizag: ఏపీ క్యాపిటల్ అని గూగుల్ లో సెర్చ్ చేసినా విశాఖనే వస్తుంది: స్పీకర్ తమ్మినేని

AP Capital Vizag: ఏపీ క్యాపిటల్ అని గూగుల్ లో సెర్చ్ చేసినా విశాఖనే వస్తుంది: స్పీకర్ తమ్మినేని

Minister Gudivada Amarnath : అది ఫోన్ ట్యాపింగ్ కాదు కాల్ రికార్డింగ్, కోటంరెడ్డికి మంత్రి అమర్నాథ్ కౌంటర్

Minister Gudivada Amarnath : అది ఫోన్ ట్యాపింగ్ కాదు కాల్ రికార్డింగ్, కోటంరెడ్డికి మంత్రి అమర్నాథ్ కౌంటర్

Mamata Banerjee: నాకో అరగంట టైమ్ ఇస్తే ఇంత కన్నా మంచి బడ్జెట్ తెస్తా - మమతా బెనర్జీ

Mamata Banerjee: నాకో అరగంట టైమ్ ఇస్తే ఇంత కన్నా మంచి బడ్జెట్ తెస్తా - మమతా బెనర్జీ

Samantha Sorry To VD Fans : విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన సమంత - ఎందుకంటే?

Samantha Sorry To VD Fans : విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన సమంత - ఎందుకంటే?